![BJP MP DK Aruna Takes On Congress Government](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Dk%20aruna.jpg.webp?itok=t-OxBgy7)
మహబూబ్‌నగర్ దేశంలో కాంగ్రేస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని,ప్రతిపక్ష నేతగా రాహూల్ గాంధీ విఫలమయ్యారని మహబూబ్ నగర్ ఎంపీ,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు డీకే అరుణ.ప్రదాని మోదీ అభివృద్ధి నమూనాను నమ్మి ఢిల్లీలో ప్రజలు బీజేపీని గెలిపించారని పొగిడిన డీకే అరుణ.. మాజీ సీఎం కేజ్రీవాల్ అవినీతిని ప్రజలు ఎండగెట్టారని విమర్శించారు.
స్దానిక సంస్దల ఎన్నికల్లో లబ్దికోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకోమాట చెబుతుందని,రుణమాఫీ, రైతు భరోసా అమలులో ప్రభుత్వం విఫలమయ్యిందని,కాంగ్రెస్ ఆరు గ్యాంరెంటీలు అటకెక్కాయని ఆమె విమర్శించారు.ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చకుంటే కేంద్ర నిధులు ఇవ్వదని,ప్రధాని ఆవాజ్ యోజన పథకంలో ఆయన ఫోటో లేకుంటే కేంద్రం నిధులు ఎందుకిస్తుందని ఆమె ప్రశ్నించారు. ఏ పథకాలు అమలు చేయలేక స్ధానిక సంస్దల ఎన్నికలపై ప్రభుత్వం హాడావిడి చేస్తోందని ఈఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఇచ్చిన హామీలు అమలవుతాయన్నారు
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,బీజేపీని బలపరచాలని పిలుపు నిచ్చారు. బీసీ కులగణనకు బీజేపీగాని,కేంద్రం గాని వ్యతిరేకం కాదని.చేసిన సర్వేలో చిత్తశుద్ది లోపించిందని లక్షలాది మంది వివరాలు కులగణనలో నమోదు కాలేదని డీకే అరుణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment