
సాక్షి, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి): సినిమాలో వేషం ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్ తీసుకువెళ్లి, అలాగే ప్రేమపేరుతో తనను మోసం చేశాడని హుకుంపేట సావిత్రినగర్‌కు చెందిన ఒక యువతి బుధవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం హుకుంపేట సావిత్రీ నగర్‌కు చెందిన ఒక యువతికి బాల కార్తిక్ పరిచయం అయ్యాడు. సినిమాల్లో వేషం ఇప్పిస్తానని చెప్పి ఆమెను 2017లో హైదరాబాద్ తీసుకువెళ్లాడు. అయితే ఎటువంటి వేషాలు ఇప్పించకపోగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. ఈ మేరకు ఆ యువత బుధవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అత్యాచారం చేశాడంటూ..
హుకుంపేట డి బ్లాకుకు చెందిన మహిళకు 2010లో వివాహమైంది. ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరం భర్త చనిపోవడంతో పుట్టింటి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన శివలంక శివశంకర్ తాను ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేశాడంటూ ఆ మహిళ బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment