Cardon and search Operation
-
నల్గొండ పట్టణంలో కార్డన్ సెర్చ్
నల్లగొండ జిల్లా : పట్టణంలోని లెప్రసీ కాలనీలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో ఒక డీఎస్పీ, తొమ్మిది మంది సీఐలు, 14 మంది ఎస్ఐలు, 16 మంది మహిళా సిబ్బంది, 171 పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఎలాంటి పేపర్లు లేని 6 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇద్దరు అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులు ఫోన్ చేసి తెలుపాలని సూచించారు. ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని తెలిపారు. అలాగే ఎలాంటి డాక్యుమెంట్ లేని వెహికిల్ నడిపేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కార్డన్‌సెర్చ్..అదుపులో 40 మంది నేరస్తులు
హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట్, ఎన్ఎస్ఎఫ్ కాలనీ, న్యూ హకీంపేట్ ప్రాంతంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి 300 మంది పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమైన కార్డన్ సెర్చ్ 2 గంటలకు ముగిసింది. ఇందులో భాగంగా 605 ఇండ్లలో డీసీపి, అసిస్టెంట్ డీసీపితో పాటు, ముగ్గురు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుల్స్ మొత్తం 300 మంది వివిధ బృందాలుగా వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరి ధ్రువపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రైవేట్ పాఠశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. 36 మంది అనుమానాస్పద, పాత నేరస్థులు, నలుగురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని 2 ఆటోలు, 60 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. అదుపులోకి తీసుకోబడిన వ్యక్తులు, స్వాధీనం చేసుకున్న వాహనాల పూర్తి వివరాలు సేకరించి వాటిని ధృవీకరించుకోవడం జరుగుతుందని డీసీపీ ఎ.వెంకటేశ్వర రావు వెల్లడించారు. -
జిల్లాలో నిరంతరం కార్డన్‌సెర్చ్
సదాశివపేట(సంగారెడ్డి): జిల్లా వ్యాప్తంగా స్థానికేతరులు ఎక్కువగా నివసిస్తున్న పట్టణాల పరిధిలోని కాలనీల్లో నిరంతరం కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పట్టణ పరిధిలోని సిద్దాపూర్ కాలనీలో 150 మంది పోలీసు సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటిలో నివసిస్తున్న ప్రజలను నిద్రలేపి వారి ఆధార్, రేషన్ తదితర వివరాలను తెలుసుకున్నారు. వాహనాలను తనిఖీ చేశారు. ఈ కార్డన్‌సెర్చ్ ఉదయం 7 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్థానికేతరులు ఎక్కువగా నివసిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిసారించడమే కార్డన్‌సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. స్థాని కేతరులు అద్దె కావాలని వస్తే వారి గుర్తింపుకార్డులతో తెలుసుకుని అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సిద్దాపూర్ కాలనీలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో 53 బైక్‌లు, 6 ఆటోలను సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేశామన్నారు. సరైన ధ్రువపత్రాలు పోలీస్ స్టేషన్లో చూపించి తమ తమ వాహనాలను తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్, ఇన్స్పెక్టర్లు సురేం దర్‌రెడ్డి, నరెందర్, రా మకృష్ణారెడ్డి, తిరుపతిరాజు, 14 మం ది ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కరీంనగర్లో కార్డెన్ సెర్చ్
-
కరీంనగర్లో కార్డెన్ సెర్చ్
కరీంనగర్: నగరంలోని శివారుకాలనీలలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్‌నగర్, రెడ్డి కళాశాల, అపోలో హస్పిటల్ ఏరియాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 50 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టారు. సరైన పత్రాలు లేని బైక్‌లను ఈ నెల 10 తేదిలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీపీ ఆదేశించారు. అసాంఘీక కార్యకలాపాలను అరికట్టడానికి చేపట్టిన కార్డన్ సెర్చ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. -
కార్డాన్ సెర్చ్‌లో 360 మద్యం బాటిళ్లు స్వాధీనం
మచిలీపట్నం : కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని నవీన్‌మిట్టల్ కాలనీలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 360 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 11 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
పేట్ బషీరాబాద్‌లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ జరిగింది. వాజ్‌పేయ్ నగర్లో ఆదివారం వేకువజామున 200 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువ పత్రాలు లేని 2 ఆటోలు, 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.