Builders Association
-
తప్పుదోవ పట్టించడానికే బిల్డర్ల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సామాన్య ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడానికే బిల్డర్లు సమ్మెకు దిగుతున్నారని దక్షిణ భారత సిమెంట్ తయారీదార్ల సంఘం (సిక్మా) తెలిపింది. సిమెంటు కారణంగా నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయన్న బిల్డర్ల ఆరోపణలను సంఘం ఖండించింది. ‘ఆర్థిక పునరుద్ధరణ ప్రయోజనాలను మరింత పొందాలన్నది బిల్డర్ల భావన. ఇందులో భాగంగా రియల్టీ ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ ధరలు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ఈ విషయాలను ఇప్పటికే ప్రధానికి, ఆర్థిక మంత్రికి సిక్మా తన లేఖ ద్వారా వివరించింది. దీనిపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇవ్వాల్సి ఉంది’ అని సిక్మా స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధిలోకి తేవాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాల్సిన తరుణంలో.. ఇళ్ల ధరలను గణనీయంగా తగ్గించి సామాన్యుడికి నీడను అందించాల్సిందిపోయి రియల్టీ ధరలను పెంచుకోవడానికి ఆధారం లేని కారణాలను చూపి ప్రయోజనం పొందాలన్నది బిల్డర్స్ అసోసియేషన్ ఎత్తుగడ అని సిక్మా వెల్లడించింది. నిర్మాణ వ్యయం 50 శాతం లోపే.. ‘మార్కెట్లో సిమెంటు ఒక మెట్రిక్ టన్నుకు రూ.6,000 లోపే బిల్డర్లు కొనుగోలు చేస్తున్నారు. బిల్ట్ అప్ ఏరియాలో ఒక చదరపు అడుగుకు సిమెంటుకు అయ్యే వ్యయం రూ.150 మాత్రమే. అలాంటప్పుడు ఇంటి నిర్మాణ వ్యయం పెరగడంలో సిమెంటు ప్రభావం ఎంత అని ప్రజలు ఆలోచించాలి. సిమెంటు బస్తా ధర రూ.100 పెరిగిందని బిల్డర్లు అంటున్నారు. వాస్తవానికి అయిదేళ్ల సగటు వార్షిక వృద్ధి రేటు చూస్తే ధరలు స్థిరంగా ఉన్నాయి. తప్పుడు బిల్లుల ద్వారా జీఎస్టీ (28 శాతం) అధిక ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవాలన్నది వారి ఉద్దేశమా? పలు మార్కెట్లలో మేము చేపట్టిన అధ్యయనం ప్రకారం ఇంటి విక్రయ ధరలో నిర్మాణ వ్యయం 50 శాతం కూడా లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గించాలని ఎందుకు కోరడం లేదు? తద్వారా ప్రజలకే మేలు కదా. నిర్మాణం పూర్తి అయిన, సెమి ఫినిష్డ్ ఇళ్లను బిల్డర్లు అట్టిపెట్టుకునే బదులు ధరలు తగ్గించి ఎందుకు విక్రయించడం లేదు? వినియోగదార్ల నుంచి డబ్బులు తీసుకుని ఇంటి నిర్మాణం ఆలస్యం చేస్తున్న, వదిలేసిన బిల్డర్లపై అసోసియేషన్ ఎటువంటి చర్యలు తీసుకుంది’ అని సిక్మా పలు ప్రశ్నలను సంధించింది. -
హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసింది?
-
ఎంఐఎంతో మాకు ఏం సంబంధం?
సాక్షి, హైదరాబాద్ : అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం లంచాలు తీసుకోకుండా పని చేస్తుందని అన్నారు. సోమవారం నగరంలోని తాజ్ డెక్కన్‌లో తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 5 తర్వాత బిల్డర్స్ సమస్యల్ని పరిష్కరించే విధంగా అధికారులతో భేటీ ఏర్పాటు చేసి మాట్లాడుతానని పేర్కొన్నారు. ఎన్నికలు రాగానే అయోమయానికి గురికావడం సర్వసాధారణమని, ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. తాను చెప్పిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు తప్పక ఓటు వేయాలని కోరారు. అది టీఆర్ఎస్ కైనా ఎవరికైనా ఓటు మాత్రం వేయాలని తెలిపారు. ఆరు నెలల నుంచి మాస్క్ తీయలేదని, తన ముఖం మర్చిపోతారేమోనని మాస్క్ తీస్తున్నట్లు తెలిపారు. చదవండి: బీజేపీలో విషయమేది.. విషం తప్ప! హైదరాబాద్ ప్రజలు ముందు ఓటింగ్‌లో పాల్గొనాలని హైదరాబాద్ ప్రజలు ఓట్లేయరనే అపవాదు ఉందని, ఇది మంచిది కాదని హితవు పలికారు. కేవలం 45, 46 శాతం ఓటింగ్ నమోదవుతుందని, ఓట్లు వేయకుండా ట్విట్టర్, సోషల్ మీడియాలో కూర్చొని విమర్శిస్తే వచ్చేది ఏం లేదని సూచించారు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్ ఇప్పటి హైదరాబాద్‌కు ఎంత తేడా ఉందో అర్ధం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందో కూడా చూడాలన్నారు. ఒకరు తెలంగాణలో కరెంట్ ఉండదు, శాంతి భద్రతల సమస్య ఉంటుంది, పరిపాలన మీవల్ల అవుతుందా అని కూడా అన్నారని, ఆరేళ్లలో కేసీఆర్ చెప్పిన మాట అక్షర సత్యం అయిందా లేదా అర్థం చేసుకోవాలని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఎంతో సాధించామన్న కేటీఆర్ నేలవిడిచి సాము చేసే అజెండాతో పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ వద్ద గతంలో పవర్ హాలిడేలు వద్దని పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారని, పవర్ హాలిడేల వల్ల గతంలో జనరేటర్లు పెట్టుకునేవారని గుర్తు చేశారు. చదవండి: హైదరాబాద్‌కు కేటీఆర్ ఏం చేశారు? ఖమ్మంలో ఏడు మండలాలు ఏపీలో కలిపారు. కరెంట్ సమస్య ఉత్పన్నం కాకుండా ఆరునెలల్లోనే సాధించాం. ఆనాడు 7 వేల మెగావాట్ల ఉన్న విద్యుత్ ఉత్పత్తిని 16 వేల మెగావాట్లకు తీసుకొచ్చాం. నగరంలో గతంలో తాగునీటి కోసం యుద్ధాలు చేసిన పరిస్థితి. గతంలో నేను 135 బస్సులో వెళ్లే సమయంలో నీటి కోసం కొట్టుకునేవారు, ధర్నాలు చేసేవారు. కానీ ఇప్పుడు నీటి సమస్య లేకుండా చేశాం. 2 వేల కోట్లతో శివారు ప్రాంతాల తాగునీటి సమస్య లేకుండా చేశాం. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇంటింటికి చెత్త బుట్టలు పంపిణీ చేశాము. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఎన్నో నగరాల కంటే హైదరాబాద్ మెరుగ్గా ఉంది. హైదారాబాద్‌కు ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. సంక్రాంతి వరకు చెత్త తీసుకెళ్లే వాహనాలను ఆధునీకరిస్తాం. జవహర్ నగర్లో 20 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో చెత్త డంప్‌కు క్యాపింగ్ చేస్తున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు 3 కోట్లతో చర్యలు చేపడుతున్నాం. చెత్త డంపింగ్ కోసం మరో రెండు కేంద్రాలను ప్రారంభిస్తాం ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రాములమ్మ గుడ్ బై అత్యంత నివాసయోగ్య పరిస్థితులు ఉన్న నగరాల్లో దేశంలో హైదరాబాద్‌లో ఉన్నాయి. ప్రధాన నగరాలపై లోడ్ తగ్గేందుకు 137 లింక్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. సీఆర్ఎంపీ పేరుతో హైదరాబాద్‌లో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేసేందుకు అయిదేళ్ల వరకు కాంట్రాక్టు ఇచ్చాం. హైదరాబాద్‌లో గుంతలు లేవా అని ఓ కేంద్ర మంత్రి అంటున్నారు. గుంతలు లేని రోడ్డు చూపిస్తే లక్ష ఇస్తామన్నారు. భారత దేశంలో గుంతలు లేని రోడ్డు ఉందా. చూపిస్తే నేను పది లక్షలు ఇస్తా. ఎస్ఆర్డీపీ చేసిన పద్దతిలా నాలా, డ్రైనేజీని బాగుచేస్తాము నాలాలపై ఇళ్లు కట్టాం, చెరువులను ఆక్రమించడం కారణంగానే వరదలు వచ్చాయి. మా ప్రభుత్వ హయాంలోకూడా చెరువులు, నాలాలు ఆక్రమించి ఉండొచ్చు. నాలా, చెరువులపై ఆక్రమణలను తొలగించేందుకు ఓ పటిష్ట చట్టం తీసుకొస్తున్నాం. నేను చదువునే సమయంలో కర్ఫ్యూలతో సెలవులు వచ్చేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు రేషన్, ఐదు వందలు ఇచ్చి భరోసా ఇచ్చాం. 4.70 లక్షల ఎల్ఈడీ లైట్లు, 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. హైదరాబాద్‌లో పేకాట క్లబ్బులు, గుడుంబా సమస్య లేకుండా, పోకిరీల బాధ లేకుండా చేశాం. 67 వేల కోట్లు ఖర్చు చేశాం.. కాబట్టే ఓట్లడుగుతున్నాం. కానీ మాకు వ్యతిరేకంగా ఓట్లడుగుతున్న బీజేపీ హైదరాబాద్‌కు ఏం చేసింది. తెలంగాణకే కాదు ఏపీకి బీజేపీ ఏం చేసింది. ఏపీకి తెలంగాణ తరపున వంద కోట్ల రూపాయలు ఇచ్చాం. ఏపీకి ఏం ఇస్తున్నారని ప్రధాని సహాయకుడిని కేసీఆర్ అడిగితే ఏం ఇవ్వడం లేదని అన్నారు. చదవండి: కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్‌రెడ్డి బీజేపీ దేశానికి ఏం చేసింది. పెద్ద నోట్ల రద్దు కారంగా దేశ ఆర్ధిక పరిస్థితి దెబ్బతింది. ఎంతో మంది రోడ్డున పడ్డారు. 31 శాతం జీడిపీ దెబ్బపడింది. బంగ్లా, శ్రీలంక కంటే జీడీపీ వృద్ధి రేటు తక్కువగా ఉంది. 111 స్థానాల్లో లక్ష డబుల్ బెడ్ రూ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. 95 శాతం ఇళ్లను నిర్మించాం. భారత్‌లో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందా. కొల్లూరులో 15660 ఇళ్లను నిర్మించాం. మిషన్ భగీరథలో అవినీతి జరిగిందంటారు. మళ్ళీ అవార్డు ఇస్తారు. తెలంగాణ నుంచి ఆరేళ్లలో 2.72 లక్షల కోట్లు కడితే కేంద్రం నుంచి 1.40 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇది నిజం కాదని బీజేపీ నేతలు చెప్పాలి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి చలాన్లను కడతామని దిగజారి మాట్లాడుతున్నారు. బీజేపీ నేతల్లో విషయం లేదు విషం లేదు. ఎన్డీఏ అంటే నో డాటా అలయెన్స్. బీజేపీకి తెలిసింది హిందూ, ముస్లిం మాత్రమే. ఒకయాన చార్జిషీటు వేస్తాడు మరి మేం ఏం వేయాలి. గెలిపిస్తే 25 వేలిస్తాం అంటున్నారు. ఎక్కడి నుంచి ఇస్తారు. మేం పదివేల చొప్పున 6.5 లక్షల మందికి సాయం చేశాం. ఎంఐఎంకు మాకు ఏం సంబంధం. ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. విశ్వనగరమా, విద్వేష నగరం కావాలో తేల్చుకోవాలి ’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
నిర్మాణ పనులకు అనుమతి: చీఫ్ సెక్రటరి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన తాజా మార్గదార్శకాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లోని నిర్మాణ పనులకు అనుమతిని ఇస్తున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. బిల్డర్స్ అసోయేషన్లతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు డెవలపర్స్‌కు అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. (ఈ నగరాల్లో జోన్లను బట్టి సడలింపులు: కేంద్రం) ఇక వలస కూలీలకు కైన్సిలింగ్ నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాలన్నారు. వలస కూలీలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ... వైద్యపరమైన సౌకర్యాలు కల్పించి వారికి ప్రోత్సహకం అందించాలని సూచించారు. నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకువచ్చే వెసులుబాటును కల్పిస్తామని చెప్పారు. బిల్డర్లకు నిర్మాణపరమైన వస్తు సామాగ్రిని తీసుకు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మూడు కమిషనర్లకు అదేశం ఇచ్చిన్నట్లు ఆయన చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయనతో పాటు తెలంగాణ డీజీపీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ముగ్గురు కమిషనర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సౌత్ జోన్ బిల్డర్స్ సంఘం ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: స్థానిక డెవలపర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సౌత్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. దీనికి కన్వీనర్‌గా సిరిసంపద కన్స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, ఆదిభట్ల, రాజేంద్రనగర్, తుక్కుగూడ, కొంగర, రావిరాల, నాదర్గుల్, గుర్రంగూడ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బిల్డర్స్ హాజరయ్యారు. త్వరలోనే కొంపల్లి ప్రాంతంలో నార్త్‌జోన్ బిల్డర్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేస్తామని టీబీఎఫ్ ప్రెసిడెంట్ సీ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జే వెంకట్ రెడ్డి, ట్రెజరర్ టీ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ సిటీ, కూకట్పల్లి, ప్రగతినగర్, వెస్ట్ జోన్, కాప్రా, కీసర, ఈస్ట్ జోన్, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్స్ సమూహమే టీబీఎఫ్. -
సి‘మంట’
- ఇంకా తగ్గని సిమెంట్ ధరలు - నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం - ఇబ్బందుల్లో మధ్య తరగతి ప్రజలు కరీంనగర్ : సిమెంట్ ధరలు ఇంకా తగ్గడం లేదు. కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి అమాంతంగా ధరలు పెంచా యి. దీంతో రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా అన్నిరకా ల నిర్మాణాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణాలంటేనే బెంబేలెత్తుతున్నారు. సిమెంట్ కంపెనీల తీరుకు నిరసనగా ఈనెల 5నుంచి బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో సిమెంట్ కొనుగోళ్లు నిలిపివేయడం కూడా నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడం భవన నిర్మాణాలకు అనువైన సీజన్ కాదు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు నిర్మాణాలకు అనువైన కాలం. ఈ కాలంలోనే నిర్మాణాలు అధికంగా జరుగుతాయి. సిమెంట్ ధరలు పెరిగినా ఈ కాలంలోనే. జూలై నుంచి వర్షాలు పడటం వల్ల నిర్మాణాలు అంతం త మాత్రంగా ఉంటాయి. అన్‌సీజన్ అయిన వర్షాకాలంలో ధరలు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జూలై మొదటి వారంలో బస్తా రూ.225 నుంచి రూ.230 ఉండగా.. ప్రస్తుతం రూ.320కి చేరింది. నెల రోజుల్లోనే ఏకంగా ఒక్కో బస్తాపై రూ.వందకు పైగా పెరగడంతో రియల్టర్లు, కాంట్రాక్టర్లు పనులు నిలుపుద ల చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే స్టీల్, ఇసుక, చిప్స్ ధరలు భారీగా ఉన్నాయి. వీటికి సిమెంట్ ధరలు కూడా తోడయ్యాయి. భవిష్యత్‌లో గృహాలు నిర్మించుకోవాలనుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు పెరిగిన ధరలు గుదిబండగా మారాయి. సీజన్లో జిల్లాలో సు మారు 40 వేల టన్నుల సిమెంట్ వినియోగమవుతోం ది. ఇదే అదనుగా సిమెంట్ వ్యాపారులు సైతం ఉన్నపళంగా ధరలు పెంచారనే ఆరోపణలున్నాయి. ఎందుకిలా.. ? సిమెంట్ ధరలు అమాంతం పెరగడానికి రాష్ట్ర విభజన ఓ కారణమని తెలుస్తోంది. గతేడాది తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల సిమెంట్ రవాణాకు ఆటంకం కలిగింది. రాష్ట్ర విభజన, ఆ వెంటనే ఎన్నికలు ఇలా ఒక దానికొకటి తోడయ్యాయి. వీటితో పాటు కరెంటు కోతలతో ఉత్పత్తి, రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిం ది. దీనికితోడు వరుసగా ఎన్నికలు రావడంతో కోడ్ ప్రభావం నిర్మాణ రంగంపై పడింది. కోడ్ అమలుతో చాలా వరకు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇ ప్పుడిప్పుడే పనులు ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో కంపెనీలు సిమెంట్ ధరలను పెంచి భారీగా లాభాలు మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బ్రాండె డ్ కంపెనీల సిమెంట్ ధరబస్తా రూ.320 ఉండగా.. ఇతర సాధారణ బస్తాల ధర రూ.300 వరకు ఉంది. ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. అమ్మకాలు తగ్గాయి నెలరోజులుగా సిమెంట్ ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమున్న వారు సిమెంట్ కోనుగోలు చేస్తున్నారు. పనులు చేపడదామనే ఆలోచన ఉన్నవారు విరమించుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల పనులు ఆపేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సిమెంటు ధరలను అదుపులో పెట్టాలి. -చాడ శ్రీనివాస్‌రెడ్డి, సిమెంట్ వ్యాపారి సిండికేట్‌కు గుణపాఠం తప్పదు సిమెంట్ కంపెనీలకు గుణపాఠం తప్పదు. ఈ నెల 5 నుంచి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ఆధ్వర్యంలో సిమెంట్ కొనుగోళ్లు నిలిపివేశాం. ఇప్పటికే ఏపీ, తెలంగాణ సీఎంలను కలిసి విన్నవించాం. మరోసారి కలిసి ఏం చేయాలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటాం. -వై.రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్ జిల్లా చైర్మన్