DSDO
-
ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీలకు వేదికగా రాజంపేట
కడప స్పోర్ట్స్ : ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీల్లో గ్రూప్1 విభాగంలోని క్రీడా పోటీలను జిల్లాలోని రాజంపేట పట్టణంలో నిర్వహించేందుకు శాప్ అధికారులు నిర్ణయించినట్లు డీఎస్డీఓ లక్ష్మీనారాయణశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 నుంచి 23వ తేది వరకు రాజంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. గ్రూప్1 విభాగంలోని వాలీబాల్, అథ్లెటిక్స్, తైక్వాండో పోటీలను అక్కడ నిర్వహించనున్నారని చెప్పారు. -
క్రీడల అభివృద్ధి గాలికి..!
- ఇన్చార్జ్ పాలనలో డీఎస్డీవో -క్రీడాకారుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం కర్నూలు (టౌన్): జిల్లాలో క్రీడల అభివృద్ధి ప్రభుత్వానికి, అధికార యంత్రాగానికి ఏమాత్రం పట్టనట్లు కనిపిస్తోంది. మూడు నెలలుగా రెగ్యులర్ డీఎస్డీవో లేకపోవడంతో క్రీడల అభివృద్ధిని గాలికి వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. సంబంధం లేని అధికారులను క్రీడల అధికారిగా నియమించడంతోనే అసలు సమస్య వస్తోందని క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని నియమిస్తారు. అయితే కర్నూలులో రెగ్యులర్ డీఎస్‌డీవోను నియమించలేదు. హంద్రీనీవా సుజలస్రవంతి యూనిట్ -4 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈయన డీఎస్డీవో కార్యాలయానికి రావడం లేదు. క్రీడాకారుల సమస్యలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈయన డిప్యూటీ కలెక్టర్‌గా బిజీగా ఉంటారని, అటువంటి అధికారులను క్రీడలకు అధికారిగా నియమించడం ఎంత వరకు సబబు క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. మండలస్థాయిలో, జిల్లాస్థాయిలో టోర్నమెంటులు నిర్వహించడం, ఔట్ డోర్స్టేడియం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్వహణపై నిత్యం దృష్టిసారించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జిల్లాకు సంబంధించి క్రీడలకు అవసరమయ్యే ప్రతిపాదనలు రూపొందించాల్సి ఉంది. గత ఏడాది జిల్లా క్రీడల అభివృద్ధికి సంబంధించి రూ. 16 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రగతి తదితర వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ పనులన్ని చేయాలంటే.. క్రీడలపై అవగాహన, ఆసక్తి ఉన్న అధికారులనే క్రీడల అభివృద్ధి అధికారిగా నియమించాలన్న డిమాండ్ సర్వాత్ర వినిపిస్తోంది. -
15రోజుల్లో వెళ్లిపోవాలనుకున్నా..
జిల్లాలో పనిచేయడం సంతోషంగా ఉంది అందరి సహకారంతో క్రీడాభివృద్ధికి కృషి డీఎస్డీఓ టీవీఎల్ సత్యవాణి మహబూబ్‌నగర్ క్రీడలు: ‘జిల్లాకు బదిలీ అయినప్పుడు అదో తెలియని భయం ఉండేది.. మహబూబ్‌నగర్‌లో రాజకీయాలు ఎక్కువని.. ఇక్కడ డీఎస్‌డీఓగా పనిచేయలేనని పలువురు పలురకాలుగా మాట్లాడేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 15రోజుల్లో బదిలీ చేసుకుని వెళ్లాలనుకున్నాను. కానీ నెలరోజుల్లో ఇక్కడి వాతావరణం బాగా నచ్చింది. క్రీడాకారుల్లో ఏదో సాధించాలనే తపన క్రీడా అసోసియేషన్ల సపోర్ట్‌తో జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలన్న లక్ష్యంతో మనసు మార్చుకున్నాను’ అని డీఎస్డీఓ టీవీఎల్ సత్యవాణి తన అనుభవాలను చెప్పారు. డీఎస్‌డీఓగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి’ ఆమె కాసేపు మాట్లాడారు. ఆ వివరాల్లో ఆమె మాటల్లోనే.. మాది వరంగల్ జిల్లా. 1993లో నిజామాబాద్‌లో, 1995 నుంచి 2000 వరకు వరంగల్‌లో, 2000 నుంచి 2009 వరకు కరీంనగర్ హ్యాండ్‌బాల్ కోచ్‌గా పనిచేశాను. 2009 నుంచి 2011 వరకు నల్లగొండ ఇన్చార్జ్ డీఎస్‌డీఓగా, 2011 నుంచి 2013వరకు మళ్లీ కోచ్‌గా విధులు నిర్వహించాను. ఆ తర్వాత 2013–2015లో కరీంనగర్ డీఎస్‌డీఓగా పనిచేశాను. గతేడాది సెప్టెంబర్‌లో ఇక్కడ డీఎస్‌డీఓగా బాధ్యతలు తీసుకున్నాను. కలెక్టర్ సహకారంతో క్రీడాభివృద్ధి.. నేను బాధ్యతలు స్వీకరించిన రోజే కలెక్టర్‌ను కలిసి క్రీడాభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని కోరగా ‘గోహెడ్’ అంటూ ఎంతో ప్రోత్సహించారు. గతేడాది ఎస్బీఐ సహకారంతో ఆర్జీకేఏ టోర్నీలకు వెళ్లే క్రీడాకారులకు క్రీడా దుస్తులతో పాటు బ్యాగులు అందజేశాం. జిల్లాలో నిర్మాణమవుతున్న గ్రీన్‌ఫీల్డ్ స్టేడియాల్లో ఇప్పటికే గద్వాల, కొల్లాపూర్, షాద్‌నగర్‌లలో పనులు పూర్తయ్యాయి. మిగతా ముగింపుదశలో ఉన్నాయి. ఈ ఏడాది వేసవిలో ఆంధ్రాబ్యాంక్ సహకారంతో జిల్లాలో 36ప్రాంతాల్లో సమ్మర్‌క్యాంప్‌లు విజయవంతంగా నిర్వహించాం. రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో జిల్లా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ సహకారంతో ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహించగా.. తొలిసారిగా జిల్లా నుంచి 25మంది విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉంది. మాడ్రనైజేషన్ స్కీం కింద మహబూబ్‌నగర్, జడ్చర్ల, ఆత్మకూర్, అచ్చంపేట, వనపర్తి, నారాయణపేట, గద్వాల స్టేడియాల ఆధునికీకరణకు ఎమ్మెల్యేల సహకారంతో ప్రతిపాదనలు పంపగా మహబూబ్‌నగర్‌కు రూ.2.50 కోట్లు, నారాయణపేటకు రూ.2.65 కోట్లు మంజూరయ్యాయి. భవిష్యత్‌లో ప్రైవేట్ విద్యాసంస్థలు పాపులర్ గేమ్‌లను స్పాన్సర్ చేసేలా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తన 23 ఏళ్ల సర్వీస్ కంటే జిల్లాలో ఏడాది నుంచి పనిచేస్తుండడం సంతోషంగా ఉందని తెలిపారు. -
బాధ్యతలు స్వీకరించిన డీఎస్డీఓ
నెల్లూరు(బృందావనం): జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా పీవీ రమణయ్య గురువారం బాధ్యతలను స్వీకరించారు. తిరుపతి సబ్‌సెంటర్ ఖోఖో కో^Œ గా పనిచేస్తూ బదిలీపై వచ్చిన ఆయన ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రీడారంగ ప్రగతికి కృషి చేస్తామన్నారు. కాగా శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు అభినందనలు తెలిపారు. -
డీఎస్‌డీఓగా రమణయ్య
నెల్లూరు(బృందావనం): జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.బాలాజీ బుధవారం చిత్తూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సబ్‌సెంటర్ తిరుపతి హాకీ కోచ్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడలోని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ప్రధాన కార్యాలయంలో పరిపాలనా విభాగంలో విధులు నిర్వహిస్తున్న పీవీ రమణయ్య నెల్లూరు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా బదిలీ చేస్తూ శాప్ మేనేజింగ్ డైరెక్టర్ రేఖారాణి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. బాలాజీ చిత్తూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో హాకీ కోచ్‌గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై నెల్లూరు డీఎస్‌డీఓగా ఈ ఏడాది జూన్ 20న బదిలీ అయ్యారు. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించి 40 రోజులు గడవ మునుపే వివిధ కారణాల రీత్యా విధులు నిర్వహించేందుకు సుముఖత చూపకపోవడంతో బదిలీ అనివార్యమైంది. -
డీఎస్డీవోగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ
గుంటూరు స్పోర్ట్స్: గుంటూరు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా బి.శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఉదయం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి రిపోర్ట్ చేశారు. ఇన్చార్జి జేసీ ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్వో నాగబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో శాప్ ఓఎస్డీ, ఇన్చార్జ్ డీఎస్yీ వో పి.రామకృష్ణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. -
రేషన్ కార్డుల్లో ఫొటో అప్లోడ్ చేసుకోండి: డీఎస్ డీఓ
అనంతపురం అర్బన్ : రేషన్ కార్డుకు సంబంధించి కుటుంబ గ్రూప్ ఫొటోని అప్లోడ్ చేయించుకోవాలని లబ్ధిదారులకు డీఎస్ఓ ప్రభాకర్‌రావు సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డులో గ్రూప్ ఫొటో రాని వారు సంబంధిత తహశీల్దారు కా ర్యాలయాలకు వెళ్లి అప్లోడ్ చేయించుకోవాలని తెలిపారు. అప్లోడ్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. చౌక దుకాణాల డీలర్లు తమ షాపులోని రేషన్ సరుకులు, స్టాక్ వివరాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని చెప్పారు. తహశీల్దారులు, సీఎస్డీటీలు క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి దుకాణాల్లో వివరాలు ప్రదర్శించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. -
క్రీడాపాఠశాల ఫలితాలు విడుదల
కడప స్పోర్ట్స్ : వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికల ఫలితాలను డీఎస్డీఓ ఎం.ఎస్.ఎల్.ఎన్. శర్మ మంగళవారం రాత్రి విడుదల చేశారు. కడప నగరంలో డీఎస్ఏ క్రీడామైదానంలో ఈనెల 25,26 తేదీల్లో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన 17 మంది బాలురు, 19 మంది బాలికలను రాష్ట్రస్థాయి ఎంపికలకు ఎంపికచేశారు. ఎంపికైన క్రీడాకారులు కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ జయచంద్ర, కోచ్‌లు గౌస్‌బాషా, షఫీ, సిబ్బంది పాల్గొన్నారు. ఎంపికైన బాలికలు : ఎం. హిమబిందు (కడప), కె. రాజ్యలక్ష్మి (సీకే దిన్నె), టి. శ్రీవిద్య (సీకే దిన్నె), కె. వెన్నెల (బీమఠం), టి.పావని (సీకే దిన్నె), బి. జయలక్ష్మి (బద్వేలు), ఎన్.గాయత్రి (పెండ్లిమర్రి), డి.కల్యాణి (ప్రొద్దుటూరు), కె.జ్యోతి (రాయచోటి), కె. దీపిక (సీకే దిన్నె), పి. జాహ్నవి (వేంపల్లి), ఎస్.సరస్వతి (దువ్వూరు), కె. పావని (రాయచోటి), ఎం. శైలజ (ఎల్ఆర్ పల్లి), ఎన్. శివనందిని (కడప), సి. భవిత (పోరుమామిళ్ల), వి. సాజియావైష్ణవి (కడప), వేమారాణి (వేంపల్లి), సి. పల్లవి (కడప). ఎంపికైన బాలురు : ఎస్. ఉమేష్‌రిషి (రైల్వేకోడూరు), జి.చంద్రశేఖర్ (ప్రొద్దుటూరు), జి. గౌతమ్కిశోర్ (ప్రొద్దుటూరు), ఎన్. పృధ్వీనాథ్రెడ్డి (కడప), సి. మౌళీంద్రనాథరెడ్డి (ప్రొద్దుటూరు), డి.కిశోర్‌కుమార్‌రెడ్డి (పెండ్లిమర్రి), కె.నందన్(రామాపురం), ఎ.రాహుల్ (కలసపాడు), ఎ.పృధ్వి (కడప), బి.నాయబ్‌రసూల్ (రాజంపేట), డి.ప్రణయ్‌కుమార్ (వేంపల్లి), ఆర్. వెంకటరమణ (రాయచోటి), డి.భానుతేజ (వల్లూరు), డి.నాగచైతన్య (వల్లూరు), బి.జనార్ధన్ (బద్వేలు), వి. అశోక్ (ప్రొద్దుటూరు), మాడా శ్రీనివాస్ (సీకే దిన్నె). -
ఉత్సాహంగా క్రీడా ఎంపికలు
కడప స్పోర్ట్స్ : డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు రెండోరోజూ కొనసాగాయి. మంగళవారం నిర్వహించిన ఎంపికల ప్రక్రియను డీఎస్డీఓ ఎం.ఎస్ఎల్.ఎన్. శర్మ, శాప్ డైరెక్టర్ డి. జయచంద్ర పర్యవేక్షించారు. రెండోరోజు నిర్వహించిన ఎంపికలకు 14 మండలాల నుంచి 27 మంది బాలురు 10 మంది బాలికలు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో మూడురోజుల అసెస్మెంట్ ట్రైనింగ్ అనంతరం 6వ తేదీ తుది ఎంపికలు నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు గౌస్‌బాషా, షఫీ, నూర్, డీఎస్ఏ సిబ్బంది అక్బర్, బాషా తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ కేంద్రాల్లో మినీ స్టేడియంలు
నరసన్నపేట : జిల్లాలోని 10 నియోజక వర్గ కేంద్రాల్లో మినీ స్టేడియంల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని డీఎస్డీఓ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కో కేంద్రంలో రూ.2.10 కోట్లు వెచ్చించి స్టేడియం నిర్మించనున్నామన్నారు. సోమవారం నరసన్నపేట మండలం మాకిలవలస వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. టెక్కలిలో డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సీతంపేట, పాతపట్నం, నరసన్నపేటల్లో స్థలాలు గుర్తించామన్నారు. నరసన్నపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనే స్టేడియం నిర్మించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఒక్కో చోట 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, ప్రత్యేక భవనం, టేబుల్ టెన్నిస్‌తో పాటు వివిధ క్రీడలకు ప్రత్యేకించి కోర్టులు నిర్మిస్తామన్నారు. వీటికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆయనవెంట ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి సుందరరావు ఉన్నారు.