మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెంటనే కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈనెల 14న హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఓబీసీ సత్యాగ్రహ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
గురువారం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, జాతీయ కార్యదర్శి ఎన్.సాయికిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్, అభినేష్»ొమ్మ ప్రవీణ్ కుమార్ తదితరులు శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కులగణన చేసి రిజర్వేషన్స్‌పై ఉన్న 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఓబీసీ నేషనల్ ఫెలోషిప్‌లను 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా హైకోర్టు చెప్పిన విధంగా మూడు నెలల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని కులాల గణన చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment