
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట్, ఎన్‌ఎస్‌ఎఫ్ కాలనీ, న్యూ హకీంపేట్ ప్రాంతంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి 300 మంది పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమైన కార్డన్ సెర్చ్ 2 గంటలకు ముగిసింది. ఇందులో భాగంగా 605 ఇండ్లలో డీసీపి, అసిస్టెంట్ డీసీపితో పాటు, ముగ్గురు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుల్స్ మొత్తం 300 మంది వివిధ బృందాలుగా వెళ్లి తనిఖీలు నిర్వహించారు.
ప్రతి ఒక్కరి ధ్రువపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రైవేట్ పాఠశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. 36 మంది అనుమానాస్పద, పాత నేరస్థులు, నలుగురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని 2 ఆటోలు, 60 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. అదుపులోకి తీసుకోబడిన వ్యక్తులు, స్వాధీనం చేసుకున్న వాహనాల పూర్తి వివరాలు సేకరించి వాటిని ధృవీకరించుకోవడం జరుగుతుందని డీసీపీ ఎ.వెంకటేశ్వర రావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment