idol
-
ఆ ఘటన వెనుక ఉగ్రకోణం.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం వెనుక ఉగ్ర కోణం ఉందంటూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. వెలుగులోకి వస్తున్న వాస్తవాలు, నిషిద్ధిత ఉగ్రవాద సంస్థ ఐ సీస్, ఇస్లామిక్ స్టేట్ (ఖురాసాన్ ప్రావిన్స్) అంతర్జాలం ద్వారా భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆగష్టు 17న కేంద్ర గృహ మంత్రిత్వ శాఖకు ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఫిర్యాదు చేశారు. మారేడుపల్లి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ వేశారు.సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం ఘటనం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. గత సోమవారం తెల్లవారు జామున ఆలయం వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని యువకుడు గుడి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లాడు. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అనంతరం ఆలయం పైకి ఎక్కి అక్కడ ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసేందుకు యత్నించాడు.దీనిని గుర్తించిన ఓ వ్యక్తి అతడిని పట్టుకున్నాడు. అంతలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. -
దుర్గాదేవి విగ్రహాల తయారీలో 'పుణ్యమట్టి' కథేంటో తెలుసా..!
బొజ్జ గణపయ్య నవరాత్రులు పూర్తైన వెంటనే దసరా సందడి, హడవిడి మొదలైపోతుంది. ఇక శిల్పులంతా దుర్గాదేవి విగ్రహాల తయారీలో తలమునకలై ఉంటారు. అయితే ఈ దుర్గమ్మ విగ్రహాల తయారీలో ఓ ప్రత్యేకత ఉంది. అది అనాదిగా వస్తున్న సంప్రదాయమని చెబుతున్నారు శిల్పకారులు. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వింత చూసి ఎంతైన 'అమ్మ' కదా ఏ బిడ్డను చులకనగా వదిలేయదు కదా..అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా ప్రత్యకత అంటే..దుర్గమ్మ విగ్రహాలు తయారు చేయాడానికి నాలుగు విషయాలు అత్యంత కీలకం. తయారీకి శిల్పులు గంగానది ఒడ్డును ఉన్న మట్టి, గోవు పేడ, గో మూత్రం, ఇంకా వేశ్యల ఇంటిలోని మట్టిని ఉపయోగిస్తారు. ఈ మట్టిని ” నిషిద్ధో పల్లిస్ ” అని పిలుస్తారు. ఇందులో ఏది లేకపోయినా విగ్రహం అసంపూర్ణమని వారు భావిస్తారట. అంతేగాదు అందుకోసం ప్రతి శిల్పకారుడు వేశ్య గృహాలకు వెళ్లి వారి ప్రాంగణంలో మట్టి కావాలని అభ్యర్థిస్తారట. తమకు మట్టి లభించేవరకు వాళ్లని ప్రాధేయపతారు. అంతేగాదు దసరా సీజన్ రాగానే వారిని గౌరవంగా, చిరునవ్వుతో పలకరించి మరీ మట్టిని తీసుకునే ప్రయత్నం చేస్తారట శిల్పకారులు. ఈ ఆచారాన్ని బెంగాలీ శిల్పకారులు ఇప్పటికీ పాటిస్తుండటం విశేషం. ఎందుకు ఇలానే అనేందుకు స్పష్టమైన వివరణ లేదు. కానీ కొన్ని కథానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ కారణం ఏంటంటే..దుర్గాదేవి మహిషాసురిడితో తలపడుతున్న సమయంలో ఆమెను తాకే ప్రయత్నం చేశాడట. దీంతో ఆమె కోపంతో తన పరాక్రమాన్ని అంతా ఉపయోగించి ఆ రాక్షసుడిని అంతం చేసిందట. అందుకే ఆ సంప్రదాయమని పండితుల వచనం. మరొక కథనం ప్రకారం..నారీ శక్తికి సూచన దుర్గమ్మ. సమాజంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని తీసుకువచ్చారని చెబుతుంటారు. అంతేగాదు ఇలా వేశ్య ఇంటిలోని మట్టితో దుర్గామాత విగ్రహం తయారు చేస్తే అందులోకి అమ్మవారి కళ వచ్చి శోభాయమానంగా కనిపిస్తుందట. మన పెద్దలు ఈ సంప్రదాయం ఎందుకని పెట్టారో స్పష్టంగా తెలియకపోయినా.. దేవుడి దృష్టిలో అందరూ సమానమే..ఎవ్వరిని కించపరచకూడదు, హేయభావంతో చూడకూడదు అనే చక్కని సందేశాన్ని ఇస్తోంది ఈ ఆచారం..!(చదవండి: Dussehra 2024 సంబరాల దసరా: ఇంత తతంగం ఉంటుంది!) -
గణేష్ విగ్రహ నిమజ్జనంలో గలాటా
లక్నో: యూపీలోని మహోబాలో గణేష్ విగ్రహం నిమజ్జనం సందర్భంగా గలాటా జరిగింది. ఒక ఇంటిపై బాణసంచా పడటంతో రెండు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. అది తోపులాటకు దారితీసింది. చూస్తుండగానే అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కసౌరాటోరి ప్రాంతంలో గణేష్ నిమజ్జనం కోసం రెండు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరాయి. ఇంతలో ఒక వర్గంవారు వెలిగించిన బాణసంచా మరోవర్గం ఇంటిపై పడడంతో వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాలకు చెందినవారు బకెట్లతో దాడి చేసుకోవడంతోపాటు, రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడివారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఇరువర్గాలవారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనంలో భక్తులపై రాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇరువర్గాలను అతి కష్టంమీద శాంతింపజేసి, నిమజ్జనం సవ్యంగా జరిగేలా చూశారు. ఇది కూడా చదవండి: గణేశ్ లడ్డూల తయారీలో జడేజా భార్య -
జుకర్ బర్గ్... ప్రేమ మార్క్
షాజహాన్‌కు భార్య పై ఉన్న ప్రేమ పాలరాతి తాజ్‌మహల్‌లో ప్రతిఫలించింది. మెటా బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ విషయానికి వస్తే... భార్యపై ఆయనకున్న ప్రేమ ఇంటి పెరట్లోని సుందరమైన నీలిరంగు విగ్రహంలో ప్రతిఫలిస్తోంది. రొమాంటిక్ హావభావాలతో కూడిన భార్య ప్రిస్కిల్లా చాన్ భారీ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ఏర్పాటు చేశాడు జుకర్ బర్గ్. ఆ విగ్రహం పక్కన నిలబడి ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ విగ్రహం చిత్రాలు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాయి...ఫేస్బుక్ విజయం గురించి చెప్పుకోవడం కంటే తన ప్రేమ విజయం గురించి చెప్పుకోవడం అంటేనే మార్క్ జుకర్ బర్గ్‌కు ఇష్టం. ప్రిస్కిల్లా చాన్‌తో ఎలా పరిచయం అయింది, ఆ పరిచయం ఎలా ప్రేమగా మారింది కథలు కథలుగా చెబుతుంటాడు. అవి ఎప్పుడో జరిగినట్లుగా ఉండవు. నిన్నా మొన్న జరిగినట్లుగానే ఉంటాయి. అది అతడి మాటల చాతుర్యం కాదు. ప్రేమలోని మాధుర్యం!19 మే, 2012 అనేది జుకర్ బర్గ్, చాన్లకు మరచిపోలేని సుదినం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఈ ఔట్‌డోర్ వెడ్డింగ్లోని విశేషం ఏమిటంటే... పెళ్లి నాటి ప్రమాణాలను కాగితాల రూపంలో ఇరువురు ఇచ్చిపుచ్చుకున్నారు.జుకర్‌బర్గ్ చాన్‌కు ఇచ్చిన పేపర్లో ఇలా రాసి ఉంది.... ‘ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో... ఎప్పుడూ ఇలాగే’ అదృష్టవశాత్తు ఆ సంతోషం ఇప్పటివరకు వారికి దూరం కాలేదు. ‘మార్క్ అప్పుడు ఎంత ప్రేమతో ఉన్నాడో ఇప్పుడూ అంతే. అప్పుడు ఎలా నవ్వించేవాడో ఇప్పుడూ అంతే’ అంటూ భర్త గురించి మురిపెంగా చెబుతుంటుంది ప్రిస్కిల్లా చాన్.ఏడు అడుగుల సిల్వర్ అండ్ బ్లూ ప్రిస్కిల్లా చాన్ విగ్రహం వారి బలమైన ప్రేమ బంధానికి ప్రతీకలా కనిపిస్తోంది. ప్రవహిస్తున్నట్లుగా కనిపించే వెండి వస్త్రం విగ్రహాన్ని మరింత ఆకర్షణీయం చేసింది. ఈ విగ్రహం కోసం న్యూయార్క్‌కు చెందిన ఆర్టిస్ట్, అర్కిటెక్చర్, శిల్పి డేనియల్ ఆర్షమ్ను సంప్రదించాడు మార్క్. విగ్రహం ఎలా ఉండాలి? అనే దాని గురించి ఇద్దరి మధ్య ఎన్నోరోజుల పాటు చర్చలు జరిగాయి.చాన్ విగ్రహం పుణ్యమా అని ‘ఎవరీ డేనియల్’ అనే శోధన మొదలైంది. ఈ డేనియల్‌కు ‘ఇన్స్టాగ్రామ్ శిల్పి’ అని పేరు. డ్యాన్స్, డిజైన్, అర్కిటెక్చర్, ఆర్ట్‌ను మిక్స్ చేసిన కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో పెద్ద ప్రాజెక్ట్‌లకు పని చేశాడు. ‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు జుకర్ బర్గ్.టీ సేవిస్తూ తన విగ్రహం దగ్గర ఫొటో దిగిన ప్రిస్కిల్లా చాన్ ఆ ఆర్ట్‌వర్క్‌ను ‘అద్భుతం’ అని ప్రశంసించింది.ఏడు అడుగుల ప్రిస్కిల్లా చాన్ విగ్రహంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. భార్యపై మార్క్ జుకర్‌బర్గ్‌కు ఉన్న ప్రేమను ఎంతోమంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీలిరంగులో ఉన్నందుకు కావచ్చు... కొందరు మాత్రం ఈ విగ్రహాన్ని అవతార్ క్యారెక్టర్లతో పోలుస్తూ జోక్‌లు పేలుస్తున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా... ప్రిస్కిల్లా చాన్ విగ్రహం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.కన్నీళ్లు తుడిచే విగ్రహం‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని జుకర్ బర్గ్ అంటున్నాడుగానీ మన వాళ్లు ఆ పని ఎప్పుడో చేశారు. చేస్తున్నారు! కోల్‌కత్తాకు చెందిన 65 సంవత్సరాల తాపస్ అనే రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి 2.5 లక్షలు ఖర్చు చేసి తన భార్య ఇంద్రాణి సిలికాన్ స్టాచ్యూను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. జీవకళ ఉట్టిపడే ఈ విగ్రహంతో తాపస్ ఎన్నోసార్లు మాట్లాడుతుంటాడు. తన భార్య చనిపోలేదని, విగ్రహం రూపంలో ఇంట్లోనే ఉంది అనుకొని దుఃఖానికి దూరం అయ్యాడు. తాపస్లాంటి భర్తల కథలు మన దేశ నలుమూలలా ఉన్నాయి. -
మరో బాలరాముని విగ్రహాన్ని తయారుచేసిన యోగిరాజ్
ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ బాలరాముని చిన్న నమూనా విగ్రహాన్ని తయారు చేశారు. ఈయన గతంలో అయోధ్య రామాలయానికి రామ్‌లల్లా విగ్రహాన్ని తయారు చేశారు. యోగిరాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్లో బాలరాముని చిన్న నమూనా రూపానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. యోగిరాజ్ ట్విట్టర్లో తాను రాతితో రామ్‌లల్లా చిన్న విగ్రహాన్ని తయారు చేశానని తెలిపారు. వెండి సుత్తితో, బంగారు ఉలితో రామ్‌లల్లా కళ్లను చెక్కానని పేర్కొన్నారు. ఈ భూమిపై తాను ఎంతో అదృష్టవంతుడినని, తన పూర్వీకుల ఆశీస్సులు, శ్రీరాముని ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. అరుణ్ యోగిరాజ్ 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా గేట్ వద్ద 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా యోగిరాజ్ రూపొందించారు. అలాగే కేదార్‌నాథ్‌లోని 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, మైసూర్ జిల్లాలోని చుంచన్కట్టేలో 21 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను యోగిరాజ్ తీర్చిదిద్దారు. -
బాలరాముని చిత్రపటాలకు ఆదరణ.. కోట్లలో వ్యాపారం!
అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు ఆ ప్రాంతపు తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అయోధ్య ఆర్థిక వ్యవస్థ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. అయోధ్యకు ప్రతిరోజూ రెండు నుండి మూడు లక్షల మంది రామభక్తులు తరలివస్తున్నారు. అయోధ్యకు వస్తున్నవారంతా ఎంతో ఉత్సాహంతో శ్రీరామునికి సంబంధించిన వస్తువులను కొనుగులు చేస్తున్నారు. రామాలయంలో దర్శనం ముగించుకున్నాక భక్తులు శ్రీరాముని చిత్రపటాలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య మార్కెట్లో చిన్న సైజు శ్రీరాముని చిత్రపటం నుంచి పెద్ద సైజు చిత్రపటం వరకూ అన్నీ విరివిగా అమ్ముడవుతున్నాయి. అలాగే రామాలయం నమూనా చిత్రం, కీ చైన్, స్టిక్కర్, మాగ్నెట్ స్టాండ్, లాకెట్, బాలరాముని చిత్రాన్ని ముద్రించిన జెండాతో సహా 20 నుండి 30 రకాల వస్తువులను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. అయోధ్యకు చెందిన వ్యాపారి అశ్వనీ గుప్తా మాట్లాడుతూ, రాముని చిత్రాలను భక్తులు ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇది తమ వ్యాపారస్థాయిని విపరీతంగా పెంచుతున్నదన్నారు. ఫలితంగా చాలామందికి ఉపాధి కూడా లభిస్తున్నదన్నారు. అయోధ్యలో భక్తుల రద్దీ పెరగడంతో ఇక్కడి వ్యాపారాలు కూడా బాగా సాగుతున్నాయి. ముఖ్యంగా బాలరాముని చిత్రాలకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కోట్ల రూపాయల మేరకు బాలరాముని చిత్రాల వ్యాపారం సాగుతోంది. -
‘కృష్ణ’లో బాలరాముని పోలిన శ్రీమహావిష్ణువు!
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో కృష్ణా నదిలో శ్రీమహావిష్ణువు పురాతన విగ్రహం బయల్పడింది. విగ్రహం చుట్టూ దశావతారాలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయల్పడింది. అయితే నదిలో బయట్పడిన ఈ శ్రీమహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలివుండటం గమనార్హం. ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహం గురించి రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్ మాట్లాడుతూ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఈ విష్ణువు విగ్రహం చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి తదితర దశావతారాలు అందంగా మలిచారు. ఈ శ్రీమహా విష్ణువు విగ్రహ విశిష్టతల విషయానికొస్తే విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. అతని పైరెండు చేతులలో శంఖుచక్రాలు ఉండగా, దిగువ చేతులు (‘కటి హస్త’, ‘వరద హస్త’) ఆశీర్వాదాలను అందిస్తున్నట్లు ఉన్నాయి. ఈ విగ్రహం వేంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరుడుడు లేడు. సాధారణంగా శ్రీమహా విష్ణువు విగ్రహాలలో గరుడుడు కనిపిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఈ మందహాసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూమాలలు కూడా కనిపిస్తాయి. -
రామ్‌లల్లా శిల్పికి శ్రీకృష్ణ విగ్రహం ఆర్డర్!
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహానికి రూపాన్ని ఇచ్చిన కళాకారుడు యోగిరాజ్ ఇప్పుడు కురుక్షేత్రలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారుచేసేందుకు సిద్ధం అవుతున్నారు. మహాభారత సమయంలో అర్జునునితో సంభాషిస్తున్న శ్రీ కృష్ణుని భారీ రూపాన్ని యోగిరాజ్ తీర్చిదిద్దనున్నారు. శ్రీరాముని విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని కూడా నేపాల్‌లోని గండకీ నది నుంచి సేకరించిన శాలిగ్రామశిలతో తయారు చేయనున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలో గల బ్రహ్మసరోవర్ ఒడ్డున నిర్మితమవుతున్న 18 అంతస్తుల జ్ఞాన మందిరంలోని గర్భగుడిలో యోగిరాజ్ రూపొందించే శ్రీ కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మూడు ఎకరాల స్థలంలో 18 అంతస్తుల జ్ఞాన మందిరాన్ని నిర్మిస్తున్నట్లు శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ట్రస్ట్ జ్ఞాన మందిర్ వ్యవస్థాపకులు స్వామి చిరంజీవ్పురి మహారాజ్ తెలిపారు. ఆలయ గర్భగుడిలో అర్జునునికి సందేశం ఇస్తున్న రీతిలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఇందుకోసం శిల్పి అరుణ్ యోగిరాజ్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయి. త్వరలోనే శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్.. శ్రీకృష్ణుని విగ్రహ తయారీకి అంగీకరించిన నేపధ్యంలో గండకీ నది నుంచి ప్రత్యేక శాలిగ్రామ రాయిని తీసుకురావడానికి ట్రస్ట్ నేపాల్‌ను సంప్రదిస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం నిర్మాణ దశలో ఉంది. 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. 18 అంతస్తుల జ్ఞాన మందిరం అనేక ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. గీతలోని 18 అధ్యాయాలు, 18 అక్షోహిణి సేన, 18 రోజుల మహాభారత యుద్ధం, కురుక్షేత్రంలో పవిత్ర సరస్వతి నది రూపం కూడా ఈ ఆలయంలో కనిపించనుంది. -
తొలుత ఎంపిక చేసిన విగ్రహం ఇదే..
పుణ్యక్షేత్రమైన అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. రామ మందిరంలో కొలువైన బాలరాముడు భక్తులను మైమరపిస్తున్నాడు. రామ్‌లల్లా విగ్రహంలోని కళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గర్భాలయంలో ప్రతిష్ఠంచేందుకు విగ్రహాల తయారీని తొలుత ముగ్గురు శిల్పకారులకు అప్పగించారు. తరువాత ఆలయంలో ప్రతిష్ఠాపనకు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. అయితే చివరకు మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ నివాసి సత్యనారాయణ పాండే శిల్ప కళాకారునిగా ఎంతో పేరొందారు. తరతరాలుగా వారి కుటుంబం విగ్రహాలను తయారు చేస్తోంది. సత్యనారాయణ పాండే రామ్‌లల్లా విగ్రహాన్ని తెల్లని మక్రానా పాలరాయితో తీర్చిదిద్దారు. తొలుత ఈ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని ట్రస్ట్ భావించిందట. ఈ విగ్రహం ప్రస్తుతం ట్రస్ట్ ఆధీనంలో ఉంది. దీనిని ఎక్కడ? ఎప్పుడు ప్రతిష్ఠించేదీ ట్రస్ట్ త్వరలో వెల్లడించనుంది. జనవరి 22న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం రామమందిరం తలుపులు సామాన్య భక్తుల కోసం తెరిచారు. ఈ నేపధ్యంలో శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. -
అయోధ్య గర్భగుడిలో బాలరాముడి విగ్రహం
-
అయోధ్య రాముడి విగ్రహం రెడీ ఎలా ఉండబోతుందంటే..!
-
అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాల రాముడి విగ్రహం
-
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీఓ పార్కులో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ కోసం విజయవాడలో ఉన్న కమల్‌హాసన్.. కృష్ణ–మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆహ్వానం మేరకు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు కమల్‌హాసన్ . ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ–‘‘కళామతల్లికి తనదైన శైలిలో సేవలందించి, ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణగారు. తండ్రి గౌరవాన్ని మహేశ్‌బాబుగారు నిలబెడుతున్నారు’’ అన్నారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణ కేవలం పదిరోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని కృష్ణ అభిమానుల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కృష్ణ కుటుంబ సభ్యుడు ఘట్టమనేని బాబీ, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా పద్మావతి, రాజ్‌కమల్ పాల్గొన్నారు. గర్వంగా ఉంది: హీరో మహేశ్‌బాబు ‘‘నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ గారికి కృతజ్ఞతలు. నాన్నగారు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి. నాన్న విగ్రహం ఏర్పాటుకు కారణమైన అందరికీ, ఈ వేడుక ఘనంగా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు. -
వినాయకచవితి స్పెషల్.. బన్నీ కూతురు ఏం చేసిందో తెలుసా?
వినాయకచవితి వచ్చిందంటే చాలు ఏ గల్లీలో చూసిన సందడే సందడి. ముఖ్యంగా చిన్నపిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. ఎలాగైనా సరే గణపతి తయారు చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టితో చాలా సరదాగా వినాయక విగ్రహాన్ని తయారు చేయడం మనం చూస్తుంటాం. అలా ఐకాన్ స్టార్ గారాల పట్టి అల్లు అర్హ వినాయకచవితి కోసం బుజ్జి వినాయకుడిని తయారు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ! ) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్లో తెలియని వారుండరు. కాగా.. అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో అల్లు అర్హ నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీ చిన్ననాటి పాత్రలో అర్హ నటించనుందని సమాచారం. ఇప్పటికైతే మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
బుర్రిపాలెంలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
తెనాలిరూరల్: ప్రముఖ సినీహీరో ‘సూపర్‌స్టార్’ ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో శనివారం ఆవిష్కరించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, అల్లుడు సుధీర్‌బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు పాల్గొని సూపర్‌స్టార్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ అని కొనియాడారు. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కృష్ణ తమ స్వగ్రామం బుర్రిపాలెంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, వాటిని తాము కొనసాగిస్తామని చెప్పారు. కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల మాట్లాడుతూ ‘బుర్రిపాలెం బుల్లోడు’గా కోట్లాది మంది ప్రేమను తమ తండ్రి పొందారని, అభిమానులతో కలసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రేయరాగ రాక్‌స్టార్
ఎక్కడి ఒడిశా? ఎక్కడి కొరియా? అయితే కలలు కనేవారికి దూరభారాలు ఉండవు. పట్టుదలతో దూరాలను కరిగించేస్తారు. కలలను నిజం చేసుకుంటారు. ఒడిశాలోని రూర్కెలాకు చెందిన శ్రేయా లెంక ఈ కోవకు చెందిన ప్రతిభాశాలి.... ఇండియా ఫస్ట్ కె–పాప్ ఐడల్‌గా శ్రేయా లెంక చరిత్ర సృష్టించింది. పన్నెండు సంవత్సరాల వయసులో డ్యాన్సర్‌గా శ్రేయ కళాప్రస్థానం మొదలైంది. ఎప్పుడూ పెద్ద కలలే కనేది. ఒక ఫ్రెండ్ ద్వారా శ్రేయకు ‘కె–పాప్’ పరిచయం అయింది. వారి మ్యూజిక్ వీడియోలు తనను బాగా ఆకట్టుకున్నాయి. ‘వీళ్లు ఆర్టిస్టులా? మెరుపు తీగలా?’ అనిపించింది. వారి యూనిక్ స్టైల్, సింగింగ్, డ్యాన్సింగ్ తనకు తెగ నచ్చేశాయి. ఏదో ఒకరోజు వారిలో కలిసి, వారిలో ఒకరిగా కలిసి పనిచేయాలనుకుంది. ‘అది అసాధ్యం’ అని ఎవరు అన్నా సరే శ్రేయ వెనక్కి తగ్గలేదు. ఆమె కల నెరవేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ప్రపంచంలోని వందలాది మందితో పోటీ పడి గెలిచింది. ‘కె–పాప్’ మెంబర్‌గా తన కలను నెరవేర్చుకుంది. దేశం కాని దేశం... సౌత్ కొరియాలోకి అడుగు పెట్టినప్పుడు శ్రేయా లెంకాకు అక్కడి ఆహారం, జీవనవిధానం, భాష...అన్నీ కొత్తగా అనిపించాయి. తాను ఇల్లు విడిచి అంత దూరం వెళ్లడం అదే తొలిసారి. కొత్త విషయాలను ఉత్సాహంగా నేర్చుకుంది. కొత్త జీవనవిధానానికి ఆనందంగా అలవాటు పడింది. చుట్టు పక్కల వాళ్లు కూడా ఎంతో ప్రోత్సాహకంగా ఉండేవాళ్లు. ఇండియాలో అయితే రాత్రి పదిలోపు భోజనం చేసేది. కొరియాలో మాత్రం సాయంత్రం 6–7 మధ్య భోజనం చేస్తారు. మొదట్లో కష్టం అనిపించినా ఆ పద్ధతికి మెల్లగా అలవాటు పడింది. తనలాగే ‘కె–పాప్ ఐడల్’ కావాలనుకునే ఔత్సాహికులకు శ్రేయా లెంకా ఇచ్చే సలహా... ‘మీ కలలను నెరవేర్చుకోవడం విషయంలో రాజీ పడవద్దు. వందసార్లు అపజయం పాలైనా సరే, ఆవగింజంత ఆత్మవిశ్వాసం కూడా కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లు తప్పకుండా ఒకరోజు గెలుస్తారు’ -
శ్రీ కృష్ణుడి రూప ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు నో!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలోని లకారం చెరువులో శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. గతంలో ఇచ్చిన స్టేను పొడిగిస్తూ తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ విగ్రహావిష్కరణను ఈ నెల 28న నిర్వహించాలని ఇప్పటికే ఖరారు చేశారు. తానా ఈ విగ్రహాన్ని అందిస్తోంది. అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళా పీఠం, బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ పిటిషన్లు దాఖలు చేశాయి. (చదవండి: ఔటర్ రింగ్‌రోడ్డు లీజుపై విపక్షాల విషం) -
ఆఫీసులో లాడెన్ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..
ఉత్తర ప్రదేశ్‌లోని ఒక వ్యక్తి తన కార్యాలయంలో ఉగ్రవాది ఒసామా డిన్ లాడెన్ పోస్టర్లు ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(యూపీపీసీఎల్) రవీంద్ర ప్రకాష్ గౌతమ్ అనే సబ్ డివిజనల్ అధికారి తన కార్యాలయంలో ఒసామాబిన్ లాడెన్ పోస్టర్లను ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యూపీపీసీఎల్ చైర్మన్ ఎం దేవరాజ్ సీరియస్ అవ్వడమే గాక సదరు అధికారి గౌతమ్‌ని విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన 2022 జూన్‌లో ఫరుఖాబాద్ జిల్లాలోని కయామ్ గంజ్ సబ్‌డివిజన్ 2కి పోస్టింగ్ పై వచ్చాడు. అప్పుడే ఈ పోస్టర్లు ఉంచినట్లు సమాచారం. ఐతే విచారణలో.. గౌతమ్ లాడెన్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినందువల్లే అతన్ని ఆరాధ్య దైవంగా పూజించేవాడని సహోద్యోగులు చెబుతున్నారు. అతనిపై అభిమానంతో లాడెన్ ఫోటోలు కార్యాలయంలో ఉంచేవాడని చెప్పారు. దీంతో అతన్ని సర్వస్ నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..) -
అమ్మకు గుడి
ముషీరాబాద్: అమ్మంటే ప్రత్యక్ష దైవంగా భావించారు. కన్నతల్లి కన్నుమూసి ఏడేళ్లయిపోయింది. ఇన్నాళ్లు గుండెల్లో కొలువైన అమ్మకు ఇంట్లోనే గుడి కట్టారు. అమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని.. కళ్లముందు విగ్రహ రూపంలో కని పిస్తుండాలని.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టారు ముషీరాబాద్ గంగపుత్ర కాలనీకి చెందిన బాదం గణేష్, శ్రీనివాస్, వేణు, శివప్రసాద్‌లు. అమ్మ విగ్రహ ఆవిష్కరణోత్సవానికి బంధుమిత్రులను ఆహ్వానించారు. పండుగలా కార్యక్రమం నిర్వహించి అతిథ్యం ఇచ్చి తల్లిపై ప్రేమను చాటుకున్నారు. గణేష్, శ్రీనివాస్, వేణు, శివప్రసాద్‌ల తల్లి బాదం వెంకటసూర్యకుమారి ఏడేళ్ల క్రితం మరణించా రు. కొంతకాలంగా తల్లి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేయాలని నలుగురు కొడుకులు ప్ర యత్నిస్తున్నారు. ఇటీవల విగ్రహ ఏర్పాటు కోసం ఇంట్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. అందులో తల్లి సూర్యకుమారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. -
అద్భుత సృష్టి.. ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గామాత విగ్రహం
డిస్పూర్: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు అస్సాంలోని దుబ్రీ జిల్లాకు చెందిన సంజీవ్ బాసక్ అనే వ్యక్తి దుర్గా నవరాత్రులను వేదికగా చేసుకున్నాడు. పరిశ్రమలు, మెడికల్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ కళాకృతులతో అవగాహన కల్పిస్తున్నాడు. వ్యర్థాలను తగ్గించాలని చెప్పేందుకు వివిధ ఆకృతులతో దుర్గా మాత విగ్రహాలను తయారు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు బాసక్. 2015 తొలుత థర్మకోల్‌తో 14 అడుగుల దుర్గమాత విగ్రహాన్ని రూపొందించారు బాసక్. అప్పటి నుంచి ప్రతిఏటా ఇలా వివిధ వ్యర్థ పదార్థాలతో విగ్రహాలు రూపొందిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అందులో భాగంగానే ఈఏడాది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గమాత విగ్రహాన్ని తయారు చేశాడు బాసక్. ప్రస్తుతం ఈ దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో అస్సాంలో రూపొందించిన దుర్గామాత విగ్రహం ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్‌కు ఊహించని షాక్! -
వేలాది కాయిన్స్ తో వినాయక ప్రతిమ తయారీ
-
నిధి అంటూ దంపతులకు బురిడీ
యశవంతపుర: నిధి ఆశ చూపి దంపతులకు రూ. 5 లక్షలు మోసం చేసి దొంగస్వామి అదృశ్యమైన ఘటన హాసన్ జిల్లాలో చోటు చేసుకుంది. తాలూకాలోని దొడ్డహళ్లి గ్రామానికి చెందిన గౌడకు గ్రామంలో కొంత భూమి ఉంది. ఆ భూమిలో నిధి ఉందంటూ మంజేగౌడ అనే దొంగస్వామి నమ్మించాడు. దైవశక్తితో బయటకు తీస్తానంటూ ముందుగానే మూడు కేజీల బంగారు పూత పూసిన బంగారు విగ్రహాన్ని పాతి పెట్టాడు. మొదట భూమి యజమాని గౌడ–లీలావతి దంపతులు పూజ చేస్తే బయటకు తీస్తానని చెప్పి వారి భూమిలో పాతి పెట్టిన నకిలీ పసిడి విగ్రహాన్ని బయటకు తీసి దంపతులకు ఇచ్చాడు. విగ్రహానికి రక్తాభిషేకం చేయాలని చెప్పి లీలావతి వేలును కోశాడు. దీంతో వేలు తెగిపోయింది. వారం రోజుల తరువాత గౌడ దంపతులు విగ్రహాన్ని తీసుకుని బంగారు షాపులో పరీక్షించగా అది వెండిదిగా తేలింది. అంతకు ముందే స్వామీజీ రూ. 5 లక్షల తీసుకుని పరారయ్యాడు. వేలు తెగిపోవడంతో లీలావతి ఆస్పత్రి పాలైంది. అయితే ఈ ఘటనపై ఇంత వరకు కేసు నమోదు కాలేదు. (చదవండి: వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఫోన్లో మాట్లాడుతుంటే చూసి..) -
భరతమాత కొలువైన గుడి
గౌరిబిదనూరు: దేశంలో ముక్కోటి దేవీ దేవతలకు ఆలయాలు, ప్రఖ్యాత దేవస్థానాలు ఉన్నాయి, కానీ భరతమాత పేరుతో ఉన్న మందిరాలు ఎక్కడా కనిపించవు. దేశమాత విగ్రహ రూపంలో కొలువై పూజలందుకుంటున్న మందిరాన్ని చూడాలంటే గౌరిబిదనూరుకు వెళ్లాల్సిందే. దక్షిణ భారతదేశపు జలియన్ వాలాబాగ్‌గా ప్రసిద్ధి చెందిన విదురాశ్వత్థానికి సమీపంలో ఉన్న నాగసంద్ర గ్రామంలో 2008లో భారతమాత దేవాలయం వెలిసింది. కృష్ణశిలలో హిందూపురానికి చెందిన శిల్పి నాగరాజు 6 అడుగుల భరతమాత విగ్రహాన్ని చెక్కారు. జాతీయ జెండాను పట్టుకుని జెండా దర్శనమిస్తుంది. జనవరి 26, ఆగస్టు 15కు ప్రత్యేక పూజలు దేవాలయం పై కప్పున దేశ నాయకుల చిత్రాలు, బొమ్మలు స్ఫూర్తిని నింపుతాయి. కిత్తూరు రాణి చన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాస్ చంద్రబోస్ తదితరుల బొమ్మలను చెక్కారు. ఏటా ఆగస్టు 14 అర్ధరాత్రి దేశభక్తియుత ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీ. స్థానిక నాయకుడు రవి నారాయణరెడ్డి భరతమాత ట్రస్ట్ ఏర్పరచి ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయంలో భరతమాతకు నిత్య పూజలు నిర్వహిస్తూ, గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15న విశేష పూజలు జరుపుతారు. (చదవండి: చిన్నవాణ్ణని వదిలేశారు) -
న్యూయార్క్‌లో చోళ్ల కాలం నాటి పార్వతి దేవి విగ్రహం
చెన్నై: చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్‌లో ఉన్నట్లు ఐడల్ వింగ్ క్రిమినల్ ఇన్విస్టేగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) పేర్కొంది. న్యూయార్క్‌లోని బోన్హామ్స్ వేలం హౌస్‌లో ఈ విగ్రహాన్ని గుర్తించినట్లు సీఐడీ తెలిపింది. ఈ విగ్రహం విషయమై 1971లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. గానీ 2019లో ఫిబ్రవరి కె వాసు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడూ కేసు నమోదు చేసి వదిలేశారు. ఐతే ప్రస్తుతం ఐడల్ వింగ్ ఇన్స్పెక్టర్ ఎం చిత్ర ఈ కేసును దర్యాప్తు చేయడంతో వివిధ మ్యూజియంలు, వేలం హౌస్‌లపై దర్యాప్తు చేయడం ప్రారంభించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ మేరకు ఆమె బోన్హామ్స్ వేలం హౌస్‌లో ఈ విగ్రహాన్ని కనుగొన్నారు. ఇది సుమారు 12వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 52 సెం.మీటర్లు ఉంటుంది. పైగా ఈ విగ్రహం విలువ సుమారు ఒకటిన్నర కోట్లు ఉంటుందని చెబుతున్నారు అధికారులు. విగ్రహం నుంచున్న ఆకృతిలో ఉండి కిరీటం, నెక్లెస్‌లు, ఆర్మ్బ్యాండ్లు, వస్త్రాలతో రూపొందించి ఉంటుంది. వాస్తవానికి ఈ విగ్రహం కుంభకోణంలో తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో అదృశ్యమైన పార్వతి దేవి విగ్రహం ప్రసుతం అధికారులు ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు సంబంధిత పత్రాలను సిద్ధం చేస్తున్నారు. (చదవండి: ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!) -
400 ఏళ్ల నాటి పురాతన రాజ వంశ విగ్రహం కోసం...దొంగలకే టోపీ పెట్టి
చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్(ఐడల్ వింగ్)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ల నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్ వింగ్ బృందం అండర్ కవర్ అపరేషన్ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు. ఈ మేరకు అధికారులు తుత్తకుడి నివాసితులైన ఆరుముగరాజ్, కుమార్వేల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పురాతన విగ్రహాన్ని విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు తమ సిబ్బందిలోని కొంతమంది ధనవంతులైన వ్యక్తులుగా వారిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. ఈ విధంగా ధనవంతులైన వ్యక్తులుగా ఆ విగ్రహానికి కొనుగోలు చేసే నెపంతో వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ముస్తఫ్ అనే వ్యక్తి పురాతన విగ్రహాన్ని తిరుచ్చి - మదురై హైవేపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఐతే పోలీసులు ఆ విగ్రహాన్ని చూడటానికి కోట్లలలో తమ వద్ద డబ్బు ఉందని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఆ స్మగ్లర్లతో బేరసారాలు ఆడుతూ అసలు గుట్టంతా తెలసుకుని ముస్తఫా, ఆరుముగరాజ్, కుమారవేల్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ నిందితులను విచారించగా తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుంచి ఈ విగ్రహాన్ని పొందినట్లు తెలిపాడు. ఐతే సెల్వకుమార్ వద్దే ఈ విగ్రహం 12 ఏళ్లుగా ఉందని, దీన్ని తన తండ్రి నాగరాజన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ విగ్రహం సేతుపతి వంశానికి చెందిన పురాతన మహిళ విగ్రహం. ఆ విగ్రహం ఖరీదు వేల కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు . (చదవండి: కస్టమర్‌కి చేదు అనుభవం... అలా వచ్చాడని టికెట్టు ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్)