క్రీడాపాఠశాల ఫలితాలు విడుదల | sport school results release | Sakshi
Sakshi News home page

క్రీడాపాఠశాల ఫలితాలు విడుదల

Published Tue, Jul 26 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

క్రీడాపాఠశాల ఫలితాలు విడుదల

క్రీడాపాఠశాల ఫలితాలు విడుదల

కడప స్పోర్ట్స్‌ :
 వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికల ఫలితాలను డీఎస్‌డీఓ ఎం.ఎస్‌.ఎల్‌.ఎన్‌. శర్మ మంగళవారం రాత్రి విడుదల చేశారు. కడప నగరంలో డీఎస్‌ఏ క్రీడామైదానంలో ఈనెల 25,26 తేదీల్లో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన 17 మంది బాలురు, 19 మంది బాలికలను రాష్ట్రస్థాయి ఎంపికలకు ఎంపికచేశారు. ఎంపికైన క్రీడాకారులు కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్‌ డైరెక్టర్‌ జయచంద్ర, కోచ్‌లు గౌస్‌బాషా, షఫీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఎంపికైన బాలికలు : ఎం. హిమబిందు (కడప), కె. రాజ్యలక్ష్మి (సీకే దిన్నె), టి. శ్రీవిద్య (సీకే దిన్నె), కె. వెన్నెల (బీమఠం), టి.పావని (సీకే దిన్నె), బి. జయలక్ష్మి (బద్వేలు), ఎన్‌.గాయత్రి (పెండ్లిమర్రి), డి.కల్యాణి (ప్రొద్దుటూరు), కె.జ్యోతి (రాయచోటి), కె. దీపిక (సీకే దిన్నె), పి. జాహ్నవి (వేంపల్లి), ఎస్‌.సరస్వతి (దువ్వూరు), కె. పావని (రాయచోటి), ఎం. శైలజ (ఎల్‌ఆర్‌ పల్లి), ఎన్‌. శివనందిని (కడప), సి. భవిత (పోరుమామిళ్ల), వి. సాజియావైష్ణవి (కడప), వేమారాణి (వేంపల్లి), సి. పల్లవి (కడప).
ఎంపికైన బాలురు : ఎస్‌. ఉమేష్‌రిషి (రైల్వేకోడూరు), జి.చంద్రశేఖర్‌ (ప్రొద్దుటూరు), జి. గౌతమ్‌కిశోర్‌ (ప్రొద్దుటూరు), ఎన్‌. పృధ్వీనాథ్‌రెడ్డి (కడప), సి. మౌళీంద్రనాథరెడ్డి (ప్రొద్దుటూరు), డి.కిశోర్‌కుమార్‌రెడ్డి (పెండ్లిమర్రి), కె.నందన్‌(రామాపురం), ఎ.రాహుల్‌ (కలసపాడు), ఎ.పృధ్వి (కడప), బి.నాయబ్‌రసూల్‌ (రాజంపేట), డి.ప్రణయ్‌కుమార్‌ (వేంపల్లి), ఆర్‌. వెంకటరమణ (రాయచోటి), డి.భానుతేజ (వల్లూరు), డి.నాగచైతన్య (వల్లూరు), బి.జనార్ధన్‌ (బద్వేలు), వి. అశోక్‌ (ప్రొద్దుటూరు), మాడా శ్రీనివాస్‌ (సీకే దిన్నె).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement