TGO
-
ఉద్యోగుల జోలికొస్తే ఖబడ్దార్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులను దూషించడం, దాడులు చేయటం, బెదిరించటం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉద్యోగులను ఎవరైనా లక్ష్యంగా చేసుకుంటే.. తాము కూడా వారిని టార్గెట్ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం టీజీఓ భవన్లో సంఘం విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ సంఘాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి సమస్యలు ఏకరువు పెడుతున్నారని తెలిపారు. ఉద్యోగులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు. పెండింగ్ బిల్లులు త్వరగా పరిష్కరించాలి సంఘం కార్యకవర్గ సమావేశంలో అన్ని కేటగిరీల్లో ని ఉద్యోగులకు సంబంధించి 500 సమస్యలపై చర్చ జరిగిందని, ఇందులో కీలకమైన అంశాలు 53 ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో ఆరు అత్యంత ప్రధానమైనవని చెప్పారు. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను డిసెంబర్ నెలాఖరుకల్లా పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచి్చనా.. ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వివరించారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం మనుగడలో లేకుండా పోయిందని, ప్రైవేటు అద్దె వాహనాలతోనే వ్యవస్థ నడుస్తోందని చెప్పారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో కొందరు అధికారులు.. ఉద్యోగులు, సంఘాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి పేర్లతో సహా లిఖితపూర్వకంగా సీఎం, సీఎస్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
తెలంగాణ : అడ్డదారిలో ఎక్స్టెన్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులంతా రిటైర్మెంట్ వయసు పెంపు కోసం ఎదురుచూస్తుంటే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తమ అనుకున్న వారి పదవీ విరమణ వయసు పెంపునకే కృషి చేస్తున్నారు. ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని ఈ తతంగానికి పాల్పడుతున్నారు. గతంలో ప్రజాప్రతినిధుల సిఫారసుతో ప్రభుత్వం చేనేత జౌళి శాఖలో ఇద్దరి పదవీ విరమణ వయసు పొడిగించగా, ఇప్పుడు కొందరు టీజీవో, టీఎన్జీవో సంఘాల నేతలు తమ వారికి ఇలాగే రిటైర్మెంట్ వయసు పొడిగించుకున్నారు. దీని కోసం తమ సంఘాల సిఫారసులను వాడుకోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వం పదవీ విరమణ వయసును పొడిగిస్తుందని వేల మంది ఎదురు చూస్తుండగా, సంఘాల నేతలు మాత్రం తమ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుండటంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో సీనియర్ లెక్చరర్ వెంకటేశ్వర్లు, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, చేనేత జౌళిశాఖలో పిట్టల యాదగిరి, రత్నాకర్, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, అగ్రికల్చర్ వర్సిటీలో సుధీర్ కుమార్, పరిటాల సుబ్బారావుల సర్వీస్‌నూ రెండేళ్లు పొడిగించడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణం అవుతోంది. సాధారణ ఉద్యోగులకు అడిగే అవకాశం లేక.. ఉద్యోగ సంఘాల్లో సాధారణ ఉద్యోగులకు ప్రాథమిక సభ్యత్వం ఉన్నా తమ నేతలను అడిగే పరిస్థితిలో వారు లేరు. మెజారిటీ సంఘాలు సర్వసభ్య సమావేశాలను నిర్వహిస్తున్న దాఖలాల్లేవ్. దీంతో సాధారణ ఉద్యోగుల ఆవేదనను పట్టించుకునే వారే లేకుండాపోయారు. కాస్త పరపతి ఉన్నవారు అడిగినా.. సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి మిన్నకుండిపోతున్నారన్న విమర్శలున్నాయి. అయితే తమ ఇంట్లో వ్యక్తులు, బంధువుల కోసం మాత్రం అడ్డదారిలో పైరవీలు చేసుకొని ప్రయోజనాలు పొందుతున్నారని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ.. నిరాశల్లో ఉద్యోగులు.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడం, తర్వాత ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం కావడంతో ఉద్యోగులు ఎప్పుడెప్పుడు జీవో వస్తుందా అని కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా ఎదురుచూస్తూనే.. అనేక మంది పదవీ విరమణ పొందుతున్నారు. కనీసం ఈసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున రిటైర్మెంట్ వయసును సీఎం పొడిగిస్తారని ఆశతో ఎదురుచూసినా నిరాశ తప్పలేదు. ఇప్పటికే వేల మంది పదవీ విరమణ పొందగా, 2022 వరకు మరో 23,386 మంది పదవీ విరమణ పొందనున్నారు. వీరిలో చాలా మంది రిటైర్మెంట్ వయసు పెంపు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దీని కోసం సంఘాల నేతలను ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు రిటైర్ అయినవారు - 2,708 మంది వచ్చే 7నెలల్లో పదవీ విరమణ పొందనున్న వారు - 5,900 మంది 2022 డిసెంబర్ నాటికి రిటైర్ కానున్న ఉద్యోగులు - 23,386 మంది వ్యక్తిగత ప్రయోజనాలు సరికాదు.. ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించాల్సిన సంఘాల నేతలు వాటిని పక్కనపెట్టేశారు. తమ అవసరాల కోసం ప్రభుత్వం వద్ద ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. పీఆర్సీ, డీఏ, ఐఆర్ వంటి సమస్యలను పట్టించుకోవడం లేదు. తమకు ప్రయోజనం చేకూర్చితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. భజనపరులకే ప్రభుత్వ ప్రయోజనం చేకూర్చుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకొని ఉద్యోగులందరికి మేలు చేయాలి. – సదానంద్‌గౌడ్, పర్వతరెడ్డి, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యుదర్శులు.. హర్షవర్దన్‌రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు... జంగయ్య, చావరవి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు... నావత్ సురేశ్, టీపీయూఎస్ అధ్యక్షుడు -
ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో, టీజీవోల మద్దతు
-
సమ్మెకు సపోర్ట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్ జీవో, టీజీవో సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మద్దతు ప్రకటిం చేందుకు సిద్ధమైంది. బుధవారం జరిగే జేఏసీ సమావేశంలో చర్చించి ప్రకటన చేయనుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించినట్లవుతుంది. మంగళవారం టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశ జరిగింది. అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వ త్థామరెడ్డి, రాజిరెడ్డి, సుధ, ఎస్వీ రావు తదితరు లు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత ఇతర నేతలతో చర్చించారు. తర్వాత రవీందర్‌రెడ్డి, మమత ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించారు. జేఏసీ కార్యాచర ణను బుధవారం ప్రకటిస్తామని తెలిపారు. రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పది రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో అన్ని వర్గాలు పాల్గొంటున్నాయన్నారు. ఆర్టీసీ జేఏసీ వస్తేనే మద్దతు ఇవ్వాలని కిందిస్థాయి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆగామన్నారు. అయితే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు మరణించిన సంఘటన తమను కలచివేసిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు వచ్చే జీతాలు చాలా తక్కువ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో అడిగామన్నారు. ఆర్టీసీ సమ్మెను చూసి అదే మార్గంలో వెళ్లాలని ఇతర ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తున్నాయన్నారు. ఇలాగే అయితే మరో సకల జనుల సమ్మెకు సిద్ధమయ్యే పరిస్థితి వస్తుందని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్ప డమే లక్ష్యంగా ముందుకు వెళతామన్నారు. టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. ఏ రంగం లోని ఉద్యోగులు అయినా ఒకటేనని, అంతా తమ సోదరులేనన్న భావనను తెలంగాణ ఉద్యమం నేర్పించిందన్నారు. అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చాక పురోగమించాల్సిన ఆర్టీసీ తిరో గమనంలో పడిందన్నారు. రాష్ట్రం రాకముందు 1,200 గ్రామాల్లో బస్సు సౌకర్యం లేదన్నారు. రాష్ట్రం వస్తే గ్రామగ్రామాన బస్సు తిప్పుతామని చెప్పామన్నారు. ఇప్పుడు 3,000 గ్రామాలకు బస్సులే లేకుండాపోయాయన్నారు. అర్బన్ లాసెస్‌ను చట్టం తెచ్చి ఇస్తామని సీఎం చెప్పినా రూ. 1,400 కోట్లు రాలేదన్నారు. రూ.210 కోట్లు బ్యాంకు గ్యారంటీకి సంబంధించి రావాల్సినవి రాలేదన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితిలోనే సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు. చాలా వరకు ఆర్టీసీ ఆస్తులను అమ్మేశారని, మిగిలిన వాటినైనా కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభు త్వం మాట్లాడిన తీరు కార్మికులను కలచివేసిం దన్నారు. ఇంత జరుగుతున్నా స్ఫూర్తిగా నిలవా ల్సిన టీజీవో, టీఎన్జీవోలు ఎందుకు స్పందిం చడం లేదని కొన్ని మాటలు అన్నా.. అందుకు చింతిస్తున్నామన్నారు. యాజమాన్యం సీఎంతో మాట్లాడి కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని కోర్టు చెప్పిందన్నారు. యూనియన్‌గా తమను కూడా చర్చలకు వెళ్లమని తమ అడ్వొకేట్ సూచించారన్నారు. చర్చల ఫలితాల మేరకు ముందుకు సాగుతామని వెల్లడించారు. టీఎన్జీవో.. ప్రధాన తీర్మానాలివే.. ►ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రస్తుతం సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నాం. ►సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానం లో విధులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఉత్తర్వు లను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ►పీఆర్సీ మంజూరు, సీపీఎస్ రద్దు, పదవీ విరమణ వయసు పెంపు, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ మంజూరు తదితర 15 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. -
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగుల బదిలీలపై వెంటనే స్పందించాలని టీజీవోల చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీని టీజీవో నేతలు కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రమోషన్ కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పీఆర్సీ కమిటీని ప్రకటించాలని, కోరారు. కార్మిక శాఖలో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, భార్యాభర్తలకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయా లని టీజీవో అధ్యక్షురాలు మమత కోరారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ తన పరిధిలో ఉన్న విషయాలపై 10 రోజుల్లో స్పష్టత ఇస్తానని, మిగతా అంశాలపై సీఎంతో చర్చిస్తానని హామీనిచ్చారు. -
తెలంగాణ ఉద్యోగులను త్వరలోనే రప్పిస్తాం
-
'తెలంగాణ ఉద్యోగులను త్వరలోనే రప్పిస్తాం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను త్వరలోనే ఇక్కడికి రప్పిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో టీజీవో డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులదే కీలక పాత్ర అని కేటీఆర్ గుర్తు చేశారు. అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. -
టీజీవో నుంచి శ్రీనివాస్‌గౌడ్ అవుట్
జీవో జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం చైర్మన్‌గా కొనసాగడానికి వీల్లేదని పేర్కొంటూ రాష్ట్రప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తన రాజీనామా ఆమోదం పొందడానికి రెండు రోజుల ముందు(మార్చి 8న) జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తనను టీజీవో చైర్మన్‌గా నియమిస్తూ తీర్మానం చేశారని శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అలాంటి తీర్మానమేదీ చేయలేదని టీజీవో ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగంలో లేని వ్యక్తులు ఉద్యోగ సంఘాల్లో కొనసాగే అవకాశం లేనందున టీజీవో చైర్మన్‌గా శ్రీనివాసగౌడ్ కొనసాగడానికి వీల్లేదని ప్రభుత్వం పేర్కొంది.