నాకు హెలికాప్టర్లో తిరగాలి అన్న షోకు లేదు | Minister Uttam Kumar Reddy On BRS Party | Sakshi
Sakshi News home page

నాకు హెలికాప్టర్లో తిరగాలి అన్న షోకు లేదు

Published Thu, Feb 27 2025 6:28 PM | Last Updated on Thu, Feb 27 2025 7:14 PM

Minister Uttam Kumar Reddy On BRS Party

మహబూబ్ నగర్: మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  అదే సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను రెండు, మూడు నెలల్లో పునః ప్రారంభిస్తామన్నారు మంత్రి.‘ పదేళ్ల పాటు అధికారుంలో ఉన్న బీఆర్ఎస్.. ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ అనుమతుల గురించి మాట్లాడుతోంది. హరీష్ రావు మాటలు పూర్తి అబద్ధాలు.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీల గ్రావిటీ ద్వారా వస్తుంటే బీఆర్ఎస్ వాళ్లు పనులు వదిలిపెట్టి వెళ్లారు. వారు సరైన పని చేసి ఉంటే తెలంగాణలో 30 టీఎంసీల నీళ్లు వచ్చి, మూడు నాలుగు లక్షల ఎకరాల నల్గొండ భూములు సాగులోకి వచ్చేవి.

మేము ప్రజాస్వామ్యుతంగా జరిగిన ప్రమాదంపై అందరూ చూసేందుకు అనుమతి ఇస్తున్నాం. వారి హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న మాకు ఎలాంటి అనుమతులు ఇ‍వ్వలేదు. వాళ్ల హయాంలో 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రపు పనులు చేశారు. వారి హయాంలోనే నీటి పారుదల శాఖ నిర్వీర్యం అయ్యింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బ్లాస్ట్ జరిగి.. 9 మంది చనిపోతే ఒక్కరు కూడా పరామర్శకు రాలేదు. ఆరోజు రేవంత్ రెడ్డి వస్తుంటే కారులో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దేవాదులలో ఏడుమంది చనిపోతే, అస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయి. హరీష్ ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడారా?, ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వారి హయాంలో అడిగే నాథుడే లేకున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.

Uttam Kumar: 11 విభాగాల నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు

దేవాదులలో ఏడు మంది చనిపోతే.. ఆస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయి హరీష్ రావు ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడావా..ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వారి హయాంలో అడిగే నాథుడే లేకున్న పరిస్థితి.ఇక్కడికి వచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి లో 27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరాకు కూడా నిరంది ఇవ్వలేదు.  ఎస్ఎల్బీసీకి కరెంట్ కట్ చేస్తే డి ఓటరింగ్ చేయలేక పనులు ఆగిపోయాయి అప్పుడు జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఏమి చేశాడు. నాకు హెలికాప్టర్ లో తిరగాలి అన్న షోకు లేదు.. నేను ఓ పైలట్ ను. భారతదేశంలో టన్నెల్ ప్రమాదాలలో అత్యంత నిపుణులను కలిగిన 11 ఏజెన్సీలను తీసుకువచ్చి సమర్థవంతంగా మా ప్రభుత్వం సహి చర్యలు నిర్వహించింది. బీఆర్ఎస్  నాయకులు చెప్పిన మాటలు ప్రత్యేక అబద్ధాలు ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను’ ’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement