చాపరాయిలో విద్యార్థి గల్లంతు | Student missing in chaparayi | Sakshi
Sakshi News home page

చాపరాయిలో విద్యార్థి గల్లంతు

Published Wed, May 13 2015 3:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

చాపరాయిలో విద్యార్థి గల్లంతు

చాపరాయిలో విద్యార్థి గల్లంతు

బాధితునిది విజయనగరం జిల్లా
బయటపడిన ఇద్దరు విశాఖ విద్యార్థులు

 
డుంబ్రిగుడ: పర్యాటక కేంద్రమైన చాపరాయి గెడ్డలో మంగళవారం సాయంత్రం విశాఖ నగరం గ్లోబల్ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విజయనగరం జిల్లాకు చెందిన జోషి (22) గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నం డైమండ్ పార్కు సమీపంలోని గ్లోబల్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు పాడేరులో జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చారు.

అనంతరం డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలపాతాన్ని తిలకించేందుకు మంగళవారం వచ్చారు. చాపరాయి వద్ద ప్రమాదకరంగా ఉన్న ప్రదేశం వద్ద జలపాతాన్ని తిలకిస్తున్న జోషి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు సహ విద్యార్థులు సంధ్య, బషీర్ గెడ్డలో దూకినా కాపాడలేకపోయారు. ఈ ప్రయత్నంలో సంధ్య కూడా ప్రమాదంలో చిక్కుపోవడంతో స్థానిక గిరిజన యువకులు వారిని రక్షించారు. జోషి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో ఇంతవరకు సుమారు 24 మంది వరకు పర్యాటకులు మరణించారు. జలపాతం వద్ద గట్టి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement