
ముంబైలో పుట్టి పెరిగిన వికాస్ ఒబెరాయ్.. జై హింద్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు.

తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఓనర్/ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు.

ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్.. ఒబెరాయ్ రియాల్టీకి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.

30 ఏళ్ల క్రితం తన తండ్రి రణవీర్ ఒబెరాయ్ స్థాపించిన రియల్-ఎస్టేట్ కంపెనీని వికాస్ ఒబెరాయ్ బాగా అభివృద్ధి చేశారు.

ఆ తరువాత కాలంలో ఒబెరాయ్ ఆతిథ్యం, రిటైల్, కార్పొరేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌తో సహా విభిన్న రంగాలలోకి ప్రవేశించారు.

ఒబెరాయ్ రియాల్టీకి అధిపతి మాత్రమే కాదు, వికాస్ ఒబెరాయ్ ముంబైలోని ఫైవ్ స్టార్ వెస్టిన్ హోటల్‌ను కూడా కలిగి ఉన్నారు.

వికాస్ ఒబెరాయ్.. బాలీవుడ్ నటి గాయత్రీ జోషిని వివాహం చేసుకున్నారు.

వీరికి విహాన్ ఒబెరాయ్, యువన్ ఒబెరాయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

గతేడాది అక్టోబర్‌లో వీరు ఇటలీలో ఒక కారు ప్రమాదంలో చిక్కుకుని అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు.




