డీఎస్డీఓగా రమణయ్య
డీఎస్డీఓగా రమణయ్య
Published Wed, Aug 3 2016 11:55 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(బృందావనం):
జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.బాలాజీ బుధవారం చిత్తూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సబ్‌సెంటర్ తిరుపతి హాకీ కోచ్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడలోని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ప్రధాన కార్యాలయంలో పరిపాలనా విభాగంలో విధులు నిర్వహిస్తున్న పీవీ రమణయ్య నెల్లూరు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా బదిలీ చేస్తూ శాప్ మేనేజింగ్ డైరెక్టర్ రేఖారాణి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. బాలాజీ చిత్తూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో హాకీ కోచ్‌గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై నెల్లూరు డీఎస్‌డీఓగా ఈ ఏడాది జూన్ 20న బదిలీ అయ్యారు. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించి 40 రోజులు గడవ మునుపే వివిధ కారణాల రీత్యా విధులు నిర్వహించేందుకు సుముఖత చూపకపోవడంతో బదిలీ అనివార్యమైంది.
Advertisement
Advertisement