Chaparayi
-
దమ్ముంటే చాపరాయి బాధితులకు ధైర్యం చెప్పు
సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం తనయుడు నారా లోకేష్‌కు దమ్ముంటే తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతంలోని చాపరాయి గ్రామానికి వెళ్లి అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయిన 17 కుటుంబాలను పరామర్శించాలని మాజీ ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం నగర వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు సవాల్ విసిరారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య, సాధారణ వాహనాలు వెళ్లలేని కొండకోనల్లో ఉన్న చాపరాయి గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లి వారిని పరామర్శించడం ఆయన నాయకత్వానికి ప్రతీకని ప్రశంసించారు. బుధవారం ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ తండ్రి చాటు బిడ్డగా, ముద్ద పప్పుగా పేరుగాంచిన నారా లోకేష్, వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక పెద్దలు వెళ్లాల్సిన సభకు ఎమ్మెల్సీగా వెళ్లి దొడ్డిదారిని మంత్రి పదవి తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలతో టీడీపీ మంత్రులు, నేతల వెన్నులో వణుకుపుడుతోందని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి దంగేటి వీరబాబు కార్పొరేటర్లు మజ్జినూకరత్నం, ఈతకోటి బాపన సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
‘జలజలా’పాతం
హుకుంపేట: హుకుంపేట మండలం మారుమూల తీగలవలస పంచాయతీలో రెండు చోట్ల చాపరాయి జలపాతాలు చూపరులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. డుంబ్రిగూడ చాపరాయి జలపాతం కన్నా, ఈ రెండు జలపాతాలు మరింత అందంగా దర్శనమిస్తున్నాయి. ఈప్రాంతంలో భారీ వర్షాలు కురవనప్పటికీ మారుమూల ఓలుబెడ్డ రోడ్డులో సుమారు 300 మీటర్ల ఎత్తు నుంచి చాపరాయి మీదుగా నీరు పారుతోంది. తీగలవలస సమీపంలో మరో చాపరాయి జలపాతం నీటి ప్రవాహంతో కళకళలాడుతోంది. -
చాపరాయిలో విద్యార్థి గల్లంతు
బాధితునిది విజయనగరం జిల్లా బయటపడిన ఇద్దరు విశాఖ విద్యార్థులు డుంబ్రిగుడ: పర్యాటక కేంద్రమైన చాపరాయి గెడ్డలో మంగళవారం సాయంత్రం విశాఖ నగరం గ్లోబల్ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విజయనగరం జిల్లాకు చెందిన జోషి (22) గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నం డైమండ్ పార్కు సమీపంలోని గ్లోబల్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు పాడేరులో జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చారు. అనంతరం డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలపాతాన్ని తిలకించేందుకు మంగళవారం వచ్చారు. చాపరాయి వద్ద ప్రమాదకరంగా ఉన్న ప్రదేశం వద్ద జలపాతాన్ని తిలకిస్తున్న జోషి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు సహ విద్యార్థులు సంధ్య, బషీర్ గెడ్డలో దూకినా కాపాడలేకపోయారు. ఈ ప్రయత్నంలో సంధ్య కూడా ప్రమాదంలో చిక్కుపోవడంతో స్థానిక గిరిజన యువకులు వారిని రక్షించారు. జోషి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో ఇంతవరకు సుమారు 24 మంది వరకు పర్యాటకులు మరణించారు. జలపాతం వద్ద గట్టి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.