గుర్తు తెలియని వ్యక్తి హత్య | unknown person murder | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి హత్య

Published Mon, Jan 2 2017 11:36 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

unknown person murder

  • రోడ్డు ప్రమాదంగా  చిత్రీకరించే ప్రయత్నం
  • రాజమహేంద్రవరం రూరల్‌ : 
    గుర్తుతెలియని ఒక వ్యక్తి  హత్యకు గురయ్యాడు. హుకుంపేట జాతీయరహదారి వద్ద ఈ మృతదేహాన్ని వదిలి వెళ్లిపోయారు. పోలీసులు కథనం ప్రకారం సోమవారం తెల్లవారుజామున నుంచి హుకుంపేట చెరుకూరి కోల్డ్‌ స్టోరేజ్‌ సమీపంలో బొమ్మూరురోడ్డులో జాతీయరహదారి డివైడర్‌పై సుమారు 45ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతదేహం తల డివైడర్‌పై ఉండగా,  కాళ్లు రోడ్డుపై ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒS ఇ¯ŒSస్పెక్టర్‌ కనకారావు, ఎస్‌ఐలు కిషోర్‌కుమార్, నాగబాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలేవీ లభ్యం కాలేదు. ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని, అయితే చెవి, ముక్కు, నోటి నుంచి రక్తం కారిందని, కుడికాలు చిటికన వేలుపై గాయం ఉంది. అతనికి సంబంధించి సెల్‌ఫో¯ŒSగాని, కాళ్లకు చెప్పులు ఏవీలేవు. అయితే ఫ్యాంటు జిప్పు తీసిఉంది. ఏదైన వాహనం ఢీకొట్టి ఉంటే ఒంటిపై తీవ్ర గాయాలు ఉంటాయని, ఎవరో ఇతడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందని బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్‌ కనకారావు తెలిపారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని ఆస్పత్రిలో అర్బ¯ŒS జిల్లా తూర్పు మండల ఇ¯ŒSఛార్జి డీఎస్పీ ప్రసన్నకుమార్‌ పరిశీలించారు. బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్‌ కనకారావు.. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒS 0883.2434173, 94407 96533 (ఇ¯ŒSస్పెక్టర్‌ కనకారావు), 94407 96588 (ఎస్‌ఐ కిషోర్‌కుమార్‌)కు తెలియజేయాలని కోరారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement