telangana chief secreatary
-
Somesh Kumar: తెలంగాణలో సోమేశ్ ‘ముద్ర’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్.సోమేశ్‌కుమార్ తనదైన ముద్ర వేసుకున్నారు. మూడేళ్ల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.జోషి నుంచి ప్రభుత్వ శాఖల పాలన పగ్గాలు తీసుకున్న ఆయన.. అనేక రాజకీయ విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తనదైన శైలిలో ప్రభుత్వ వ్యవస్థను ముందుకు నడిపిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులను సృష్టించడంలో దిట్టగా పేరొందారు. ఎక్సైజ్, రిజిస్టేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా ఆదాయాన్ని రెండు, మూడింతలు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఆయా శాఖల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీల ఇష్టారాజ్యాన్ని నియంత్రించేలా మార్పులు తెచ్చారు. ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్ విధానాన్ని తెచ్చి కల్తీ, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని నియంత్రించడంతోపాటు ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు తెచ్చారు. వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించి పన్ను ఎగవేతలను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఆదాయ శాఖలన్నింటిలో తనదైన ముద్ర వేసిన సోమేశ్.. ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను తెచ్చారు. అయితే, ఈ పోర్టల్ అమల్లో అనేక విమర్శలు కూడా వచ్చాయి. రైతుల భూములకు సంబంధించిన సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ల్యాండ్ బ్యాంక్ రూపకల్పన నిరర్ధక ఆస్తులు, భూములను అమ్మి ప్రభుత్వ ఖజానా నింపడం, టీఎస్ఐఐసీ లాంటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా భూములను విక్రయించే పద్ధతిని సోమేశ్‌కుమార్ తీసుకొచ్చారు. లెక్కాపత్రం లేని ప్రభుత్వ భూముల వివరాలను పక్కాగా తయారు చేసి భవిష్యత్తు అవసరాల కోసం ల్యాండ్ బ్యాంక్‌ను రూపొందించడం లాంటి పనులు కూడా ఆయన హయాంలోనే జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగులకు సంబంధించిన పైరవీలకు సోమేశ్ చెక్ పెట్టారనే వాదన కూడా ఉంది. ఏటా అన్ని శాఖల్లో ఆడిటింగ్‌ను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా జవాబుదారీతనం పెంపు కోసం యత్నించారు. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో డోర్ టు డోర్ సర్వే, రూ.ఐదుకే భోజనం, ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) కింద ఫ్లైఓవర్ల నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలు సులవుగా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించింది కూడా ఈయన హయాంలోనే. ఈ కాల్‌సెంటర్ కోవిడ్ సమయంలో చాలా ఉపయోగపడిందనే పేరుంది. -
తెలంగాణ సీఎస్‌గా శాంతికుమారి
-
నిర్మాణ పనులకు అనుమతి: చీఫ్ సెక్రటరి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన తాజా మార్గదార్శకాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లోని నిర్మాణ పనులకు అనుమతిని ఇస్తున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. బిల్డర్స్ అసోయేషన్లతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు డెవలపర్స్‌కు అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. (ఈ నగరాల్లో జోన్లను బట్టి సడలింపులు: కేంద్రం) ఇక వలస కూలీలకు కైన్సిలింగ్ నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాలన్నారు. వలస కూలీలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ... వైద్యపరమైన సౌకర్యాలు కల్పించి వారికి ప్రోత్సహకం అందించాలని సూచించారు. నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకువచ్చే వెసులుబాటును కల్పిస్తామని చెప్పారు. బిల్డర్లకు నిర్మాణపరమైన వస్తు సామాగ్రిని తీసుకు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మూడు కమిషనర్లకు అదేశం ఇచ్చిన్నట్లు ఆయన చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయనతో పాటు తెలంగాణ డీజీపీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ముగ్గురు కమిషనర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగుల బదిలీలపై వెంటనే స్పందించాలని టీజీవోల చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీని టీజీవో నేతలు కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రమోషన్ కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పీఆర్సీ కమిటీని ప్రకటించాలని, కోరారు. కార్మిక శాఖలో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, భార్యాభర్తలకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయా లని టీజీవో అధ్యక్షురాలు మమత కోరారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ తన పరిధిలో ఉన్న విషయాలపై 10 రోజుల్లో స్పష్టత ఇస్తానని, మిగతా అంశాలపై సీఎంతో చర్చిస్తానని హామీనిచ్చారు. -
తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరు?
- నెలాఖరుతో ముగియనున్న రాజీవ్‌శర్మ పదవీకాలం సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎవరనేది అధికారులందరిలో ఆసక్తి రేపుతోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి డాక్టర్ రాజీవ్‌శర్మ సీఎస్‌గా కొనసాగుతున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తుందా.? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది. సీఎస్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రత్యేక కారణాలున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఐఏఎస్ అధికారుల సర్వీసు కాలాన్ని 3 నెలల పాటు పొడిగించే వెసులుబాటుంది. దీంతో సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు ఖాయమనే అభిప్రాయాలున్నాయి. అదే సమయంలో పదోన్నతికి ఎదురుచూస్తున్న అర్హులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎస్ పోస్టుపై ఓ కన్నేసి ఉంచారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎంజీ గోపాల్ సీఎస్ రేసులో ఉన్నారు. రేమండ్ పీటర్ ఆగస్టులో, ప్రదీప్ చంద్ర డిసెంబర్లో, ఎంజీ గోపాల్ ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సీఎస్‌గా రాజీవ్‌శర్మ పదవీ కాలం పొడిగిస్తే ప్రదీప్ చంద్ర, ఎంజీ గోపాల్‌కు ఈ పోస్టు దక్కే అవకాశాలు సన్నగిల్లుతాయి. సీఎస్ పోస్టును ఆశిస్తున్న అధికారులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సీఎంను కలసినట్లు తెలుస్తోంది. కొందరు ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ ఇదే వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.