నరసన్నపేట : జిల్లాలోని 10 నియోజక వర్గ కేంద్రాల్లో మినీ స్టేడియంల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని డీఎస్‌డీఓ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కో కేంద్రంలో రూ.2.10 కోట్లు వెచ్చించి స్టేడియం నిర్మించనున్నామన్నారు. సోమవారం నరసన్నపేట మండలం మాకిలవలస వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. టెక్కలిలో డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సీతంపేట, పాతపట్నం, నరసన్నపేటల్లో స్థలాలు గుర్తించామన్నారు. నరసన్నపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనే స్టేడియం నిర్మించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఒక్కో చోట 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, ప్రత్యేక భవనం, టేబుల్ టెన్నిస్‌తో పాటు వివిధ క్రీడలకు ప్రత్యేకించి కోర్టులు నిర్మిస్తామన్నారు. వీటికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆయనవెంట ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి సుందరరావు ఉన్నారు.
నియోజకవర్గ కేంద్రాల్లో మినీ స్టేడియంలు
Published Tue, Jun 2 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM
Advertisement