1000 Year Old Adhikara Nandi Idol Found In Siddipet, Details Inside - Sakshi
Sakshi News home page

1000 Years Old Nandi Idol: మానవరూపంలో నంది

Published Tue, Jun 28 2022 4:09 AM | Last Updated on Tue, Jun 28 2022 9:35 AM

1000 Year Old Adhikara Nandi Idol Found In Siddipet - Sakshi

నాలుగు చేతుల అధికార నంది

సాక్షి, హైదరాబాద్‌: నంది అనగానే శివాలయంలో  శివుడికి ఎదురుగా మంటపంలో జంతు రూపంలో ఉం డటమే మనకు తెలుసు. కానీ.. 11వ శతాబ్దంలో నందికి మానవరూపంతో ఓ దైవ విగ్రహంగా ప్రత్యేక స్థానం ఉండేది. ఇప్పుడు అలాంటి అరుదైన విగ్రహం సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని కాసువాగు ఆంజనేయస్వామి ఆలయంలో వెలుగుచూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ గుర్తించారని ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు.

ఈ నంది విగ్ర హాన్ని అధికార నందిగా పేర్కొంటారు. శివుడి దర్శనానికిగాను భక్తులకు అనుమతి ఇచ్చే అధికారంతో ఉంటుందని, అందుకే అధికార నంది అంటారని ప్రముఖ స్థపతి డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. శివుడి దర్శనానికి ముందు ఈ విగ్రహాన్ని దర్శించేలా చాళుక్యుల కాలంలో సంప్రదాయం ప్రారంభమైందని, వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేసే వారని, ఆ తర్వాత అంతర్ధానమైందని వివరించారు.

ఇక కుతుబ్‌ షాహీల కాలంలో 40 గ్రామాలకు దేశ్‌ముఖ్‌గా పనిచేసిన సిద్ధసోమాజీ, తన తల్లి కోరిక మేరకు ఈ   ఆలయాన్ని నిర్మించి దీన్ని ప్రతిష్టించారని చెప్పారు. ఈ విగ్రహం వెనక కుడి చేతిలో పరశువు, ఎడమచేతిలో కృష్ణ జింక, ముందరి కుడి చేయి వరద హస్తంగా, ఎడమ చేతిలో అధికార దండం ఉన్నట్టు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement