hukumpeta
-
బంగారు 'మేషువా'.. ‘అల్లూరి’ జిల్లాలో అరుదైన వృక్షాలు
హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో తూర్పు కనుమల్లో పలు చోట్ల ఔషధ గుణాలున్న అరుదైన మేషువా ఫెరే చెట్లు విస్తరించి ఉన్నాయి. ఈ చెట్లను గిరిజనులు ఉప్ప, బంగారం చెట్లుగా పిలుస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బంగారం గరువు అనే చిన్న గ్రామంలో సుమారు 25 ఎకరాల్లో 1,500 చెట్లున్నాయి. ఈ చెట్ల వల్లే అక్కడ ఉన్న గ్రామానికి బంగారం గరువు అని పేరొచ్చింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1,050 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వృక్ష జాతి వైద్య, వాణిజ్య పరంగా చాలా విలువైంది. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య ఇవి చిగురిస్తాయి. ఆసక్తికర విషయమేంటంటే ఈ చెట్లు చిగురించేప్పుడు వాటి ఆకులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ ఆకులు మొదట లేత ఎరుపు రంగు, తర్వాత గోధుమ రంగు, ఆ తర్వాత లేత ఆకుపచ్చ రంగు, చివరిగా పూర్తి ఆకుపచ్చ రంగులోకి మారతాయి. వీటి పువ్వులు తెలుపు రంగులో పెద్దవిగా ఉంటాయి. వీటిని గిరిజన స్త్రీలు అలంకరణ కోసం వినియోగిస్తారు. మంచి సువాసన ఉండటంతో వాణిజ్య పరంగా సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ చెట్లను గిరిజనులు నరకరు ఈ పువ్వులు ఫలదీకరణం చెంది పూర్తి ఫలాలుగా మారేందుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఒక్కో ఫలంలో ఒకటి నుంచి నాలుగు గింజలుంటాయి. ఇవి నూనె స్వభావం కలిగి ఉండటం వల్ల కాల్చినప్పుడు కొద్ది సమయం పాటు వెలుగుతాయి. గతంలో ఈ గింజలను అక్కడి గిరిజనులు వెలుగు కోసం వినియోగించేవారు. వీటి నుంచి తీసిన నూనెను తలకు రాసుకోవడానికి, దీపాలు వెలిగించేందుకు, చర్మ వ్యాధుల నివారణకు వినియోగిస్తారు. ఈ చెట్లు ఉన్న స్థలంలో పూర్వం నుంచి ఓ ఆలయం ఉంది. ఆలయంలో ఉన్న దేవతను గంగమ్మగా కొలుస్తారు. ఆ ప్రాంతంలో జాతర నిర్వహిస్తారు. ఈ స్థలాన్ని అటవీశాఖ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది. ఈ వృక్షాలను నరికేందుకు గిరిజనులు ఇష్టపడరు. అయితే ఏటా గిరిజనులు ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ చెట్లను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.. అత్యంత ఔషధ గుణాలున్న ఉప్ప చెట్లను పరిరక్షించాల్సిన అవసరముంది. ఏటా గిరిజనులు ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి – డాక్టర్ సమరెడ్డి శ్రావణ్‌కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్,ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కృషి దేశంలోనే అరుదైన ఉప్ప చెట్లు ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఈ ప్రాంతం అభివృద్ధికి ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులతో చర్చించాం. సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి పర్యాటక ప్రాంతంబబగా అభివృద్ధి చేస్తాం. – చెట్టి పాల్గుణ, అరకు ఎమ్మెల్యే -
మృత్యువులోనూ వీడని స్నేహం
ఆత్రేయపురం/రాజమహేంద్రవరం రూరల్: బిడ్డలను కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో మంగళవారం సాయంత్రం నలుగురు విద్యార్థులు స్నానం చేస్తుండగా ఇద్దరు గల్లంతైన విషయం విదితమే. బుధవారం పోలీసులు, కుటుంబ సభ్యులు, ఈతగాళ్లతో గాలించడంతో పిచ్చుకలంకకు సుదూర ప్రాంతంలో హుకుంపేట గ్రామానికి చెందిన మెండి జోసఫ్ (బాబి)(15), ఈతకోట చిన్న(15) మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను ఆత్రేయపురం ఎస్సై నరేష్ పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఇరువురి మృతదేహాలు హుకుంపేట చేరుకోవడంతో వారి ఇండ్లతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ఇద్దరూ ప్రాణ స్నేహితులని..ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే వారని, చివరికి మరణంలో కూడా వీరి స్నేహబంధం వీడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురు ఒకే రెడ్ కలర్ టీషర్టులు ధరించి ఉండటం చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబాల ఇంట గూడుకట్టిన విషాదం మెండు జోసఫ్(బాబి) తండ్రి రవికుమార్ నాలుగేళ్ల క్రితం మోరంపూడి సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి కమలకుమారి కూలిపనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. మతిస్థిమితం లేని అక్కను చూసుకుంటుంది. చదువుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న తరుణంలో బాబి మరణించాడు. దీంతో కమలకుమారి తనను అన్యాయం చేసి వెళ్లిపోయావా కొడకా అంటూ గుండెలవిసేలా రోదించింది. ఈతకోట చిన్న తల్లిదండ్రులు రాణి, వెంకన్న కూలిపనులు చేసుకుని ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ వస్తున్నారు. చిన్నకు అక్క,అన్నయ్య ఉన్నారు. ఇంటిలో చిన్నవాడైన చిన్నను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సరాదాగా స్నేహితులతో వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లితండ్రులు రాణి, వెంకన్న తేరుకోలేకపోతున్నారు. -
సినిమాలో వేషం ఇప్పిస్తానని మోసం
సాక్షి, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి): సినిమాలో వేషం ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్ తీసుకువెళ్లి, అలాగే ప్రేమపేరుతో తనను మోసం చేశాడని హుకుంపేట సావిత్రినగర్‌కు చెందిన ఒక యువతి బుధవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం హుకుంపేట సావిత్రీ నగర్‌కు చెందిన ఒక యువతికి బాల కార్తిక్ పరిచయం అయ్యాడు. సినిమాల్లో వేషం ఇప్పిస్తానని చెప్పి ఆమెను 2017లో హైదరాబాద్ తీసుకువెళ్లాడు. అయితే ఎటువంటి వేషాలు ఇప్పించకపోగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. ఈ మేరకు ఆ యువత బుధవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేశాడంటూ.. హుకుంపేట డి బ్లాకుకు చెందిన మహిళకు 2010లో వివాహమైంది. ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరం భర్త చనిపోవడంతో పుట్టింటి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన శివలంక శివశంకర్ తాను ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేశాడంటూ ఆ మహిళ బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీకి ఝలక్
సాక్షి, హుకుంపేట (విశాఖపట్నం): ఏజెన్సీలో తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలింది. హుకుంపేట మండలాధ్యక్షురాలు, టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు తమర్భ సత్యమాధవి శనివారం తన ఎంపీపీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఎంపీపీ పదవికి సంబంధించిన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో ఇమ్మానుయేల్‌కు ఆమె అందజేశారు. అలాగే టీడీపీ జిల్లా నాయకులకు పార్టీకి సంబంధించిన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాలకు ఒరిగిందేమి శూన్యమన్నారు. గిరిజనుల ఆదరణ కోల్పోయిన టీడీపీకి భవిష్యత్ లేదని పేర్కొన్నారు. గిరిజనులంతా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఉన్నారని, ఈ విషయం ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుజువైందన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించి తన ఎంపీపీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ గూటికి సత్యమాధవి ఎంపీపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన తమర్భ సత్యమాధవి తన అనుచరులతో కలిసి అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోనే గిరిజనులకు మంచి జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆమలు చేస్తున్నారన్నారు. బాక్సైట్ తవ్వకాల జీవోలను రద్దు చేసి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్సీపీలో చేరుతున్నానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సత్యమాధవికి ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అలాగే టీడీపీకి చెందిన గత్తుం పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ గత్తుం భీమ్నాయుడు, మాజీ వార్డుమెంబర్లు శోభ రమేష్, గత్తుం లక్ష్మీనాయుడులు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. పదవులకు రాజీనామా చేశాకే చేర్చుకుంటాం: ఎమ్మెల్యే పాల్గుణ సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ, ఇతర పార్టీల నేతలు వైఎస్సార్సీపీలో చేరాలంటే ముందుగా వారు రాజకీయ, పార్టీ పదవులకు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. హుకుంపేట ఎంపీపీగా పనిచేసిన తమర్భ సత్యమాధవి కూడా తన పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు గండేరు చినసత్యం, మండల పార్టీ అధ్యక్షుడు గెమ్మెలి కొండబాబు, మాజీ వైస్ ఎంపీపీ బత్తిరి రవిప్రసాద్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్‌కుమార్, ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రేగం మత్స్యలింగం, సివేరి కొండలరావు, ఎంపీటీసీ మాజీ సభ్యులు కె.బి.సావిత్రి, కంబిడి చిన్నబ్బి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవో ఇమ్మానుయేల్‌కు రాజీనామా పత్రాన్ని అందజేస్తున్న సత్యమాధవి వైఎస్సార్సీపీలో చేరిన ఎంపీపీ సత్యమాధవి, మాజీ సర్పంచ్ భీమ్నాయుడులకు కండువాలు కప్పుతున్న ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ -
గుర్తు తెలియని వ్యక్తి హత్య
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం రాజమహేంద్రవరం రూరల్ : గుర్తుతెలియని ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. హుకుంపేట జాతీయరహదారి వద్ద ఈ మృతదేహాన్ని వదిలి వెళ్లిపోయారు. పోలీసులు కథనం ప్రకారం సోమవారం తెల్లవారుజామున నుంచి హుకుంపేట చెరుకూరి కోల్డ్ స్టోరేజ్ సమీపంలో బొమ్మూరురోడ్డులో జాతీయరహదారి డివైడర్‌పై సుమారు 45ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతదేహం తల డివైడర్‌పై ఉండగా, కాళ్లు రోడ్డుపై ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒS ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు, ఎస్ఐలు కిషోర్‌కుమార్, నాగబాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలేవీ లభ్యం కాలేదు. ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని, అయితే చెవి, ముక్కు, నోటి నుంచి రక్తం కారిందని, కుడికాలు చిటికన వేలుపై గాయం ఉంది. అతనికి సంబంధించి సెల్ఫో¯ŒSగాని, కాళ్లకు చెప్పులు ఏవీలేవు. అయితే ఫ్యాంటు జిప్పు తీసిఉంది. ఏదైన వాహనం ఢీకొట్టి ఉంటే ఒంటిపై తీవ్ర గాయాలు ఉంటాయని, ఎవరో ఇతడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందని బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు తెలిపారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని ఆస్పత్రిలో అర్బ¯ŒS జిల్లా తూర్పు మండల ఇ¯ŒSఛార్జి డీఎస్పీ ప్రసన్నకుమార్ పరిశీలించారు. బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు.. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒS 0883.2434173, 94407 96533 (ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు), 94407 96588 (ఎస్ఐ కిషోర్‌కుమార్)కు తెలియజేయాలని కోరారు. -
పెట్ట కొంచెం.. ప్రేమ ఘనం
‘అమ్మంటే అంతులేని సొమ్మురా..అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా..అమ్మ మనసు అమతమే చూడరా..అమ్మ ఒడిలోనేస్వర్గమే ఉందిరా’ అని ఓ సినీ కవి తల్లిప్రేమను వర్ణించాడు. నిజమే ఈ చిత్రం చూస్తే అలానే అనిపిస్తుంది. దేవుడు ప్రతి చోటా ఉండలేడు కాబట్టే తల్లిని సృష్టించాడంటారు. మానవులతో పాటు,సకాల జీవరాసులకు అమ్మ ఒడిలోనే స్వర్గం చూస్తాయి. గాలివానకు కించుమండ గ్రామంలో ఓ కోడి తన గారాలబిడ్డలను ఇలా రెక్కలచాటున అక్కున చేర్చుకుంది. వాటి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డని చెప్పకనే చెప్పింది. –హుకుంపేట -
‘జలజలా’పాతం
హుకుంపేట: హుకుంపేట మండలం మారుమూల తీగలవలస పంచాయతీలో రెండు చోట్ల చాపరాయి జలపాతాలు చూపరులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. డుంబ్రిగూడ చాపరాయి జలపాతం కన్నా, ఈ రెండు జలపాతాలు మరింత అందంగా దర్శనమిస్తున్నాయి. ఈప్రాంతంలో భారీ వర్షాలు కురవనప్పటికీ మారుమూల ఓలుబెడ్డ రోడ్డులో సుమారు 300 మీటర్ల ఎత్తు నుంచి చాపరాయి మీదుగా నీరు పారుతోంది. తీగలవలస సమీపంలో మరో చాపరాయి జలపాతం నీటి ప్రవాహంతో కళకళలాడుతోంది. -
మన్యంలో నవలోకం!
మన్యంలో ఓ నవలోకం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు విశాఖ ఏజెన్సీ హుకుంపేట, అనంతగిరి మండలాల సరిహద్దులో పాటిపల్లి గ్రామానికి చేరువలో ఉన్నాయి. వీటిని భీమాలమ్మ గుహలుగా ఇక్కడి గిరిజనులు పిలుస్తున్నారు. ఇంతవరకు వారికి మాత్రమే తెలిసిన ఇవి తాజాగా బయటి ప్రపంచం దృష్టికి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న బొర్రా గుహలకన్నా ఇవి పెద్దవని ఆదివాసీలు చెబుతున్నారు. మన్యంలో ఓ నవలోకం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు విశాఖ ఏజెన్సీ హు కుంపేట, అనంతగిరి మండలాల సరిహద్దులో పాటిపల్లి గ్రామానికి చేరువలో ఉన్నాయి. ఈ గుహలను భీమాలమ్మ గుహలుగా ఇక్కడి గిరిజనులు పిలుస్తున్నారు. ఇంతవరకు గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ గుహలు తాజాగా బయటి ప్రపంచం దృష్టికి వచ్చాయి. వీటికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను స్థానికులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న బొర్రా గుహలకన్నా ఈ గుహలు పరిమాణం లో ఎన్నో రెట్లు పెద్దవిగా ఉంటాయని గిరిజనులు చెబుతున్నారు. చీకటి కారణంగా 50 మీటర్ల కు మించి లోపలికి వెళ్లడానికి ఏ ఒక్కరూ ధైర్యంచేయలేకపోతున్నారు. గుహ లోపలి మార్గం వన్యప్రాణులకు ఆవాసంగా మారినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రవేశమార్గంలో 6 మీటర్ల వెడల్పు ఉండగా, లోపలికి వెళ్తున్న కొద్దీ గుహ వెడల్పు పెరుగుతోంది. లోపల మరె న్నో గుహలకు మార్గాలు ఉన్నాయి. పెద్ద లైట్లు, కాగడాలు ఉంటే సగం వరకు వెళ్లే అవకాశం ఉంది. గుహ లోపల భాగమంతా కొంతమేర రాయి అరుణ వర్ణం లో ఉండి ఎంతో ఆకర్షణగా కనిపిస్తోంది. గుహలో వెలుతురు ప్రసరించే ప్రాంతం వరకు ఏడాది పొడవునా స్థానికులు వంటచెరకును భద్రపరచుకుంటారు. ఏటా ఏప్రిల్ నెలలో గుహలో కొలువై ఉన్న భీమాలమ్మకు జాతర నిర్వహిస్తారు. ఈ గుహ లు అటవీ ప్రాంతంలో ఉండటంతో ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియక ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. పర్యాటక శాఖ స్పందించి వీటి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పాటిపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ఇలా వెళ్లాలి... విశాఖ జిల్లా హుకుంపేట నుంచి బాకూరు మీదుగా మత్స్య పురం చేరుకుని అక్కడి నుంచి పాటిపల్లి గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. హుకుంపేట నుంచి దాదాపుగా 25 కిలో మీటర్లు ఉండే ఈ మార్గంలో ద్విచ క్రవాహనాలు, జీపులు వెళ్లేందుకు ఆస్కారం ఉంది. పాటిపల్లి నుంచి కాలినడకన కొండ చివరకు చేరుకుంటే..అబ్బుర పరిచే భీమాలమ్మ గుహల వద్దకు చేరుకోవచ్చు. - హుకుంపేట