Joshi
-
వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం.. భార్య బాలీవుడ్ నటి: ఎవరీ బిలియనీర్? (ఫోటోలు)
-
ప్రముఖ దర్శకుడి ఇంట్లో దొంగతనం చేసిన సర్పంచ్ భర్త
మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా జోషికి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు ఆయన సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడు అభిలాష్ కూడా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఆయన నివాసంలో సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఆభరణాలు చోరీ చేశారు. ఈ కేసులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుడి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన ఇర్ఫాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పోలీసులు వెళ్లడించారు. బిహార్‌కు చెందిన ఇర్ఫాన్ ఒక గ్రామ సర్పంచ్ భర్త అని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ దృశ్యాల ద్వారా నిందితుడిని గుర్తించగా పరారీలో ఉన్న అతడిని కర్ణాటక పోలీసుల సాయంతో ఉడిపి జిల్లాలో అరెస్ట్ చేశారు. సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియోలో ఇర్ఫాన్ ఉపయోగించిన కారు నంబర్ క్లియర్‌గా కనిపించడంతో అతన్ని పట్టుకోవడం సులభం అయిందని కొచ్చి నగర పోలీసు కమిషనర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఆ కారు వెనుక భాగంలో గ్రామ సర్పంచ్ అనే బోర్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇర్ఫాన్ పక్కా ప్లాన్‌తో ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ ధనవంతుల నివాసాలే టార్గెట్ చేస్తున్నాడు. దొంగతనంలో భాగంగా డబ్బులు, నగలు దొంగిలించి బిహార్‌లోని పేద ప్రజలకు పంచుతున్నాడని సమాచారం.. ఈ విషయం నిజమేనా అని ఓ విలేకరి పోలీసులను ప్రశ్నించగా.. అందుకు సరైన సమాధానం వారి నుంచి రాలేదు. తమ దృష్టిలో ఇర్ఫాన్ ఓ నిందితుడంటూ పోలీసులు పేర్కొన్నారు. ఇర్ఫాన్‌పై ఆరు రాష్ట్రాల్లో 19 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతనెలలోనే జైలు నుంచి ఆయన విడుదలయ్యారని వారు తెలిపారు. ప్రస్తుతం ఇర్ఫాన్ నుంచి రూ. కోటీ 20 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నిందితుడు ఏప్రిల్ 20న కొచ్చికి వచ్చాడని తెలిపారు. నగరంలో విలాసవంతంగా ఉండే ప్రాంతాల గురించి ఆరా తీసి ప్లాన్ వేసినట్లు చెప్పారు. అయితే ఈ దొంగతనం జరిగినప్పుడు జోషీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దొంగతనం తెల్లవారుజామున జరగడంతో వారు నిద్రలో ఉన్నట్లు సమాచారం. -
ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం?
అయోధ్యలో నేడు జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరకావడంలేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన చలి వాతావరణం కారణంగా అద్వాని అయోధ్యకు వెళ్లడం లేదని సమాచారం. రామమందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన లాల్ కృష్ణ అద్వానీతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. పెరుగుతున్న వయస్సు, ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా ఈ సీనియర్ నేతలిద్దరూ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాల్ కృష్ణ అద్వానీ 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో 1990లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. ‘మందిర్ వహీ బనాయేంగే’ నినాదంతో లాల్ కృష్ణ అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్లారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్‌తో పాటు ఇతర ప్రముఖులు స్వయంగా ఎల్‌కె అద్వానీ ఇంటికివెళ్లి, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘96 ఏళ్ల వయస్సులో ఉన్న లాల్‌కృష్ణ అద్వానీ,90 ఏళ్ల వయస్సు కలిగిన మురళీ మనోహర్ జోషిలను ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించాం. అయితే వారు వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేని స్థితిలో ఉన్నారని’ తెలిపారు. -
ఆ ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది! అదే!..ఆర్ట్ ఆఫ్ జోషిగా..
‘ఈ పనికి నేను తగను’ అనుకునే వాళ్లు కొందరు. ‘తగ్గేదే లే’ అని ముందుకు వెళ్లే వాళ్లు కొందరు. రెండో వర్గం వారికి తమ దారిలో అవరోధాలు ఎదురుకావచ్చు. అయితే వారిలోని ఉత్సాహ శక్తి ఆ అవరోధాలను అధిగమించేలా చేసి విజేతను చేస్తుంది. సౌరవ్ జోషి ఈ కోవకు చెందిన కుర్రాడు. 24 సంవత్సరాల జోషి ఫోర్బ్స్ ‘టాప్ డిజిటల్ స్టార్స్–2023’లో చోటు సంపాదించాడు...జోషి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని ఆల్మోర. హరియాణాలోని హన్సిలో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాడు. తండ్రి కార్పెంటర్. తల్లి గృహిణి. ఇంటర్మీడియెట్‌లో ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఈ చానల్లో తన స్కెచ్–మేకింగ్ వీడియోలను పోస్ట్ చేసేవాడు. తొలి రోజుల్లో ‘హౌ ఐ డ్రా యంఎస్ ధోనీ’ టైటిల్‌తో ఒక వీడియోను అప్లోడ్ చేశాడు. మొదట్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే లాక్డౌన్ టైమ్‌లో ఈ వీడియో పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఉత్సాహంతో ‘365 వీడియోస్ ఇన్ 365 డేస్’ ఛాలెంజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జోషి. ఈ చాలెంజ్ అతడి జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. సౌరవ్ జోషిని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఏ వీడియో చేసినా లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం మొదలైంది. పన్నెండు మిలియన్ల సబ్స్క్రైబర్లతో జోషి చానల్ ‘ఫాస్టెస్ట్–గ్రోయింగ్ యూట్యూబ్ చానల్’జాబితాలో చేరింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు జోషి. జోషి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడమే కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితినీ మెరుగుపరిచాడు జోషి. ‘ఇప్పటికీ ఇది నిజమా? కలా? అని అనుకుంటాను. మొదట్లో వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. చాలా నిరాశగా అనిపించేది. 365 డేస్ ఐడియా నా జీవితాన్నే మార్చేసింది’ అంటాడు జోషి. షేడింగ్ టిప్స్ ఫర్ బిగినర్స్, హౌ టూ డ్రా ఏ పర్ఫెక్ట్ ఐ, హూ టూ యూజ్ చార్కోల్ పెన్సిల్, డ్రాయింగ్ టూల్స్ ఫర్ బిగినర్స్... ఒకటా రెండా జోషి చానల్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు పాపులర్ అయ్యాయి. ఎంతోమందిని ఆర్టిస్ట్‌లను చేశాయి. ‘మీరు వయసులో నా కంటే చాలా చిన్నవాళ్లు. నేను అప్పుడెప్పుడో బొమ్మలు వేసేవాడిని. ఆ తరువాత ఉద్యోగ జీవితంలో పడి డ్రాయింగ్ పెన్సిల్‌కు దూరమయ్యాను. మీ వీడియోలు చూసిన తరువాత మళ్లీ పెన్సిల్, పేపర్ పట్టాను. నేను మళ్లీ ఆర్టిస్ట్‌గా మారడానికి మీరే కారణం’ .....ఇలాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది ఎందుకూ పనికి రాని వీడియో’లాంటి ఘాటైన కామెంట్స్ కూడా ప్రేక్షకుల నుంచి వస్తుంటాయి. అయితే ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు కృంగిపోవడం అంటూ జోషి విషయంలో జరగదు. రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆర్ట్‌లోనే కాదు ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్లోనూ దూసుకుపోతున్నాడు సౌరవ్ జోషి. ఒక్క ఐడియా చాలు మనం వెళ్లగానే ‘సక్సెస్’ వచ్చి షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకుంటాం. అది జరగకపోయేసరికి నిరాశ పడతాం. ‘ఇది మనకు వర్కవుట్ అయ్యేట్లు లేదు’ అని వెనక్కి వెళ్తాం. సక్సెస్ కావడానికి, కాకపోవడానికి అదృష్టం ప్రమేయం ఎంత మాత్రం ఉండదు. మన టాలెంట్ మీద మనకు ఎంత నమ్మకం ఉంది, విజయం కోసం ఎదురుచూడడంలో ఎంత ఓపిక ఉంది అనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. అందరిలాగే నేను కూడా మొదట్లో బాగా నిరాశపడిపోయాను. అయితే వెనక్కి మాత్రం పోలేదు. మరో సారి ట్రై చేసి చూద్దాం...అని ఒకటికి రెండు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక ఐడియాతో నా జీవితమే మారిపోయింది. – సౌరవ్ జోషి (చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
మహిళపై అఘాయిత్యానికి నేపాల్ యువకుల యత్నం
కందుకూరు: అర్ధరాత్రి ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసిన ముగ్గురు యువకులు అఘాయిత్యానికి విఫలయత్నం చేశారు. దిశ యాప్‌లో వచ్చి న ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు నేపాల్‌కు చెందిన యువకులు కాగా, మరొకరు పట్టణానికి చెందిన యువకుడు. మంగళవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ రామచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనులపై పట్టణానికి వచ్చింది. అయితే ఆలస్యం కావడంతో రాత్రి 11 గంటల వరకు పట్టణంలోనే ఉండిపోయింది. ఆ సమయంలో తమ ఊరికి వెళ్లే బస్సు కోసం పామూరు బస్టాండ్‌లో వేచి చూస్తోంది. అదే సమయంలో కందుకూరు పట్టణంలోని గూర్ఖాలుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన యువకులు కరణ్, జ్యోషిలతో పాటు, పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ఫిరోజ్ ముగ్గురూ మహిళ వద్దకు వచ్చారు. ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని మాచవరం వైపు తీసుకెళుతున్నారు. ఎస్ఆర్ పెట్రోల్ బంకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంది. దీంతో పెట్రోల్ బంకులో పనిచేసే యువకుడు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళకు రక్షణ కల్పించి యువకుల కోసం గాలించారు. అయితే అప్పటికే వారు పారిపోవడంతో ఆటో ఆధారంగా బుధవారం నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
జీడీపీలో ఖ‘నిజ’ లక్ష్యం 2.5 శాతం
సాక్షి, హైదరాబాద్: దేశ జీడీపీలో బొగ్గు, పెట్రోలియం మినహా ఇతర ఖనిజాల వాటాను 2030 నాటికి 2.5 శాతానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్‌లో 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే రాష్ట్రాల గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సును శుక్రవారం ప్రహ్లాద్‌జోషి ప్రారంభించారు. ఖనిజ రంగాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత ఆర్థికరంగంలో భూగర్భ వనరుల రంగం పాత్ర చాలా తక్కువ. పెట్రోలియం, బొగ్గును కూడా కలుపుకుంటే దేశ జీడీపీలో మైనింగ్ రంగం వాటా సుమారు రెండు శాతంగా ఉంది. పెట్రోలియం, బొగ్గును మినహాయిస్తే ఒక శాతానికి అటూ ఇటూగా ఉంది’అని జోషి వెల్లడించారు. వేలం ఆదాయం రాష్ట్రాలకే ఇస్తున్నాం ‘బొగ్గు గనుల వేలం కోసం కేంద్రం ఎన్నో ప్రయాసలకోర్చినా, వచ్చిన ఆదాయం మాత్రం రాష్ట్రాలకే ఇస్తున్నాం. ఈ విధానం ద్వారా రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పనతోపాటు ఆర్థిక రంగానికి ఊతం లభిస్తోంది. నామినేషన్ పద్ధతికి స్వస్తి పలుకుతూ 2015లో తెచ్చిన సంస్కరణల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే వంద శాతం ఖనిజాన్వేషణ పూర్తయినా భారత్‌లో మాత్రం పది శాతంగానే ఉంది. ఖనిజాన్వేషనలో నిబంధనలు సరళీకృతం చేసి, అనుమతుల జారీలో లంచగొండితనాన్ని రూపుమాపాం’అని జోషి ప్రకటించారు. ‘లీజు పునరుద్ధరణ, బిడ్డింగ్ నిబంధనల సడలింపుతోపాటు సకాలంలో మైనింగ్ ప్రారంభించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో ఒడిషాసహా పలు రాష్ట్రాలు మైనింగ్ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్టు (ఎన్మెట్)కు రూ.4,050 కోట్లు సమకూరగా, ఖనిజాన్వేషణ కోసం రాష్ట్రాలకు ఇందులో నుంచి నిధులు ఇస్తున్నాం’అని కేంద్రమంత్రి ప్రకటించారు. 2047 నాటికి మైనింగ్ రంగానికి సంబంధించి అమృత్ కాల్ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. గనుల మంత్రిత్వ శాఖ పథకాలు, కార్యక్రమాలను వివరించే ‘ది మైనింగ్ ఎరీనా’డిజిటల్ వేదికను మంత్రి ప్రారంభించారు. ఏపీ సహా 11 రాష్ట్రాల మంత్రులు హాజరు గనులశాఖ మంత్రుల సదస్సుకు ఏపీ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా 11 రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. 19 రాష్ట్రాల అధికారులు, కేంద్రం బొగ్గు, గనులు, స్టీల్ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి ఏడు రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో ఖనిజ లభ్యత సంభావ్యత, మైనింగ్ రంగంలోని సవాళ్లను వివరించారు. -
జోషి మరణం తీరని లోటు: సురవరం
సాక్షి, హైదరాబాద్: సీపీఐ సీనియర్ నాయకుడు పీపీసీ జోషి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జోషి ఆదివారం హైదరాబాద్‌లోని పుప్పాలగూడలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానించారు. నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ కూడా మరో ప్రకటనలో జోషి మృతికి సంతాపం ప్రకటించింది. సాహిత్య సంస్థలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడింది. ఆయన మరణం అభ్యుదయ, వామపక్ష వాదులకు తీరనిలోటని పేర్కొంది. జోషి పార్టీలో పలు కీలక బాధ్యతలతోపాటు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌కు మేనేజర్‌గా, సీపీఐ కేంద్ర కార్యాలయ ట్రెజరర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జోషి తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులయ్యారు. -
ఇంటిపంటలపై రేపు ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు (అర్బన్ ఫార్మింగ్)పై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఈ నెల 24న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు జీడిమెట్ల విలేజ్(పైపులరోడ్డు)లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. అర్బన్ ఫార్మింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ తదితర అంశాలపై కేరళకు చెందిన నిపుణురాలు డాక్టర్ సుశీల శిక్షణ ఇస్తారు. 25 మంది సీనియర్ ఇంటిపంటల సాగుదారులు తమ అనుభవాలను వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా పాల్గొంటారని ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ప్రవేశం ఉచితం. ఆసక్తిగలవారు 79977 24936, 79977 24983, 79977 24985 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. -
ప్రేమ రంగు పులుముకున్న రెండు జీవితాలు
సచిన్ కుందల్కర్ రాసిన ‘కోబాల్ట్ బ్లూ’ నవలలో– పూణేలో ఉండే జోషీల మధ్య తరగతి కుటుంబం– పేరుండని ఆర్టిస్ట్ అయిన ‘అతడి’కి పేయింగ్ గెస్టుగా తమింట్లో చోటిస్తుంది. అతనికి భవిష్యత్తంటే పట్టింపుండదు. స్నేహితులుండరు. తన కుటుంబం/గతం గురించి మాట్లాడడు. కోబాల్ట్ నీలం రంగంటే ఇష్టం. శ్రీమతి జోషీ మాటలు వింటూ, ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. ఆమె పిల్లల్లో, కాలేజీలో చదువుకునే తనయ్కి స్వలింగ సంపర్క ధోరణి ఉంటుంది. అనూజా సాంప్రదాయాలని నమ్మని స్కూలు పిల్ల. తనయ్ అతని గదికి తరచూ వెళ్ళడం పట్ల కుటుంబానికి ఏ అభ్యంతరం ఉండదు కానీ కూతురు మాత్రం మగ పేయింగ్ గెస్టుకు దూరంగా ఉండాలనుకుంటారు తల్లిదండ్రులు. ‘అతను’ అన్నాచెల్లెళ్ళనిద్దరినీ ఆకర్షించి, ఇద్దరితోనూ లైంగిక సంబంధం పెట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు అతనితో ప్రేమలో పడతారు. ‘నేను గడిపే సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ఎంత సామాన్యమైనదో తెలుసుకున్నాను’ అంటాడు తనయ్ అతణ్ని కలుసుకున్న తరువాత.అనూజా పేయింగ్ గెస్టుతో ఆర్నెల్లపాటు పారిపోతుంది. వెనక్కొచ్చాక, ఒకరోజు అతను చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. పుస్తకపు మొదటి భాగానికి కథకుడు తనయ్. పేయింగ్ గెస్టుని సంబోధిస్తూ తన భావాలని వ్యక్తపరుస్తూ, చెల్లెలితో అతను పెట్టుకున్న సంబంధం పట్ల ఆశ్చర్యం, వేదనా వ్యక్తపరుస్తాడు. రెండవ భాగం అనూజా తన దృష్టికోణంతో అతని గురించి డైరీలో రాసుకున్నది. ఈ జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులందరూ ఎలా రాజీపడ్డారన్నదే కథ. అనూజాని తల్లీదండ్రీ సైకియాట్రిస్ట్ వద్దకి తీసుకెళ్ళిన తరువాత, తన పరిస్థితితో రాజీ పడ్డం నేర్చుకుని, చెప్తుంది: ‘అతని గురించి నాకున్న మంచి జ్ఞాపకాలన్నీ అతనితోపాటు పారిపోక ముందటివే. మేము కలిసి గడిపిన సమయం ఎక్కడికి పోయిందో!... ఇంక అతని గురించి ఏడవాలని లేదు గానీ, ‘‘ఎందుకిలా చేశావు!’’ అని మాత్రం ఒకసారి అడగాలనుంది.’ తన ప్రేమికుడితో పారిపోయిన చెల్లెల్ని రోజూ ఎదుర్కోవాల్సిన ఇబ్బంది ఏర్పడినప్పుడు, తనయ్ ముడుచుకు పోయి తన బాధలో ఒంటరివాడవుతాడు. తల్లికీ తండ్రికీ కొడుకు పెట్టుకున్న సంబంధం తెలుసో లేక తెలియనట్టు నటిస్తారో నవల స్పష్టంగా చెప్పదు. ఒకే ఒక వాక్యంలో ఉన్న అస్పష్టమైన సూచన తప్ప. అనూజాకి– అన్నకి అతనితో ఉన్న సంబంధం గురించిన ఎరుక ఉందో లేదో అన్న వివరాలు కూడా ఉండవు. అనూజా గతాన్ని వెనక్కి నెట్టి, ఉద్యోగం వెతుక్కుని తనదైన లోకం సృష్టించుకోగలిగి విముక్తురాలవుతుంది. తనయ్ ముంబై వెళ్ళిపోతాడు. నవలకి ఒక నిర్దిష్టమైన ముగింపేదీ లేదు. ఎన్నో విషయాలు సమాధానం లేకుండానే మిగిలిపోతాయి. 2006లో పబ్లిష్ అయిన మరాఠీ నవల ఇదే పేరుతో వచ్చింది. తర్వాత సినిమా దర్శకుడిగా మారిన కుందల్కర్ ఈ నవల రాసినప్పటికి అతని వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. కవీ, రచయితా, జర్నలిస్టూ అయిన జెరీ పింటో దీన్ని 2013లో ఇంగ్లిష్‌లోకి అనువదించారు. అయితే, అది అనువాదం అనిపించదు. ‘పుస్తకంలో ఉన్న కొన్ని భాగాలకి ఇంగ్లిష్ ప్రత్యామ్నాయాలని వెతికే ప్రయత్నాన్ని విడిచిపెట్టవలిసి వచ్చింది. కొన్ని సంగతులని విడమరిచి చెప్పలేమంతే’ అని అనువాదకుని నోట్లో రాసిన మాటలు వెంటాడతాయి. పేయింగ్ గెస్ట్, అన్నాచెల్లెళ్ళిద్దరికీ ప్రేమికుడవడం అన్నది ఇండియన్ సాహిత్యంలో అరుదైన టాపిక్కే. అంతకన్నా ముఖ్యమైనది ఒకే కథని రెండు కంఠాలతో, రెండు దృష్టికోణాలతో నడిపిన అరుదైన ప్రయోగం. u కృష్ణ వేణి -
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగుల బదిలీలపై వెంటనే స్పందించాలని టీజీవోల చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీని టీజీవో నేతలు కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రమోషన్ కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పీఆర్సీ కమిటీని ప్రకటించాలని, కోరారు. కార్మిక శాఖలో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, భార్యాభర్తలకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయా లని టీజీవో అధ్యక్షురాలు మమత కోరారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ తన పరిధిలో ఉన్న విషయాలపై 10 రోజుల్లో స్పష్టత ఇస్తానని, మిగతా అంశాలపై సీఎంతో చర్చిస్తానని హామీనిచ్చారు. -
నేడు సీబీఐ కోర్టుకు అద్వానీ, జోషీ
-
హరే రామ సారీ కృష్ణా..!
-
ఉమ్మడిగా ఆధిక్యంలో ఖాలిన్ జోషి, హిమ్మత్
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో ఖాలిన్ జోషి, హిమ్మత్ సింగ్ రాయ్‌లు తమ అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు. శుక్రవారం రెండోరౌండ్ తర్వాత ఐదుగురు సంయుక్తంగా తొలి స్థానాన్ని పంచుకోగా... శనివారం గేమ్ తర్వాత వీరిద్దరు మాత్రమే మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఢిల్లీకి చెందిన హిమ్మత్ సింగ్, బెంగళూరుకు చెందిన ఖాలిన్ జోషి మూడురౌండ్లు ముగిసేసరికి 205 పాయింట్లను సాధించారు. వీరిద్దరూ మూడో రౌండ్లో చెరో 70 పాయింట్లు స్కోర్ చేశారు. మరోవైపు శనివారం జరిగిన గేమ్‌లో షమీమ్ ఖాన్ (ఢిల్లీ), మరిముత్తు (బెంగళూరు) అద్భుత ప్రతిభ కనబరిచారు. మూడోరౌండ్లో నిర్దేశించిన 71 పాయింట్లకు గానూ వీరిద్దరు కేవలం 65 పాయింట్లు స్కోర్ చేసి 206 పాయింట్లు సాధించారు. దీంతో ఏకంగా 22 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. సరిగ్గా 71 పాయింట్లు సాధించిన వెటరన్ ప్లేయర్ ముఖేశ్ కుమార్ కూడా 206 స్కోరుతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. రెండో రౌండ్ తర్వాత అగ్రస్థానంలో నిలిచిన అభిజిత్ సింగ్ (చండీగఢ్), కునాల్ బాసిన్ (ఆస్ట్రేలియా) శనివారం మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. అభిజిత్ మూడోరౌండ్లో 73 , బాసిన్ 75 పాయింట్లు స్కోర్ చేసి వరుసగా 7, 12 ర్యాంకులకు పడిపోయారు. -
వికసించిన పద్మాలు
-
వికసించిన పద్మాలు
• యేసుదాసు, జోషి, పవార్సహా ఏడుగురికి విభూషణ్ • మరో ఏడుగురికి పద్మభూషణ్ • ఇన్నాళ్లూ వెలుగులోకి రానివారికే ఈసారి పట్టం • జాబితాలో 19 మంది మహిళలు సహా 89 మంది న్యూఢిల్లీ: సామాజిక, రాజకీయ, శాస్త్రసాంకేతిక, వైద్య, సంగీత, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన 89 మంది ప్రముఖులతో 2017 సంవత్సరానికి గానూ కేంద్రం పద్మ అవార్డుల జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురికి రెండో అత్యున్నత భారత పౌరపురస్కారం పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందిని పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేశారు. రాజకీయ కురువృద్ధులు మురళీ మనోహర్ జోషి (బీజేపీ), శరద్ పవార్ (ఎన్సీపీ)కు ఈసారి పద్మ విభూషణ్ అవార్డులివ్వనున్నారు. ఇషా ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది వాలంటీర్లను తయారుచేసిన ఆధ్మాత్మిక సద్గురు జగ్గీ వాసుదేవ్, ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు (ఇస్రో మాజీ చైర్మన్), ప్రముఖ గాయకుడు యేసుదాసు కూడా విభూషణ్ జాబితాలో ఉన్నారు. వివిధ భాషల్లో 50వేలకు పైగా సినిమా పాటలు పాడిన యేసుదాసు 1975లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్ అవార్డులను అందుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వాలకూ మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది పద్మ అవార్డుల ఎంపికలో.. దేశానికి, సమాజానికి విశేష సేవలందిస్తున్నా.. ఇన్నాళ్లుగా గుర్తింపునకు నోచుకోని గొప్పవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే వివిధ రాష్ట్రాల నుంచి జాబితా తెప్పించుకున్నట్లు వెల్లడించింది. మొత్తం 18 వేల నామినేషన్లు (4వేలు ఆన్లైన్లో వచ్చాయి) రాగా అందులోనుంచి 89 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈసారి పద్మ అవార్డుల్లో మహిళలు 19 మంది, విదేశీయులు–ఎన్నారైలు ఐదుగురుండగా.. మరణానంతరం అవార్డులకు ఎంపికైనవారు ఆరుగురున్నారు. వైద్య, సామాజిక రంగంలో కృషిచేసినవారితోపాటు సంగీత దర్శకులు, గాయకులకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గ్రామీ అవార్డు విజేత, మ్యుజీషియన్ విశ్వ మోహన్ భట్ పద్మ భూషణ్‌కు, గాయకులు కైలాశ్ ఖేర్, అనురాధ పౌడ్వాల్లను పద్మశ్రీ అవార్డులు వరించనున్నాయి. భారత శాస్త్రీయ సంగీతంలో భట్‌కు ప్రత్యేక స్థానముంది. పద్మశ్రీకి ఎంపికవటం పట్ల కైలాశ్ ఖేర్, పౌడ్వాల్‌లు హర్షం వ్యక్తం చేశారు. పండిట్ రవిశంకర్ శిష్యుడైన భట్ ‘మోహన వీణ’ అనే కొత్త రాగాన్ని సృష్టించారు. అయితే సినిమా రంగం నుంచి ప్రముఖులెవరికీ ఈసారి జాబితాలో చోటు దక్కలేదు. ప్రముఖ పాకశాస్త్ర ప్రవీణుడు సంజీవ్ కపూర్, కేరళకు చెందిన ప్రఖ్యాత కథాకళి నృత్యకారుడు చెమంచేరి కున్హిరామన్ నాయర్ (100) కూడా పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. క్రీడారంగం నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, రియో ఒలింపిక్స్ తారలు దీపా కర్మాకర్, సాక్షి మాలిక్లూ పద్మశ్రీ అందుకోనున్నారు. పద్మ విభూషణ్ 1. యేసుదాసు. 2. సద్గురు జగ్గీ వాసుదేవ్, 3. శరద్ పవార్, 4. మురళీ మనోహర్ జోషి, 5. ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు, 6. సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం), 7. పీఏ సంగ్మా (మరణానంతరం) పద్మ భూషణ్ 1. విశ్వమోహన్ భట్, 2. ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది, 3. తెహంతోన్ ఉద్వాదియా, 4. రత్న సుందర్ మహారాజ్, 5. స్వామి నిరంజనానంద సరస్వతి, 6. చో రామస్వామి (మరణానంతరం), 7. యువరాణి మహాచక్రి సిరింధోర్న్ (థాయ్‌లాండ్) మట్టిలో మాణిక్యాలు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మశ్రీ పురస్కార విజేతల్లో అనేక మంది ఇప్పటివరకు మనకు పెద్దగా పరిచయం లేని వారే. పేరు, ప్రతిష్టల కోసం కాకుండా కేవలం సేవా దృక్పథంతో, అవసరంలో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తున్న వీరి వివరాలు క్లుప్తంగా... ⇔ కరీముల్ హక్ (52 ఏళ్లు): పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గుడి జిల్లాకు చెందిన ఈయన అంబులెన్స్ దాదాగా గుర్తింపు పొందారు. తేయాకు తోటల్లో పనిచేసే హక్ తన బైక్‌నే అంబులెన్స్‌గా మార్చారు. ఆపదలో ఉన్న వారికి 24 గీ7 సాయం అందిస్తున్నారు. ఆయన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు అంబులెన్సు సౌకర్యం లేక ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని తలచి, అర్థించిన వారికి సాయం చేస్తున్నారు. ⇔ గిరీష్ భరద్వాజ్ (66 ఏళ్లు): కర్ణాటకకు చెందిన ఈయన సామాజిక కార్యకర్త. మారుమూల గ్రామాల్లో నూటికి పైగా చిన్న చిన్న వంతెనలను నిర్మించి పల్లెలను పట్టణాలతో అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించి ‘సేతు బంధు’గా పేరు తెచ్చుకున్నారు. ⇔ అనురాధా కొయిరాలా (67 ఏళ్లు): నేపాల్‌కు చెందిన ఈమె 12 వేల మంది మహిళలను వ్యభిచార ముఠాల చెరల నుంచి విడిపించి, పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. మరో 45 వేల మంది స్త్రీలు అక్రమ రవాణాకు గురి కాకుండా అడ్డుకోగలిగారు. ⇔ డా. సుబ్రతో దాస్ (51 ఏళ్లు): ‘హైవే మీసయ్య’గా పేరొందిన దాస్ గుజరాత్‌కు చెందిన వారు. జాతీయ రహదారులపై ప్రమాదాలకు గురైన వారికి వైద్య సేవలు అందించడానికి బాటలు వేసిన వారిలో ఈయన ఒకరు. లైఫ్‌లైన్ ఫౌండేషన్‌ను స్థాపించి 4 వేల కి.మీ జాతీయ రహదారుల పరిధిలో కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. ⇔ మీనాక్షి అమ్మ (76 ఏళ్లు): కేరళకు చెందిన మీనాక్షి ఏడేళ్ల వయసులోనే యుద్ధ విద్యలు నేర్చుకుని గత 68 ఏళ్లుగా ఇతరులకు నేర్పిస్తున్నారు. ‘కలరిపయట్టు’అనే యుద్ధ విద్యకు ప్రాచుర్యం కల్పించడానికి కృషి చేస్తున్నారు. ⇔ డా. మాపుస్కర్ (88 ఏళ్లు) : మహారాష్ట్రలోని పుణెకు దగ్గర్లోని దెహు గ్రామానికి చెందిన ఈయన 1960ల నుంచే ఆ పల్లెను బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత గ్రామంగా మార్చడానికి కృషి చేశారు. ఈయనకు ‘స్వచ్ఛతా దూత్’అనే పేరుంది. ⇔ గెనాభాయ్ దర్గాభాయ్ పటేల్ (52 ఏళ్లు): గుజరాత్‌కు చెందిన ఈయన దివ్యాంగుడైన రైతు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఆయన గ్రామం నేడు దానిమ్మ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. దీన్ని సాధించడానికి గెనాభాయ్ ఎనలేని కృషి చేశారు. అందుకే ఈయనకు ‘అనార్ దాదా’అనే పేరు కూడా ఉంది. ⇔ బల్వీర్ సింగ్ సీచేవాల్ (51 ఏళ్లు): పంజాబ్‌కు చెందిన బల్వీర్ సామాజిక కార్యకర్త. 160 కి.మీ పొడవైన కాలీ బీన్ అనే నదికి పునరుజ్జీవం తీసుకురావడానికి అక్కడి యువత, స్వచ్ఛంద సేవకులను ఆయన కదిలించారు. ఈయనకు రస్తేవాలే బాబా. సడకన్వాలే బాబా, ఎకో బాబా లాంటి పలు పేర్లున్నాయి. ⇔ బిపిన్ గంటారా (59 ఏళ్లు): ఈయన పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. కోల్‌కతాలో గత 40 ఏళ్లుగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాలకు వెళ్లి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు.బిపిన్ సోదరుడు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి నుంచి ఆయన అగ్ని ప్రమాద బాధితులకు సహాయం చేస్తున్నారు. ⇔ సునితి సాలమన్: చెన్నైకి చెందిన వైద్యురాలైన ఈమె దేశంలో తొలి ఎయిడ్స్ కేసును గుర్తించారు. 2015లో మరణించారు. ఆమె స్మృత్యర్థం కేంద్రం పద్మ పురస్కారాన్ని ప్రకటించింది. ⇔ భక్తి యాదవ్ (91 ఏళ్లు): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎంబీబీఎస్ డిగ్రీ పొందిన తొలి మహిళ ఈమె. గత 68 ఏళ్లుగా ఇండోర్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికి వేల మంది గర్భిణులకు కాన్పులు చేశారు. ⇔ సుక్రీ బొమ్మగౌడ (58 ఏళ్లు): కర్ణాటకకు చెందిన ఈమె జానపద గాయకురాలు. ‘నైటింగేల్ ఆఫ్ హళక్కి’గా గుర్తింపు పొందారు. ⇔ జితేంద్ర హరిపాల్: ఒడిశాకు చెందిన ఈయన ‘రంగబతీ కీ ఆవాజ్’పేరుతో ప్రాచుర్యం పొందారు. ఒడిశాలో బాగా పాపులర్ అయిన రంగబతీ పాట కోసం ఈయన ఎంతో శ్రమించారు. కోస్లి–సంబాల్‌పురి సంగీతానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ⇔ ఎలా అహ్మద్ (81 ఏళ్లు): అస్సాంకు చెందిన వీరు 1970 నుంచి మహిళల కోసం ప్రత్యేక మేగజీన్ నడుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వెలువడుతున్న ఒకే ఒక్క మహిళా మేగజీన్ ఇదే. -
మోదీ సర్కారుపై తగ్గిన అంచనాలు
నరేంద్ర మోదీ ఏడాది పాలనపై రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఒక మోస్తరు స్థాయికి తగ్గాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన సమస్యల వల్ల డిమాండ్‌ను మెరుగుపర్చలేకపోవడమే కేంద్రంపై అసంతృప్తికి కారణమని పేర్కొంది. మోదీ ప్రభుత్వం రాగానే ఎకానమీ అత్యంత వేగంగా కోలుకుంటుందని, భారీ సంస్కరణలు ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ రెండు విషయాల్లోనూ ప్రభుత్వం కొంత నిరాశపర్చినట్లు క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ ధర్మకీర్తి జోషి తెలిపారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా క్రిసిల్ మోడిఫైడ్ ఎక్స్పెక్టేషన్స్ పేరిట నివేదికను విడుదల చేసింది. ఎన్ఎస్ఈలోని సీఎన్ఎక్స్ 500 సూచీలో 411 కంపెనీల ఫలితాలను ఈ నివేదికలో విశ్లేషించారు. రాబోయే రోజుల్లో స్థూలదేశీయోత్పత్తి 7.9 శాతం వృద్ధి సాధించగలదని, ద్రవ్యోల్బణం 5.8 శాతానికి దిగిరాగలదని క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ప్రభుత్వానికి అధిక ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం మొదలైనవి వారసత్వంగా వచ్చాయని, దీని వల్ల పరిమితస్థాయి పనితీరు మాత్రమే కనపర్చగలుగుతోందని జోషి వివరించారు. మరోవైపు, ఏడాది పాలనలో స్థూల ఆర్థిక పరిస్థితులు, వృద్ధి- ద్రవ్యోల్బణ అంచనాలు మెరుగుపడ్డాయని, కరెంటు ఖాతా లోటు అదుపులోకి వచ్చిందని జోషి చెప్పారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసిందని, వ్యాపారాల నిర్వహణకు అనుకూలంగా నిబంధనలు సడలించడం తదితర చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. తక్షణ రికవరీ కష్టసాధ్యమే.. సానుకూల పరిస్థితులు కొంత మేర ఉన్నా.. ఎకానమీ వేగంగా టర్న్‌ఎరౌండ్ కావడం కష్టసాధ్యమేనని జోషి చెప్పారు. ద్రవ్య, ఆర్థికపరమైన పరిమితులు కారణంగా ప్రభుత్వం స్వల్పకాలికంగా డిమాండ్‌కు ఊతమివ్వలేకపోవచ్చన్నారు. డిమాండ్ లేకపోవడం వల్లే ప్రైవేట్ పెట్టుబడులు అంతగా రావడం లేదని జోషి వివరించారు. ఫలితంగా రికవరీ మందకొడిగా ఉంటోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విని యోగం క్రమంగా పెరుగుతున్న కొద్దీ డిమాండ్ కూడా మెరుగుపడగలదని పేర్కొన్నారు. అయితే, పెట్టుబడులు పెట్టేలా ప్రైవేట్ కంపెనీలను పురిగొల్పేంతగా ఇది ఉండకపోవచ్చని జోషి తెలిపారు. -
చాపరాయిలో విద్యార్థి గల్లంతు
బాధితునిది విజయనగరం జిల్లా బయటపడిన ఇద్దరు విశాఖ విద్యార్థులు డుంబ్రిగుడ: పర్యాటక కేంద్రమైన చాపరాయి గెడ్డలో మంగళవారం సాయంత్రం విశాఖ నగరం గ్లోబల్ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విజయనగరం జిల్లాకు చెందిన జోషి (22) గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నం డైమండ్ పార్కు సమీపంలోని గ్లోబల్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు పాడేరులో జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చారు. అనంతరం డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలపాతాన్ని తిలకించేందుకు మంగళవారం వచ్చారు. చాపరాయి వద్ద ప్రమాదకరంగా ఉన్న ప్రదేశం వద్ద జలపాతాన్ని తిలకిస్తున్న జోషి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు సహ విద్యార్థులు సంధ్య, బషీర్ గెడ్డలో దూకినా కాపాడలేకపోయారు. ఈ ప్రయత్నంలో సంధ్య కూడా ప్రమాదంలో చిక్కుపోవడంతో స్థానిక గిరిజన యువకులు వారిని రక్షించారు. జోషి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో ఇంతవరకు సుమారు 24 మంది వరకు పర్యాటకులు మరణించారు. జలపాతం వద్ద గట్టి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
కావూరి హామీలు
కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం రూ.37,500తో ఆరోగ్యబీమా పథకం. అందరికీ ఉచితం. మొత్తం డబ్బులు ప్రభుత్వమే భరిస్తుంది. కార్మికుల వివరాలు వెంటనే పంపించాలని సెంట్రల్ టెక్స్టైల్ కమిషనర్ జోషీకి ఆదేశం. ఇంతకుముందు బీమా పథకం రూ.7,500 ఉండేది. పనిలో నేర్పరితనం పెంపొందించేందుకు సిరిసిల్లలో రూ.8 కోట్లతో శిక్షణ కేంద్రం ఏర్పాటు. వీవింగ్, వార్పింగ్, సైజింగ్, డైయింగ్, ప్రాసెసింగ్ తదితర అంశాల్లో కార్మికులకు తర్ఫీదు. సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్ ఏర్పాటు కోసం రానున్న బడ్జెట్లో నిధులు కేటాయింపునకు ఆర్థిక మంత్రికి సిఫారసు. ఒక్కొక్కరికి అధునాతన మగ్గాల కోసం రూ.50 లక్షల వరకు రుణం అందించేందుకు సంసిద్ధత. వ్యక్తిగత షెడ్లకు, సామూహిక(గ్రూప్) షెడ్లకు రుణాలు. వీటి మూలధనం రెట్టింపు. పత్తి నుంచి గార్మెంట్స్ తయారై మార్కెట్ చేసుకునే దాకా సిరిసిల్ల పరిశ్రమను ఆదుకుంటామని హామీ. పవర్‌లూం సర్వీస్ సెంటర్ సిరిసిల్లలో ఏర్పాటుకు కృషి. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు ఈ నెల 31 లోపు మాఫీ చేస్తున్నట్లు ప్రకటన.సిరిసిల్లలో యారన్ బ్యాంకు(నూలు డిపో) నెలరోజులలోపు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం.నిరాశ సిరిస్లిలను స్పెషల్ టెక్స్టైల్ జోన్‌గా ప్రకటించకపోవడం... అపెరల్ పార్క్ ఏర్పాటుపై ప్రకటన చేయకపోవడం కార్మికవర్గాలను నిరాశకు గురిచేసింది.