
సచివాలయంలో సీఎస్ ఎస్‌కే జోషీని కలిసిన టీజీవో నేతలు
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగుల బదిలీలపై వెంటనే స్పందించాలని టీజీవోల చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీని టీజీవో నేతలు కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రమోషన్ కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పీఆర్‌సీ కమిటీని ప్రకటించాలని, కోరారు. కార్మిక శాఖలో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, భార్యాభర్తలకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయా లని టీజీవో అధ్యక్షురాలు మమత కోరారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ తన పరిధిలో ఉన్న విషయాలపై 10 రోజుల్లో స్పష్టత ఇస్తానని, మిగతా అంశాలపై సీఎంతో చర్చిస్తానని హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment