Hakimpet
-
క్రీడాకారిణికి మంత్రి పేషీ ఉద్యోగి వేధింపులు
-
స్పోర్ట్స్ స్కూల్లో వేధింపుల ఘటనపై విచారణ పూర్తి.. కలెక్టర్‌కు నివేదిక
సాక్షి, హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై అధికారుల విచారణ ముగిసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆరున్నర గంటలకు పైగా సాగిన విచారణ కొనసాగింది. సస్పైండైన ఓఎస్డీ హరికృష్ణ, స్టూడెంట్స్, స్టాఫ్ స్టేట్మెంట్స్ను అధికారులు రికార్డులు చేశారు. ఇక, అధికారుల విచారణ సందర్భంగా చైల్డ్ ప్రొటెక్షన్ బృందం అధికారులు.. సమగ్ర సమాచారం సేకరించారు. కాగా, నివేదికను మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అధికారులు సమర్పించనున్నారు. ఇదిలా ఉండగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మరోవైపు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ దీనిపై స్పందించారు. తాజాగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ చేసి నన్ను సస్పెండ్ చేశారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నవంబర్లోనే గ్రూప్-2.. రీషెడ్యూల్ తేదీలు ఇవే.. -
హకీంపేట ఘటనపై హరికృష్ణ స్పందన
-
హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి
-
HYD: రాష్ట్రపతి నివాసానికి ద్రౌపది ముర్ము
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. అనతరం రోడ్డు మార్గాన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. అల్లూరి జయంతి వేడుకలకు ముర్ము సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి 125 జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గననున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ తదితరులు హాజరుకానున్నారు. చదవండి: హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక.. గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు -
హకీంపేట్ లో CISF రైజింగ్ డే పరేడ్
-
తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ నేతలతో భేటీపై ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా హైదరాబాద్ రానున్నారు. శనివారం రాత్రి 8.30 గంటలకు ఆయన హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ అకాడమీ (నీసా)లో రాత్రి పూట బసచేస్తారు. సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం అక్కడే నిర్వహించనున్న కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం కేరళలోని కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు. కాగా, శనివారం రాత్రి లేదా ఆదివారం ఆయన రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష, ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో ప్రశ్నించేందుకు కవితకు ఈడీ నోటీసులు, కేంద్రం, ప్రధాని మోదీ, బీజేపీలపై బీఆర్ఎస్, ఇతర విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తీరు.. తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా సంగారెడ్డిలో వివిధ రంగాలకు చెందిన మేధావులతో భేటీ కావాలని భావించారు. అయితే కొచ్చి కార్యక్రమం కారణంగా ఈ సమావేశం రద్దయినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. -
అఖిల భారత రవాణా కబడ్డీ టోర్నమెంట్ విజేత హర్యానా
సాక్షి, హైదరాబాద్: హకీంపేట ట్రాన్స్పోర్ట్ అకాడమీలో నిర్వహించిన అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ టోర్నమెంట్లో హర్యానా జట్టు విజేతగా నిలిచింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ శనివారం సాయంత్రంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించగా.. ఈ పోటీలకు టీఎస్ఆర్టీసీ ఆతిథ్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజా రవాణా సంస్థలకు చెందిన 9 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనగా.. తుది పోరులో హర్యానా రోడ్ వేస్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ కార్పొరేషన్ (బి.ఎం.టి.సి) జట్లు తలపడ్డాయి. ఈ పోటీలో హర్యానా జట్టు ఛాంపియన్‌గా .. బెంగళూరు జట్టు రన్నర్‌గా పతకాలు అందుకోగా మూడో స్థానంలో మహరాష్ట్ర ఆర్టీసీ జట్టు నిలిచింది. -
ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మహిళ పై సీనియర్ ఉద్యోగి వేధింపులు
సాక్షి, అల్వాల్(హైదరాబాద్): పనిచేసే చోట ఉన్నత ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌లో నివసించే ఓ మహిళ(35) హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఉద్యోగం చేస్తోంది. కొన్ని రోజులుగా తన సీనియన్ ఉద్యోగి ఎస్.కె.శర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, రక్షణ కల్పించాలని కోరుతూ ఎయిర్‌ఫోర్స్ ప్రధాన గేటువద్ద ధర్నా చేసింది. అనంతరం అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రంగా స్పోర్ట్స్ స్కూల్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఫలవంతం చేసేందుకు క్రీడా శాఖ పటిష్ట కార్యాచరణతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌ను ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు రాగా మెరుగైన క్రీడా వసతులున్న ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర క్రీడా శాఖ ఆమోదముద్ర దక్కింది. అందులో తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి. దీనితో పాటు కర్ణాటక, ఒడిశా, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరామ్, నాగాలాండ్ రాష్ట్రాలు కూడా కేఐఎస్‌సీఈలను ఏర్పాటు చేయనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, శిక్షణ, వసతుల ఆధారంగానే వీటిని ఆమోదించినట్లు క్రీడాశాఖ వెల్లడించింది. వీటి అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్ లభించనుంది. కేఐఎస్‌సీఈ హోదాకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. -
కార్డన్‌సెర్చ్..అదుపులో 40 మంది నేరస్తులు
హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట్, ఎన్ఎస్ఎఫ్ కాలనీ, న్యూ హకీంపేట్ ప్రాంతంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి 300 మంది పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమైన కార్డన్ సెర్చ్ 2 గంటలకు ముగిసింది. ఇందులో భాగంగా 605 ఇండ్లలో డీసీపి, అసిస్టెంట్ డీసీపితో పాటు, ముగ్గురు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుల్స్ మొత్తం 300 మంది వివిధ బృందాలుగా వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరి ధ్రువపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రైవేట్ పాఠశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. 36 మంది అనుమానాస్పద, పాత నేరస్థులు, నలుగురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని 2 ఆటోలు, 60 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. అదుపులోకి తీసుకోబడిన వ్యక్తులు, స్వాధీనం చేసుకున్న వాహనాల పూర్తి వివరాలు సేకరించి వాటిని ధృవీకరించుకోవడం జరుగుతుందని డీసీపీ ఎ.వెంకటేశ్వర రావు వెల్లడించారు. -
హకీంపేటలో 85వఎయిర్ఫోర్స్డే వేడుకలు
-
హకీంపేట్‌లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : నగరంలోని హకీంపేట ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 500 మంది పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మంది రౌడీషీటర్లతో పాటు 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే తనిఖీల్లో పత్రాలు లేని 48 ద్విచక్రవాహనాలతో పాటు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఆరుగురు చైన్ స్నాచర్లు ఉన్నట్లు సమాచారం. -
హకీంపేట,టోలిచౌకీలో పోలీసుల కార్డెన్‌సెర్చ్
-
తుపాకీతో కాల్చుకుని విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని హకీంపేట్‌లో గురువారం సాయంత్రం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తన తండ్రి తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆ విద్యార్థిని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.