‘జలజలా’పాతం
హుకుంపేట: హుకుంపేట మండలం మారుమూల తీగలవలస పంచాయతీలో రెండు చోట్ల చాపరాయి జలపాతాలు చూపరులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. డుంబ్రిగూడ చాపరాయి జలపాతం కన్నా, ఈ రెండు జలపాతాలు మరింత అందంగా దర్శనమిస్తున్నాయి. ఈప్రాంతంలో భారీ వర్షాలు కురవనప్పటికీ మారుమూల ఓలుబెడ్డ రోడ్డులో సుమారు 300 మీటర్ల ఎత్తు నుంచి చాపరాయి మీదుగా నీరు పారుతోంది. తీగలవలస సమీపంలో మరో చాపరాయి జలపాతం నీటి ప్రవాహంతో కళకళలాడుతోంది.