అఖిల భారత రవాణా కబడ్డీ టోర్నమెంట్‌ విజేత హర్యానా | Haryana Was Winner-All India Transport Corporations Kabaddi Tournament | Sakshi
Sakshi News home page

అఖిల భారత రవాణా కబడ్డీ టోర్నమెంట్‌ విజేత హర్యానా

Published Sat, Mar 4 2023 8:36 PM | Last Updated on Sat, Mar 4 2023 8:42 PM

Haryana Was Winner-All India Transport Corporations Kabaddi Tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హకీంపేట ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో నిర్వ‌హించిన‌ అఖిల భార‌త ర‌వాణా సంస్థ‌ల క‌బ‌డ్డీ టోర్న‌మెంట్‌లో హర్యానా జట్టు విజేతగా నిలిచింది. మూడు రోజుల పాటు జ‌రిగిన ఈ టోర్నమెంట్‌ శనివారం సాయంత్రంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహించగా.. ఈ పోటీలకు టీఎస్‌ఆర్టీసీ ఆతిథ్యం ఇచ్చింది.

దేశవ్యాప్తంగా ప్ర‌జా ర‌వాణా సంస్థ‌ల‌కు చెందిన 9 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనగా.. తుది పోరులో  హర్యానా రోడ్ వేస్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ కార్పొరేషన్ (బి.ఎం.టి.సి) జట్లు తలపడ్డాయి. ఈ పోటీలో హర్యానా జట్టు ఛాంపియన్‌గా .. బెంగళూరు జట్టు రన్నర్‌గా ప‌త‌కాలు అందుకోగా మూడో స్థానంలో మ‌హ‌రాష్ట్ర ఆర్టీసీ జట్టు  నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement