సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి బండారం బట్టబయలైంది. కాగా, లైంగిక వేధింపుల అధికారికి మంత్రి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక, విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ దీనిపై స్పందించారు. తాజాగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ చేసి నన్ను సస్పెండ్ చేశారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అని కామెంట్స్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆభివృద్ది, సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
— V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023
క్రీడాకారిణిలకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు వారిలో ధైర్యం నింపేందుకు వెంటనే చర్యలను చేపట్టాము.
గతంలో మహిళల పట్ల జరిగిన లైంగిక వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం…
ఇదిలా ఉండగా.. ఈ లైంగిక వేధింపుల ఘటనపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. బాలికలపై వేధింపుల ఘటనను ఎమ్మెల్సీ కవిత సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. తక్షణమే సదరు అధికారిపై చర్యలు చేపట్టాలని, విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం జరిపించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ట్విట్టర్ వేదికగా కోరారు.
ఇది కూడా చదవండి: హెచ్‌ఎం వేధింపులు.. జాబ్ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment