సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన తాజా మార్గదార్శకాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లోని నిర్మాణ పనులకు అనుమతిని ఇస్తున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. బిల్డర్స్ అసోయేషన్‌లతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు డెవలపర్స్‌కు అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. (ఈ నగరాల్లో జోన్లను బట్టి సడలింపులు: కేంద్రం)
ఇక వలస కూలీలకు కైన్సిలింగ్ నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాలన్నారు. వలస కూలీలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ... వైద్యపరమైన సౌకర్యాలు కల్పించి వారికి ప్రోత్సహకం అందించాలని సూచించారు. నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకువచ్చే వెసులుబాటును కల్పిస్తామని చెప్పారు. బిల్డర్లకు నిర్మాణపరమైన వస్తు సామాగ్రిని తీసుకు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మూడు కమిషనర్లకు అదేశం ఇచ్చిన్నట్లు ఆయన చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయనతో పాటు తెలంగాణ డీజీపీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ముగ్గురు కమిషనర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment