సాక్షి, మహబూబ్‌నగర్: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇటీవలే పార్టీ కార్యకర్త వరద భాస్కర్‌ను పోలీసులు కొట్టారనే ఆరోపణపై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. మరో పదిహేను మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఇటీవల బీఆర్‌ఎస్ కార్యకర్తపై వన్‌టౌన్ సీఐ దౌర్జన్యం చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని బీఆర్‌ఎస్ కార్యకర్తను రబ్బరు బెల్టుతో సీఐ కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఐ తీరును వ్యతిరేకిస్తూ మహబూబ్‌నగర్ పీఎస్ ముందు శ్రీనివాస్‌గౌడ్ ఆందోళనకు దిగుతూ.. పోలీసుల తీరుపై శ్రీనివాస్‌గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment