సాక్షి, హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై అధికారుల విచారణ ముగిసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆరున్నర గంటలకు పైగా సాగిన విచారణ కొనసాగింది. సస్పైండైన ఓఎస్డీ హరికృష్ణ, స్టూడెంట్స్, స్టాఫ్ స్టేట్‌మెంట్స్‌ను అధికారులు రికార్డులు చేశారు. ఇక, అధికారుల విచారణ సందర్భంగా చైల్డ్ ప్రొటెక్షన్ బృందం అధికారులు.. సమగ్ర సమాచారం సేకరించారు. కాగా, నివేదికను మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అధికారులు సమర్పించనున్నారు.
ఇదిలా ఉండగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మరోవైపు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ దీనిపై స్పందించారు. తాజాగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ చేసి నన్ను సస్పెండ్ చేశారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: నవంబర్‌లోనే గ్రూప్-2.. రీషెడ్యూల్ తేదీలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment