sport schol
-
స్పోర్ట్స్ స్కూల్లో వేధింపుల ఘటనపై విచారణ పూర్తి.. కలెక్టర్‌కు నివేదిక
సాక్షి, హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై అధికారుల విచారణ ముగిసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆరున్నర గంటలకు పైగా సాగిన విచారణ కొనసాగింది. సస్పైండైన ఓఎస్డీ హరికృష్ణ, స్టూడెంట్స్, స్టాఫ్ స్టేట్మెంట్స్ను అధికారులు రికార్డులు చేశారు. ఇక, అధికారుల విచారణ సందర్భంగా చైల్డ్ ప్రొటెక్షన్ బృందం అధికారులు.. సమగ్ర సమాచారం సేకరించారు. కాగా, నివేదికను మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అధికారులు సమర్పించనున్నారు. ఇదిలా ఉండగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మరోవైపు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ దీనిపై స్పందించారు. తాజాగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ చేసి నన్ను సస్పెండ్ చేశారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నవంబర్లోనే గ్రూప్-2.. రీషెడ్యూల్ తేదీలు ఇవే.. -
హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో వేధింపులు.. హరికృష్ణ స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి బండారం బట్టబయలైంది. కాగా, లైంగిక వేధింపుల అధికారికి మంత్రి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక, విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ దీనిపై స్పందించారు. తాజాగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ చేసి నన్ను సస్పెండ్ చేశారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అని కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆభివృద్ది, సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. క్రీడాకారిణిలకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు వారిలో ధైర్యం నింపేందుకు వెంటనే చర్యలను చేపట్టాము. గతంలో మహిళల పట్ల జరిగిన లైంగిక వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం… — V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023 ఇదిలా ఉండగా.. ఈ లైంగిక వేధింపుల ఘటనపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. బాలికలపై వేధింపుల ఘటనను ఎమ్మెల్సీ కవిత సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. తక్షణమే సదరు అధికారిపై చర్యలు చేపట్టాలని, విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం జరిపించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ట్విట్టర్ వేదికగా కోరారు. ఇది కూడా చదవండి: హెచ్ఎం వేధింపులు.. జాబ్ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే! -
క్రీడాపాఠశాల ఫలితాలు విడుదల
కడప స్పోర్ట్స్ : వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికల ఫలితాలను డీఎస్డీఓ ఎం.ఎస్.ఎల్.ఎన్. శర్మ మంగళవారం రాత్రి విడుదల చేశారు. కడప నగరంలో డీఎస్ఏ క్రీడామైదానంలో ఈనెల 25,26 తేదీల్లో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన 17 మంది బాలురు, 19 మంది బాలికలను రాష్ట్రస్థాయి ఎంపికలకు ఎంపికచేశారు. ఎంపికైన క్రీడాకారులు కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ జయచంద్ర, కోచ్‌లు గౌస్‌బాషా, షఫీ, సిబ్బంది పాల్గొన్నారు. ఎంపికైన బాలికలు : ఎం. హిమబిందు (కడప), కె. రాజ్యలక్ష్మి (సీకే దిన్నె), టి. శ్రీవిద్య (సీకే దిన్నె), కె. వెన్నెల (బీమఠం), టి.పావని (సీకే దిన్నె), బి. జయలక్ష్మి (బద్వేలు), ఎన్.గాయత్రి (పెండ్లిమర్రి), డి.కల్యాణి (ప్రొద్దుటూరు), కె.జ్యోతి (రాయచోటి), కె. దీపిక (సీకే దిన్నె), పి. జాహ్నవి (వేంపల్లి), ఎస్.సరస్వతి (దువ్వూరు), కె. పావని (రాయచోటి), ఎం. శైలజ (ఎల్ఆర్ పల్లి), ఎన్. శివనందిని (కడప), సి. భవిత (పోరుమామిళ్ల), వి. సాజియావైష్ణవి (కడప), వేమారాణి (వేంపల్లి), సి. పల్లవి (కడప). ఎంపికైన బాలురు : ఎస్. ఉమేష్‌రిషి (రైల్వేకోడూరు), జి.చంద్రశేఖర్ (ప్రొద్దుటూరు), జి. గౌతమ్కిశోర్ (ప్రొద్దుటూరు), ఎన్. పృధ్వీనాథ్రెడ్డి (కడప), సి. మౌళీంద్రనాథరెడ్డి (ప్రొద్దుటూరు), డి.కిశోర్‌కుమార్‌రెడ్డి (పెండ్లిమర్రి), కె.నందన్(రామాపురం), ఎ.రాహుల్ (కలసపాడు), ఎ.పృధ్వి (కడప), బి.నాయబ్‌రసూల్ (రాజంపేట), డి.ప్రణయ్‌కుమార్ (వేంపల్లి), ఆర్. వెంకటరమణ (రాయచోటి), డి.భానుతేజ (వల్లూరు), డి.నాగచైతన్య (వల్లూరు), బి.జనార్ధన్ (బద్వేలు), వి. అశోక్ (ప్రొద్దుటూరు), మాడా శ్రీనివాస్ (సీకే దిన్నె).