TTD Board
-
రూ.5,258.68 కోట్లతో టీటీడీ బడ్జెట్
తిరుమల: వచ్చే 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరించినట్లు చెప్పారు. శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల సంరక్షణ, సది్వనియోగం ప్రధాన లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడతామన్నారు. స్వామివారి ఆస్తులపై కోర్టు కేసుల్లో విచారణ వేగంగా పూర్తయి సద్వినియోగంలోకి తెచ్చేందుకు చూస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం, భూ కేటాయింపులను అనుసరించి కార్యాచరణ వేగిరం చేస్తామని వివరించారు.సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం తర్వాత ఈవో జె.శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 2024–25లో 5,179.85 కోట్ల బడ్జెట్ అంచనా కాగా.. ఈసారి రూ.78.83 కోట్లు పెరిగాయి. బ్యాంకు డిపాజిట్లు, బంగారం ద్వారా రూ.1,253 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ.. వచ్చే ఏడాది మరో రూ.57 కోట్లు పెరిగి రూ.1,310 కోట్లు వస్తాయని పేర్కొంది.శ్రీవారి హుండీ ద్వారా రూ.1,729 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.1,671 కోట్లుగా ఉంది. ఇందులో ఉద్యోగులు, పొరుగు ఉద్యోగులు, ఒప్పంద సేవ సిబ్బంది జీతాలకు రూ.1,773.75 కోట్లు వెచ్చిచనున్నారు. పరికరాల కొనుగోలుకు రూ.768 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ.350 కోట్లుగా అంచనా వేశారు. కార్పస్, ఇతర పెట్టుబడులకు రూ.800 కోట్లు వ్యయం చేయనున్నారు. ముఖ్యాంశాలు ఇలా.. ⇒ హిందూ ధర్మప్రచారానికి రూ.121.50 కోట్లు. ⇒ తెల్లవారుజామున 5.30కు శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పునకు పరిశీలన. ⇒ ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్కు భూ కేటాయింపుల రద్దు. కొత్త ఆగమ సలహామండలి ఏర్పాటుకు ఆమోదం.⇒ సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలిపింది.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. -
TTD: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం
-
చంద్రబాబు సీఎంగా ఉంటే అంతే.. టీటీడీ బోర్డు రద్దుకు మార్గాని భరత్ డిమాండ్
తూర్పు గోదావరి, సాక్షి: తిరుపతి తొక్కసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాకాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘తిరుపతి ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దారుణం..అత్యంత బాధాకరమైన విషయం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస వసతులు కూడా అందించకుండా అలా ఎందుకు బంధించినట్లు?. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారు?. ఇక్కడ టీటీడీ ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. టీటీడీ దేవస్థానమో(TTD Board) లేదంటే రాజకీయ పార్టీ కార్యాలయమో అర్థం కావడం లేదు.చంద్రబాబు(Chandrababu)కు సంబంధించిన అనే కార్యక్రమాల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాలు 29 మంది ప్రాణాలు కోల్పోయారు . క్రౌడ్ మేనేజ్మెంట్ చంద్రబాబు జమానాలో సాధ్యం కాదా?. అదే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.తిరుపతి(Tirupati) మరణాలకు బాధ్యత ఎవరిది?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ బాధ్యత టీటీడీకి వదిలేశారు. అయితే క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించటం దారుణం. అసలు 1,20,000 టోకెన్లు జారీ చేయాలని భావిస్తే ఆన్లైన్లో ఎందుకు చేయలేదు. చిన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదు ఇది మొత్తం వ్యవహారానికి టిటిడి బోర్డు బాధ్యత తీసుకొని పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వం బోర్డును రద్దు చేయాలి. ఇది హిట్లర్ నియంత పాలన కాదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం చంద్రబాబు గుర్తించాలి. తిరుపతి ఘటనను చీకటి రోజుగా కింద భావించాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి అని మార్గాని భరత్ అన్నారు. -
టీటీడీ బోర్డుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
-
ఓపక్క తీవ్ర అభ్యంతరాలు.. TTD పాలకమండలిలో మరొకరికి చోటు
అమరావతి, సాక్షి: ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈలోపే పాలకమండలి బోర్డులో మరొకరికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. బీజేపీ నుంచి భాను ప్రకాష్ రెడ్డి 25వ సభ్యుడిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.టీటీడీ కొత్త బోర్డుపై మునుపెన్నడూ లేనంతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు, ఆరోపణలు, వివాదాల్లో నిలిచినవాళ్లకే బోర్డులో చోటు కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ కోసం సభ్యులను 24 నుంచి 25కి పెంచారు. ఈ మేరకు బీఆర్ నాయుడు చైర్మన్గా.. టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది.అసలే టీటీడీ బోర్డులో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదన్న బలమైన విమర్శ వినిపిస్తోంది. ఇది చాలదన్నట్లు నేర చరితులను టీటీడీ సభ్యులుగా నియమించింది బాబు సర్కారు. అత్యధికంగా కేసులు ఉన్న టీడీపీ నేతలు మల్లెల రాజశేఖర్, ఎం ఎస్ రాజు, జ్యోతుల నెహ్రూలకు సభ్యులుగా నియమించడంపైనా దుమారం చెలరేగింది. మల్లెల రాజశేఖర్పై రౌడీషీట్తో పాటు కల్తీ మద్యం కేసు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. ఇక.. ఎంఎస్ రాజుపై ఏకంగా 23 క్రిమినల్ కేసులు ఉండటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.ఇదీ చదవండి: శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తా: బీఆర్ నాయుడు