సాక్షి, రాజేంద్రనగర్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనాథాశ్రమంలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ.. బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేర్ టేకర్ చెప్పిన మాట వినకపోతే దుస్తులు లేకుండా అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట నిలబెట్టడం సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. అనాథలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఓ మహిళ రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని కిస్మత్ పూరలో 15ఏళ్ల క్రితం అనాథాశ్రమాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు తొలుత తన తల్లిని కేర్ టేకర్‌గా నియమించారు. ఆమె వృద్ధురాలు కావడంతో రెండేళ్ల కిందట మరో మహిళ సునీతను ఆమె స్థానంలో కేర్ టేకర్‌గా నియమించారు. ప్రస్తుతం అనాథాశ్రమంలో 45 మంది బాలికలు ఉన్నారు. వారంతా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు.
అయితే, కొత్తగా చేరిన కేర్ టేకర్ సునీత.. బాలికలను చిత్రహింసలకు గురిచేయడంతో వారంతా ఆవేదన చెందారు. సునీత చెప్పిన మాటలు వినకపోతే బాలికలను దుస్తులు లేకుండా అందులో పనిచేసే వారి ఎదుట నిలబెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించింది. కాగా, ఈ అనాథాశ్రమానికి చెందిన 25 మంది బాలికలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సునీత వేధింపులను వారంతా.. ప్రధానోపాధ్యాయురాలు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చలించిపోయిన ఆమె.. రాజేంద్రనగర్ పోలీసులతో పాటు షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి సునీతను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సంస్థ వ్యవస్థాపకురాలితో అందులో పనిచేసే వారిని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం!
Comments
Please login to add a commentAdd a comment