జీవో జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం చైర్మన్‌గా కొనసాగడానికి వీల్లేదని పేర్కొంటూ రాష్ట్రప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తన రాజీనామా ఆమోదం పొందడానికి రెండు రోజుల ముందు(మార్చి 8న) జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తనను టీజీవో చైర్మన్‌గా నియమిస్తూ తీర్మానం చేశారని శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అలాంటి తీర్మానమేదీ చేయలేదని టీజీవో ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగంలో లేని వ్యక్తులు ఉద్యోగ సంఘాల్లో కొనసాగే అవకాశం లేనందున టీజీవో చైర్మన్‌గా శ్రీనివాసగౌడ్ కొనసాగడానికి వీల్లేదని ప్రభుత్వం పేర్కొంది.
టీజీవో నుంచి శ్రీనివాస్‌గౌడ్ అవుట్
Published Sun, May 4 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement