
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో అధికార పార్టీ నేతలు అరాచకానికి తెరతీశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆలయం ప్రారంభించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అనపర్తి కొత్తూరులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.20 లక్షల వ్యయంతో ఆలయం నిర్మించారు.

విగ్రహ ప్రతిష్ట ఇవాళ జరగాల్సి ఉండగా, నోటీసులు అందచేసిన అధికారులు విగ్రహ ప్రతిష్ట నిలుపుదల చేయించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఆహ్వానం లేకపోవడం వల్లే ఆలయాన్ని ప్రారంభించనివ్వడం లేదని స్థానికులు అంటున్నారు. ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తూరు వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. 144 సెక్షన్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment