ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్ జీవో, టీజీవో సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మద్దతు ప్రకటిం చేందుకు సిద్ధమైంది. బుధవారం జరిగే జేఏసీ సమావేశంలో చర్చించి ప్రకటన చేయనుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించినట్లవుతుంది. మంగళవారం టీఎన్‌జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశ జరిగింది. అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వ త్థామరెడ్డి, రాజిరెడ్డి, సుధ, ఎస్‌వీ రావు తదితరు లు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత ఇతర నేతలతో చర్చించారు. తర్వాత రవీందర్‌రెడ్డి, మమత ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించారు. జేఏసీ కార్యాచర ణను బుధవారం ప్రకటిస్తామని తెలిపారు.