తూర్పు గోదావరి, సాక్షి: తిరుపతి తొక్కసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాకాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘తిరుపతి ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దారుణం..అత్యంత బాధాకరమైన విషయం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస వసతులు కూడా అందించకుండా అలా ఎందుకు బంధించినట్లు?. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారు?. ఇక్కడ టీటీడీ ఈవో, చైర్మన్‌ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. టీటీడీ దేవస్థానమో(TTD Board) లేదంటే రాజకీయ పార్టీ కార్యాలయమో అర్థం కావడం లేదు.
చంద్రబాబు(Chandrababu)కు సంబంధించిన అనే కార్యక్రమాల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాలు 29 మంది ప్రాణాలు కోల్పోయారు . క్రౌడ్ మేనేజ్మెంట్ చంద్రబాబు జమానాలో సాధ్యం కాదా?. అదే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.
తిరుపతి(Tirupati) మరణాలకు బాధ్యత ఎవరిది?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ బాధ్యత టీటీడీకి వదిలేశారు. అయితే క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించటం దారుణం. అసలు 1,20,000 టోకెన్లు జారీ చేయాలని భావిస్తే ఆన్లైన్లో ఎందుకు చేయలేదు. చిన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదు ఇది మొత్తం వ్యవహారానికి టిటిడి బోర్డు బాధ్యత తీసుకొని పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వం బోర్డును రద్దు చేయాలి.
ఇది హిట్లర్ నియంత పాలన కాదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం చంద్రబాబు గుర్తించాలి. తిరుపతి ఘటనను చీకటి రోజుగా కింద భావించాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి అని మార్గాని భరత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment