kabaddi tournament
-
అఖిల భారత రవాణా కబడ్డీ టోర్నమెంట్ విజేత హర్యానా
సాక్షి, హైదరాబాద్: హకీంపేట ట్రాన్స్పోర్ట్ అకాడమీలో నిర్వహించిన అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ టోర్నమెంట్లో హర్యానా జట్టు విజేతగా నిలిచింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ శనివారం సాయంత్రంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించగా.. ఈ పోటీలకు టీఎస్ఆర్టీసీ ఆతిథ్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజా రవాణా సంస్థలకు చెందిన 9 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనగా.. తుది పోరులో హర్యానా రోడ్ వేస్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ కార్పొరేషన్ (బి.ఎం.టి.సి) జట్లు తలపడ్డాయి. ఈ పోటీలో హర్యానా జట్టు ఛాంపియన్‌గా .. బెంగళూరు జట్టు రన్నర్‌గా పతకాలు అందుకోగా మూడో స్థానంలో మహరాష్ట్ర ఆర్టీసీ జట్టు నిలిచింది. -
మార్చి 2 నుంచి అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ పోటీలు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్-2023 మార్చి 2 నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్(ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్ శివారు హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం లభించేందుకు ఏఎస్ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జన్నార్ తెలిపారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్ ముంబై, పుణే మహానగర్ పరివాహన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొంటున్నాయని వివరించారు. కబడ్డీ పోటీలను గురువారం (మార్చి 2) ఉదయం 9.30 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారక తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు. -
Pro Kabaddi League 2021: ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: చివరి సెకనులో నవీన్ కుమార్ రెయిడింగ్‌కు వెళ్లి పాయింట్‌తో తిరిగి రావడంతో... గుజరాత్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌ను దబంగ్ ఢిల్లీ జట్టు 24–24తో ‘టై’గా ముగించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ రెయిడర్ నవీన్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 36–35తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యు ముంబా; యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
దక్షిణ కొరియా గెలుపు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ కొరియా, తెలంగాణ జట్ల మధ్య జరుగుతోన్న ఫ్రెండ్లీ కబడ్డీ టోర్నమెంట్లో దక్షిణ కొరియా మహిళల జట్టు దూసుకెళ్తోంది. బాచుపల్లిలోని కాసాని, జేఎస్ గెహ్లాట్ కబడ్డీ అకాడమీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణకొరియా 34–23తో తెలంగాణపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను కూకట్పల్లి ఎమ్మెల్యే ఎం. కృష్ణారావు, ఎమ్మెల్సీ రాజు, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, టెక్నికల్ డైరెక్టర్ ప్రసాద్ రావు ప్రత్యక్షంగా వీక్షించారు. -
రేపు ఖమ్మంలో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ
నిజామాబాద్ స్పోర్ట్స్ : కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో బుధవారం నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి అంద్యాల లింగన్న సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 నుంచి 14 వరకు సీనియర్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరిలో టోర్నీ జరుగుతుందన్నారు. ఇదివరకే జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించి, శిక్షణ పూర్తిచేసి తుదిజట్టును ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి టోర్నీకి ఎంపికైన జిల్లా క్రీడాకారులందరూ ఈ నెల 11న రాత్రి 8 గంటలకు కలెక్టరేట్ మైదానంలో రిపోర్టు చేయాలన్నారు.