ఎంఐఎంతో మాకు ఏం సంబంధం? | KTR: HYD People Has To Decide Who To vote In GHMC Elections | Sakshi
Sakshi News home page

ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి

Published Mon, Nov 23 2020 3:00 PM | Last Updated on Mon, Nov 23 2020 7:20 PM

KTR: HYD People Has To Decide Who To vote In GHMC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమ ప్రభుత్వం లంచాలు తీసుకోకుండా పని చేస్తుందని అన్నారు. సోమవారం నగరంలోని తాజ్‌ డెక్కన్‌లో తెలంగాణ బిల్డర్స్‌ అసోసియేషన్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 5 తర్వాత బిల్డర్స్ సమస్యల్ని పరిష్కరించే విధంగా అధికారులతో భేటీ ఏర్పాటు చేసి‌ మాట్లాడుతానని పేర్కొన్నారు. ఎన్నికలు రాగానే అయోమయానికి గురికావడం సర్వసాధారణమని, ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. తాను చెప్పిన తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు తప్పక ఓటు వేయాలని కోరారు. అది టీఆర్ఎస్ కైనా ఎవరికైనా ఓటు మాత్రం వేయాలని తెలిపారు. ఆరు నెలల నుంచి మాస్క్‌ తీయలేదని, తన ముఖం మర్చిపోతారేమోనని మాస్క్‌ తీస్తున్నట్లు తెలిపారు. చదవండి: బీజేపీలో విషయమేది.. విషం తప్ప!

హైదరాబాద్ ప్రజలు ముందు ఓటింగ్‌లో పాల్గొనాలని హైదరాబాద్ ప్రజలు ఓట్లేయరనే అపవాదు ఉందని, ఇది మంచిది కాదని హితవు పలికారు. కేవలం 45, 46 శాతం ఓటింగ్ నమోదవుతుందని, ఓట్లు వేయకుండా ట్విట్టర్, సోషల్ మీడియాలో కూర్చొని విమర్శిస్తే వచ్చేది ఏం లేదని సూచించారు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్ ఇప్పటి హైదరాబాద్‌కు ఎంత తేడా ఉందో అర్ధం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందో కూడా చూడాలన్నారు. ఒకరు తెలంగాణలో కరెంట్ ఉండదు, శాంతి భద్రతల సమస్య ఉంటుంది, పరిపాలన మీవల్ల అవుతుందా అని కూడా అన్నారని, ఆరేళ్లలో కేసీఆర్ చెప్పిన మాట అక్షర సత్యం అయిందా లేదా అర్థం చేసుకోవాలని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఎంతో సాధించామన్న కేటీఆర్‌ నేలవిడిచి సాము చేసే అజెండాతో పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ వద్ద గతంలో పవర్ హాలిడేలు వద్దని పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారని, పవర్ హాలిడేల వల్ల గతంలో జనరేటర్లు పెట్టుకునేవారని గుర్తు చేశారు. చదవండి: హైదరాబాద్‌కు కేటీఆర్‌ ఏం చేశారు?

ఖమ్మంలో ఏడు మండలాలు ఏపీలో కలిపారు. కరెంట్ సమస్య ఉత్పన్నం కాకుండా ఆరునెలల్లోనే సాధించాం. ఆనాడు 7 వేల మెగావాట్ల ఉన్న విద్యుత్ ఉత్పత్తిని 16 వేల మెగావాట్లకు తీసుకొచ్చాం. నగరంలో గతంలో తాగునీటి కోసం యుద్ధాలు చేసిన పరిస్థితి. గతంలో నేను 135 బస్సులో వెళ్లే సమయంలో నీటి కోసం కొట్టుకునేవారు, ధర్నాలు చేసేవారు. కానీ ఇప్పుడు నీటి సమస్య లేకుండా చేశాం. 2 వేల‌ కోట్లతో శివారు ప్రాంతాల తాగునీటి సమస్య లేకుండా చేశాం. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇంటింటికి చెత్త బుట్టలు పంపిణీ చేశాము. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఎన్నో నగరాల కంటే హైదరాబాద్ మెరుగ్గా ఉంది. హైదారాబాద్‌కు ఇంకా ఎంతో చేయాల్సి‌ ఉంది. సంక్రాంతి వరకు చెత్త తీసుకెళ్లే వాహనాలను ఆధునీకరిస్తాం. జవహర్ నగర్‌లో 20 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో చెత్త డంప్‌కు క్యాపింగ్ చేస్తున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు 3 కోట్లతో చర్యలు చేపడుతున్నాం. చెత్త డంపింగ్ కోసం మరో రెండు కేంద్రాలను ప్రారంభిస్తాం ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. చదవండి:  కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. రాములమ్మ గుడ్‌ బై

అత్యంత నివాసయోగ్య పరిస్థితులు ఉన్న నగరాల్లో దేశంలో హైదరాబాద్‌లో ఉన్నాయి. ప్రధాన‌ నగరాలపై లోడ్ తగ్గేందుకు 137 లింక్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. సీఆర్ఎంపీ పేరుతో హైదరాబాద్‌లో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేసేందుకు అయిదేళ్ల వరకు కాంట్రాక్టు ఇచ్చాం. హైదరాబాద్‌లో గుంతలు లేవా అని ఓ కేంద్ర మంత్రి అంటున్నారు. గుంతలు లేని‌ రోడ్డు చూపిస్తే లక్ష ఇస్తామన్నారు. భారత దేశంలో గుంతలు లేని రోడ్డు ఉందా. చూపిస్తే నేను పది లక్షలు ఇస్తా. ఎస్ఆర్డీపీ చేసిన పద్దతిలా నాలా, డ్రైనేజీని బాగుచేస్తాము నాలాలపై ఇళ్లు కట్టాం, చెరువులను ఆక్రమించడం కారణంగానే వరదలు వచ్చాయి. మా ప్రభుత్వ హయాంలోకూడా చెరువులు, నాలాలు ఆక్రమించి ఉండొచ్చు. నాలా, చెరువులపై ఆక్రమణలను తొలగించేందుకు ఓ పటిష్ట చట్టం తీసుకొస్తున్నాం. నేను చదువునే సమయంలో కర్ఫ్యూలతో సెలవులు వచ్చేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు రేషన్, ఐదు వందలు ఇచ్చి భరోసా ఇచ్చాం. 4.70 లక్షల ఎల్ఈడీ లైట్లు, 5 లక్షల‌ సీసీ కెమెరాలు పెట్టాం. హైదరాబాద్‌లో పేకాట క్లబ్బులు, గుడుంబా సమస్య లేకుండా, పోకిరీల బాధ లేకుండా చేశాం. 67 వేల కోట్లు ఖర్చు చేశాం.. కాబట్టే ఓట్లడుగుతున్నాం. కానీ మాకు వ్యతిరేకంగా ఓట్లడుగుతున్న బీజేపీ హైదరాబాద్‌కు ఏం చేసింది. తెలంగాణకే కాదు ఏపీకి బీజేపీ ఏం చేసింది. ఏపీకి తెలంగాణ తరపున వంద కోట్ల రూపాయలు ఇచ్చాం. ఏపీకి ఏం ఇస్తున్నారని ప్రధాని సహాయకుడిని కేసీఆర్ అడిగితే ఏం ఇవ్వడం లేదని అన్నారు. చదవండి: కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్‌రెడ్డి

బీజేపీ దేశానికి ఏం చేసింది. పెద్ద నోట్ల రద్దు కారంగా దేశ ఆర్ధిక పరిస్థితి దెబ్బతింది. ఎంతో మంది రోడ్డున పడ్డారు. 31 శాతం  జీడిపీ దెబ్బపడింది.  బంగ్లా, శ్రీలంక కంటే జీడీపీ వృద్ధి రేటు తక్కువగా ఉంది. 111 స్థానాల్లో లక్ష డబుల్ బెడ్ రూ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. 95 శాతం ఇళ్లను నిర్మించాం. భారత్‌లో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందా. కొల్లూరులో 15660 ఇళ్లను నిర్మించాం. మిషన్ భగీరథలో అవినీతి జరిగిందంటారు. మళ్ళీ అవార్డు ఇస్తారు. తెలంగాణ నుంచి ఆరేళ్లలో 2.72 లక్షల కోట్లు కడితే కేంద్రం నుంచి 1.40 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇది నిజం కాదని బీజేపీ నేతలు చెప్పాలి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి చలాన్లను కడతామని దిగజారి మాట్లాడుతున్నారు. బీజేపీ నేతల్లో విషయం లేదు విషం లేదు. ఎన్డీఏ అంటే నో డాటా అలయెన్స్. బీజేపీకి తెలిసింది హిందూ, ముస్లిం మాత్రమే. ఒకయాన చార్జిషీటు వేస్తాడు మరి మేం ఏం వేయాలి. గెలిపిస్తే 25 వేలిస్తాం అంటున్నారు. ఎక్కడి నుంచి ఇస్తారు. మేం పదివేల చొప్పున 6.5 లక్షల మందికి సాయం చేశాం. ఎంఐఎంకు మాకు ఏం సంబంధం. ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. విశ్వనగరమా, విద్వేష నగరం కావాలో తేల్చుకోవాలి ’’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement