
సాక్షి, హైదరాబాద్: స్థానిక డెవలపర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సౌత్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. దీనికి కన్వీనర్‌గా సిరిసంపద కన్‌స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, ఆదిభట్ల, రాజేంద్రనగర్, తుక్కుగూడ, కొంగర, రావిరాల, నాదర్‌గుల్, గుర్రంగూడ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బిల్డర్స్ హాజరయ్యారు. త్వరలోనే కొంపల్లి ప్రాంతంలో నార్త్‌జోన్ బిల్డర్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేస్తామని టీబీఎఫ్ ప్రెసిడెంట్ సీ ప్రభాకర్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జే వెంకట్ రెడ్డి, ట్రెజరర్ టీ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ సిటీ, కూకట్‌పల్లి, ప్రగతినగర్, వెస్ట్ జోన్, కాప్రా, కీసర, ఈస్ట్ జోన్, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్స్ సమూహమే టీబీఎఫ్.
Comments
Please login to add a commentAdd a comment