nandi
-
పాలుతాగావా.. బసవన్నా!
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామంలోని బసవన్న దేవాలయంలో నందీశ్వరుడు పాలు తాగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. దీంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరన్‌కోట్ గ్రామంలోని మెయిన్ బజార్లో పురాతన బసవన్న దేవాలయం ఉంది. గ్రామానికి చెందిన పూజ, స్రవంతి శుక్రవారం ఆలయంలో నైవేద్యం సమరి్పచేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న నందీశ్వరుడి విగ్రహానికి పాలుతాపే ప్రయత్నం చేయగా... నిజంగా పాలు మొత్తం తాగినట్లు ఆ మహిళలు గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పురాతన ఆలయం కావడంతో శనివారం ఉదయం ఆలయం ముందు భాగం కూలిపోయింది. ఇదంతా దేవుడి మహిమ అని త్వరలో ఆలయానికి మరమ్మతులు చేపడతామని ఉప సర్పంచ్ హేమంత్‌కుమార్ తెలిపారు. నందీశ్వరుడు పాలు తాగిన విషయం నిజమేనని ఉపసర్పంచ్ కూడా చెప్పారు. బీసీలకు రెండు -
మానవరూపంలో నంది
సాక్షి, హైదరాబాద్: నంది అనగానే శివాలయంలో శివుడికి ఎదురుగా మంటపంలో జంతు రూపంలో ఉం డటమే మనకు తెలుసు. కానీ.. 11వ శతాబ్దంలో నందికి మానవరూపంతో ఓ దైవ విగ్రహంగా ప్రత్యేక స్థానం ఉండేది. ఇప్పుడు అలాంటి అరుదైన విగ్రహం సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని కాసువాగు ఆంజనేయస్వామి ఆలయంలో వెలుగుచూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ నంది విగ్ర హాన్ని అధికార నందిగా పేర్కొంటారు. శివుడి దర్శనానికిగాను భక్తులకు అనుమతి ఇచ్చే అధికారంతో ఉంటుందని, అందుకే అధికార నంది అంటారని ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. శివుడి దర్శనానికి ముందు ఈ విగ్రహాన్ని దర్శించేలా చాళుక్యుల కాలంలో సంప్రదాయం ప్రారంభమైందని, వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేసే వారని, ఆ తర్వాత అంతర్ధానమైందని వివరించారు. ఇక కుతుబ్ షాహీల కాలంలో 40 గ్రామాలకు దేశ్‌ముఖ్‌గా పనిచేసిన సిద్ధసోమాజీ, తన తల్లి కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించి దీన్ని ప్రతిష్టించారని చెప్పారు. ఈ విగ్రహం వెనక కుడి చేతిలో పరశువు, ఎడమచేతిలో కృష్ణ జింక, ముందరి కుడి చేయి వరద హస్తంగా, ఎడమ చేతిలో అధికార దండం ఉన్నట్టు వెల్లడించారు. -
చిరంజీవి ఫోన్ చేశారు: వరలక్ష్మీ శరత్‌కుమార్
‘‘నన్ను నేను ఓ ఇమేజ్ చట్రానికి పరిమితం చేసుకోవాలనుకోలేదు. ఒకే తరహా పాత్రలు చేయకూడదని ఇండస్ట్రీలోకి వచ్చిన రోజే నిర్ణయించుకున్నా.. అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే పరిపూర్ణమైన నటి అనిపించుకోగలం. నా దృష్టిలో నటన ఓ ఉద్యోగంలాంటిది. క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుంది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి మాట్లాడుతూ–‘‘నాంది’ సినిమాలో ఆద్య అనే క్రిమినల్ లాయర్ పాత్ర చేశా. ఆద్య పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. లాయర్ పాత్ర కాబట్టి భారీ డైలాగులు చెప్పాల్సి వచ్చేది. దీంతో స్కూల్ పిల్లల్లా రాత్రిళ్లు డైలాగ్స్ బట్టీ పట్టి, ఉదయం షూటింగ్‌కి వెళ్లేదాన్ని. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా విజయ్ ఈ కథ తయారు చేసుకున్నాడు. సౌత్‌లో 30కి పైగా సినిమాల్లో అన్ని రకాల పాత్రల్లో నటించా.. ఇకపై కూడా నటిస్తాను. ఈ విషయంలో నటుడు విజయ్ సేతుపతిగారే నాకు స్ఫూర్తి. ఇటీవల విడుదలైన ‘క్రాక్’ సినిమాలో నేను నటించిన జయమ్మ పాత్ర బాగుందని నాన్నగారు(శరత్‌కుమార్) గర్వంగా ఫీలయ్యారు. చిరంజీవిగారు ఫోన్ చేసి ‘జయమ్మ పాత్రలో చక్కని నటన కనబరిచావు.. డబ్బింగ్ కూడా బాగుంది’ అని అభినందించడంతో చాలా సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్‌తో ఓ సినిమా చేస్తున్నా.. మరో రెండు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
భీమేశ్వరునికి.. నందీశ్వరునికీ నడుమ...∙
ద్రాక్షారామం (రామచంద్రపురం రూరల్): సాధారణంగా భక్తులు ఏ శివాలయానికి వెళ్లినా చండీశ్వరుడిని, నందీశ్వరుడిని దర్శించి స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి మూల విరాట్ దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది. అయితే దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామలో మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి దేవాలయంలో ఆలయ అధికారులు భీమేశ్వరునికి, నందీశ్వరుడికీ మధ్య దాతలు ఇచ్చిన దర్బారు మండపాన్ని ఏర్పాటు చేయడంపై శివ భక్తులు, గ్రామస్తులు, అర్చకులు, పురోహిత పెద్దలు కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ దర్బారు మండపానికి అద్దాలు అమర్చి అందులో స్వామివారి మూర్తులను ఉంచి తీర్థం, పాదుకలు ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచన సమంజసం కాదంటున్నారు. దీనివల్ల స్వామికి, నందీశ్వరుడికి మధ్య ఆటంకం ఏర్పాటు చేసినట్టవుతుందని, అంతేకాకుండా భక్తుల రద్దీ వేళల్లో భక్తులకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు. అక్కడికి బదులుగా భక్తులకు అనుకూలంగా ఉండే మరో చోటుకు ఈ మండపాన్ని మార్చాలని కోరుతున్నారు. అందరినీ ఆలోచించి చేస్తాం కొంతమంది పెద్దల సూచన మేరకు మండపాన్ని అక్కడ ఏర్పాటు చేశాం. అక్కడ పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటే, అందరితో ఆలోచించి మండపం స్థలం మార్చేందుకు నిర్ణయం తీసుకుంటాం. – పెండ్యాల వెంకట చలపతిరావు, ఈఓ, శ్రీ భీమేశ్వరస్వామివారి దేవస్థానం, ద్రాక్షారామ -
శివ దర్శనం
శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు. కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత? పరమేశ్వరుడికి అనుంగు భక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపాన్ని మనస్సు వెంటనే గ్రహించగలదు. కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి. నంది పృష్టభాగాన్ని నిమురుతూ, శృంగాల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది. అందుకే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణం చెబుతోంది. -
చూసొద్దాం..
అరుదైన చిత్ర, శిల్ప కళలతో.. ఆధ్యాత్మిక చింతనతో పాటు నేటికీ అంతు చిక్కని సాంకేతిక నైపుణ్యానికి పట్టుకొమ్మగా విరాజిల్లుతోంది లేపాక్షి. సజీవశిల్ప సౌందర్యానికి ప్రతీకగా దేశవిదేశీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన వీరభద్రస్వామి ఆలయంలోని శిల్పాలు, తైలవర్ణ చిత్రాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, జటాయు మోక్షఘాట్, నంది విగ్రహం, ఏడుశిరసుల నాగేంద్రుడు, అంతరిక్ష స్తంభం, సీతమ్మ పాదం, విరుపణ్ణ కళ్లు పెకలించి గోడకు తాపడం చేసిన చోట అంటిన రక్తపు మరకలు, నాట్య మంటపం, లతా మంటపం, కల్యాణమంటపం తదితర విశేషాలు ఎన్నో అబ్బురపరుస్తున్నాయి. ఇక్కడి ఆలయం పైకప్పును రామాయణ, మహాభారత, మనునీతి, భూకైలాస్, కిరాతార్జునీయం తదితర ఘట్టాలను తైలవర్ణాలతో అద్భుతంగా చిత్రీకరించారు. ఆలయం వద్ద ఇటీవల శుద్ధి చేసిన కోనేరు, పార్కులు చూడముచ్చటగా ఉన్నాయి. ఆలయంలోని నాట్యమంటపం ఈశాన్య మూలలో నేలను తాకకుండా సుమారు ఎనిమిది అడుగుల స్తంభం పైకప్పు నుంచి నేలను తాకకుండా వేలాడబడి ఉంది. అంతరిక్ష స్తంభం అని పిలువబడుతున్న ఈ వేలాడే స్తంభం గుట్టు తెలుసుకునేందుకు అప్పట్లో దేశాన్ని పాలించిన తెల్లదొరలు నానా అగచాట్లు పడ్డారు. ఇందులోని రహస్యం నేటికీ అంతు చిక్కడం లేదు. ఈ ఆలయాన్ని చూడాలనుకుంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూపురం చేరుకుని అక్కడి నుంచి తూర్పు దిశగా 14 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడకు నిరంతర బస్సు సౌకర్యం ఉంది. - లేపాక్షి (హిందూపురం) -
నటప్రావీణ్యానికి ప్రతీకలు.. పౌరాణిక నాటకాలు
పౌరాణిక నాటకాలు- కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా స్థానిక టీజీవి కళాక్షేత్రంలో బుధవారం రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాటక సమాజాల కళాకారులు ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు రంగస్థల నటుల నటప్రావీణ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. శ్రీ జ్ఞాన సరస్వతీ నాట్యకళామండలి వారు ప్రదర్శించిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’, శ్రీబాలసరస్వతి కళానాట్యమండలి (రంగారెడ్డి జిల్లా) వారు ప్రదర్శించిన ‘సత్య హరిశ్చంద్ర’, నటకులం సాంస్కృతిక సంస్థ (మణికొండ, హైదరబాదు) వారు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ రాయబారం’ నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. అలనాటి పురాణాలలోని శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు, సత్యహరిశ్చంద్రుడు, శ్రీకృష్ణుడు తదితర పాత్రలలోని ఔన్నత్యాన్ని ఈ నాటకాలు చాటి చెప్పాయి. శక్తి కంటే భక్తి గొప్పదని చాటిన రామాంజనేయ యుద్ధం శ్రీజ్ఞాన సరస్వతి నాట్యకళామండలి (పరిగి) కళాకారులు ప్రదర్శించిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ పద్య నాటకం శక్తి కంటే భక్తియే గొప్పదని చాటిచెప్పింది. యయాతి రాజు వేటకై బయలుదేరి అరణ్యంలో తపస్సు చేస్తున్న వశిష్ట, విశ్వామిత్ర మునులను దర్శిస్తాడు. వశిష్ట మునికి యయాతి నమస్కరించగా, విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై యయాతిని శపిస్తాడు. నారదుడు యయాతి చెంత చేరి ఆంజనేయుని వేడుకుని శాపవిముక్తిని పొందమని సలహా ఇస్తాడు. రాముని చేత సంహరింపబడాలనే శాపం నుంచి ఆంజనేయుడు మాత్రమే కాపాడగలడని యయాతి ఆంజనేయుడిని శరణు వేడతాడు. తనను శరణు వేడిన యయాతి ప్రాణరక్షణ కోసం ఆంజనేయుడు రామునితో యయాతిని సంహరించవద్దని అభ్యర్థిస్తాడు. కానీ రాముడు ఆంజనేయుని అభ్యర్థనను తిరస్కరించి ఆంజనేయుడితో యుద్ధానికి సన్నద్ధమవుతాడు. సత్యమును కాపాడుటకై రామాంజనేయులు యుద్ధమునకు సిద్ధమైనారని నారదుడు ప్రవేశించి యుద్ధము వారించమని శంకురుడిని కోరతాడు. ప్రత్యక్షమైన శంకరుడు శక్తి కంటే భక్తి గొప్పదని రామాంజనేయులు నిరూపించారని తెలియజేస్తారు. రామభక్తి, ఆంజనేయుని శక్తి రెండింటినీ అద్వితీయంగా ప్రదర్శించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. తాండ్ర సుబ్రహ్మణ్యం రచించిన ఈ నాటకానికి వి.జగన్నాథరాజు దర్శకత్వం వహించారు. సత్యనిష్టకు అద్దం పట్టిన ‘సత్యహరిశ్చంద్ర’... టీజీవి కళాక్షేత్రంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ బాలసరస్వతి కళానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన ‘సత్య హరిశ్చంద్ర’ నాటకం హరిశ్చంద్రుని సత్యనిష్టకు అద్దం పట్టింది. ఆడిన మాట తప్పడని, వాగ్దానం నెరవేర్చుట కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటాడనే హరిశ్చంద్రుని సాధు స్వభావాన్ని ఈ నాటకం చాటి చెప్పింది. దేవేంద్ర సభలో సత్యం తప్పక పలికే వారెవరూ అనే ప్రశ్న వచ్చినప్పుడు భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని వశిష్టుడు తెలుపుతాడు. హరిశ్చంద్రుడిని సైతం బొంకించేదనని విశ్వామిత్రుడు ప్రతిజ్ఞ చేసి వశిష్టునితో పందెం కాస్తాడు. అయోధ్యకేగి పరమేశ్వర ప్రీతిగా యాగము చేయదలిచానని, అందుకు ధనము కావలెనని హరిశ్చందుడిని కోరతాడు. హరిశ్చంద్రుడు కోరిన ధనాన్ని ఇస్తానని తెలుపుతాడు. అయితే విశ్వామిత్రుడు సింహాన్ని, మాతంగ కన్యను సృష్టించడం, హరిశ్చంద్రునికి అనేక కష్టాలు కల్గించడం వల్ల ఆ ధనమును ఇవ్వలేకపోతాడు. హరిశ్చంద్రుడు రాజ్యం విడచి అడవులకు తరలివెళ్తాడు. తనకు ఇస్తానన్న ధనమును వసూలు చేయడానికి విశ్వామిత్రుడు నక్షత్రకుడిని పంపి నానా ఇబ్బందులు పెడతాడు. చివరకు హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని, కొడుకును అమ్ముకుంటాడు. కొడుకు లోహితుడిని మాయా పాము కరచి చంపగా, భార్యనే సుంకము తెమ్మని కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు కట్టడి చేస్తాడు. ఆమె తన మంగళసూత్రాన్ని ఇవ్వడంతో వారి సత్యనిష్టను చాటుకున్నారు. తుదకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై విశ్వామిత్రుడు ఆడిన నాటకం మాయా నాటకమని, హరిశ్చంద్రుని సత్యనిష్ట ముల్లోకాలకు ఆదర్శవంతమని ప్రకటిస్తాడు. నాటక ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఈ నాటకానికి వరకవుల జగన్నాథరాజు దర్శకత్వం వహించారు. కృష్ణుడి మేథస్సుకు దర్పణం పట్టిన శ్రీకృష్ణ రాయబారం స్థానిక టీజీవి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు నటకులం సాంస్కృతిక సంస్థ కళాకారులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ రాయబారం’ నాటకం శ్రీకృష్ణుడి మేథస్సుకు దర్పణం పట్టింది. కురుక్షేత్ర యుద్ధం సందర్భంగా శ్రీకృష్ణుడిని సహాయం అర్థించడానికి కౌరవుల తరపున దుర్యోధనుడు, పాండవుల తరపున అర్జునుడు ద్వారకకు వెళ్తారు. శ్రీకృష్ణుడు తానొక్కడినే ఒకవైపు.. తన సైన్యం ఒకవైపు ఉంటామని చెప్పగా అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుకుంటాడు. ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణుడు కౌరవుల సభకు వెళ్లి ఐదు ఊళ్లు ఇచ్చినట్లయితే కురుక్షేత్ర యుద్ధాన్ని నివారిస్తానని రాయబారం చేస్తాడు. అందుకు దుర్యోధనుడు అంగీకరించకపోగా, రాయబారిగా వచ్చిన శ్రీకృçష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో నాటకం ముగుస్తుంది. తిరుపతి వెంకటకవులు రచించిన ఈ నాటకానికి దాసరి శివాజీరావు దర్శకత్వం వహించారు. నేటితో ముగియనున్న నంది నాటకోత్సవాలు... కర్నూలు నగరంలో టీజీవి కళాక్షేత్రంలో జనవరి 18న ప్రారంభమైన నంది నాటకోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 15 రోజులుగా సాగిన ఈ నాటకోత్సవాల్లో పలువురు ప్రముఖ రంగస్థల నటులు, టీవీ, సినిమా కళాకారులు, రచయితలు పాల్గొన్నారు. సాంఘిక నాటికలు, బాలల, కళాశాలల విద్యార్థుల నాటికలు, అనంతరం పౌరాణిక పద్య నాటకాలు ఈ నాటకోత్సవాలలో ప్రదర్శితమయ్యాయి. నేడు కర్నూలు లలిత కళాసమితి వారి ప్రమీలార్జున పరిణయం ప్రదర్శన... నంది నాటకోత్సవాల ముగింపు రోజున గురువారం ఉదయం 10.30 గంటలకు కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రమీలార్జున పరిణయం పద్యనాటకాన్ని ప్రదర్శిస్తారని లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వల్లెలాంబ నాటక సమితి (కోడుమూరు) కళాకారులు ‘దేవుడు’ పద్యనాటకాన్ని ప్రదర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు సావేరి కల్చరల్ అసోసియేషన్ వారు ‘గంగాంబిక’ పద్యనాటకాన్ని ప్రదర్శిస్తారు. ఈ నాటక ప్రదర్శనతో నంది నాటకోత్సవాలు ముగుస్తాయి. -
నటనా సౌరభం
- దేవలోక ఔన్నత్యాన్ని చాటిన పౌరాణిక నాటకాలు - పద్యాలతో ప్రేక్షకులను అలరించిన కళాకారులు నందినాటకోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాల కళాకారులు ప్రదర్శించిన పౌరాణిక పద్యనాటకాలు దేవలోక ఔనత్యాన్ని చాటి చెప్పాయి. పురాణేతిహాసాలలోని ఉత్తమ విలువలకు అద్దం పట్టాయి. నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన సీతారామకల్యాణం, కళావాహిని సాంస్కృతిక సంస్థ కర్నూలు వారు ప్రదర్శించిన కాళహస్తీశ్వర మహత్యం, సవేరా ఆర్ట్స్ కడప వారు ప్రదర్శించిన శ్రీరామ పాదుకలు అనే పద్యనాటకాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపాయి. - కర్నూలు (కల్చరల్) రాముడి పరాక్రమం చాటిన సీతారామకళ్యాణం: నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ కళాకారులు స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు సీతారామ కల్యాణం నాటకాన్ని ప్రదర్శించారు. లంకాధిపతిౖయెన రావణుడు శివున్ని మెప్పించి అనేక వరాలు పొంది తాను ఆచరిస్తున్నదే అసలైన ధర్మమని విశ్వసిస్తుంటాడు. దశకంఠుడు కైలాసనాథున్ని కఠోర భక్తితో పూజించి తనకు మరణం లేకుండునట్లు వరం పొంది రావణా అనే బిరుదును సాధిస్తాడు. లోక కల్యాణార్థం విశ్వామిత్రుడు తలపెట్టిన యాగాన్ని రాక్షసులు నిరోధిస్తారు. రామలక్ష్మణులు రాక్షసులను ఎదుర్కొని యాగ పరిసమాప్తం గావిస్తారు. రాక్షస సంహారంతో రావణాసుడు ప్రతీకార వాంఛతో రగిలిపోతాడు. నార«ధుని ప్రమేయంతో రావణుడు సీతా స్వయం వరానికి మిథిలానగరానికి వెళ్తాడు. అక్కడ శివధనస్సును ఎత్తలేక పరాభవం పాలవుతాడు. శ్రీరామ చంద్రుడు విశ్వామిత్రుని ఆశీస్సులతో శివధనుర్భంగం చేసి సీతను వివాహమాడుతాడు. సీతారామకల్యాణం లోక కల్యాణానికి నాంది పలుకుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ నాటకానికి ఎం.అర్జున్‌రావు దర్శకత్వం వహించారు. కాళహస్తి విశిష్టతకు దర్పణం పట్టిన కాళహస్తీశ్వర మహత్యం: కళావాహిని సాంస్కృతిక సంస్థ కర్నూలు కళాకారులు ప్రదర్శించిన కాళహస్తీశ్వర మహత్యం కాళహస్తి విశిష్టతకు దర్పణం పట్టింది. కరువు కాటకాలతో దుర్భర స్థితిలోనున్న మధురాపురి రాజైన హరద్విజుడు నారధుని సలహా మేరకు శివుని గురించి తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన శివుడు అతడిని ఒక పద్యమును పాండ్యరాజుకు వరముగా ఇస్తే అతని రాజ్యం సుఖఃశాంతులతో విలసిల్లుతుందని చెప్పారు. రుద్రరచితమైన పద్యమును తీసుకొని హరద్విజుడు పాండ్యరాజు ఆస్థానానికి వెళ్లి అక్కడ నక్కరకవిచే అవమానం పొందుతాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై నక్కర కవిని కుష్టువ్యాధి గ్రస్తుడవు కమ్మని శపిస్తాడు. కైలాసాద్రిని దర్శిస్తే శాపవిమోచనం కలుగుతుందని ఆదేశిస్తాడు. నత్కర కవి అప్పటి నుంచి కైలాస గిరికై అరణ్యములు దాటి వెళుతూ రాక్షసుడైన రక్తాక్షుని చెరలో చిక్కుతాడు. కుమారస్వామి నత్కర కవిని రక్తాక్షుని నుంచి రక్షిస్తాడు. కాళహస్తీశ్వరున్ని దర్శిస్తే శాపవిముక్తి కలుగుతుందని కుమార స్వామి సెలవిస్తాడు. కుమారస్వామి ఆదేశం మేరకు నత్కర కవి శివసాయుజ్యం పొంది కుష్టువ్యాధి నుంచి విముక్తుడు అవుతాడు. అప్పటి నుంచి కాళహస్తి మహత్యం కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది.ఈ నాటకానికి మనోహర్‌బాబు దర్శకత్వం వహించారు. రామపాదుకల విశిష్టత చాటిన శ్రీరామపాదుకలు : సవేరా ఆర్ట్స్ కడప కళాకారులు ప్రదర్శించిన శ్రీరామపాదుకలు నాటకం రామాయణంలోని ఘట్టాలను చక్కగా ప్రదర్శించింది. సీతా స్వయంవరంలో జరిగిన పరాభవంతో భంగపడిన రావణుడు రాముడిని సంహరించడానికి బయలుదేరుతాడు. శివుని మాయ కారణంగా కైకేయి దుర్మతిగా మారి దశరథుని రెండు వరాలు కోరుకుంటుంది. కైక వరాలను గౌరవిస్తూ శ్రీరాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేయడానికి తరలివెళ్తాడు. మరొక వరం ప్రకారం భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కానీ రాముడిపై అపారమైన భక్తి కలిగిన భరతుడు సోదరుడు తిరిగి వచ్చే వరకు రామపాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యపాలన చేస్తాడు. అలనాటి రామాయణ గాధలోని సత్యవాక్పరిపాలనలోని ఔనత్యాన్ని చాటి చెప్పే ఈ సన్నివేశాలను నాటకంలోని కళాకారులు అత్యంత ఆసక్తికరంగా ప్రదర్శించారు. ప్రముఖ నాటక రచయిత పల్లేటి లక్ష్మీకులశేఖర్ రచించిన ఈ నాటకానికి ఆళ్లూరి వెంకటయ్య దర్శకత్వం వహించారు. -
ఆద్యంతం.. నవరసభరితం
- అలరిస్తున్న నంది నాటకోత్సవాలు – సామాజిక, కుటుంబ అంశాలే ఇతివృత్తాలు – ఆకట్టుకున్న క్రైమ్‌స్టోరీ - సైకతశిల్పం రేపటికి వాయిదా కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర స్థాయి నందినాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన నాటికలు కుటుంబసమస్యలు, సామాజిక అంశాల ఇతివృత్తాలతో సాగాయి. రాత్రి ఉద్యోగం వల్ల కలిగే అనర్థాల గురించి చెప్పే ‘కొత్తబానిసలు’, నిత్య జీవితంలో జరిగే సంఘటనలు ప్రాప్తమా లేక మాయా మంత్రాలా అనే ఇతివృత్తంతో సాగే ‘నియతి’, గెస్ట్‌హౌస్‌లో జరిగే హత్య నేపథ్యంలో సాగే ‘మిస్టరీ’, కుమారుడిపై ఉన్న ప్రేమ వెలకట్టలేనిదని తెలిపే ‘రుణాబంధ రూపేణా’, ఆస్తి కంటే అనుబంధాలే ముఖ్యమని చెప్పే ‘పంపకాలు’ హృదయాన్ని హత్తుకుంటాయి. మంగళవారం మొత్తం ఏడు నాటికలు జరగాల్సి ఉండగా కళాకారులు, టెక్నీషియన్లు రాకపోవడంతో నాయకురాలు నాగమ్మ రద్దు కాగా, సైకతశిల్పం 26వ తేదీకి వాయిదా పడింది. రాత్రి ఉద్యోగానికి భాష్యం చెప్పే ‘కొత్త బానిసలు’ భార్యాభర్తలిద్దరూ రాత్రి ఉద్యోగాలు చేస్తే వారి మనసులు ఎలా స్పందిస్తాయో...చిన్న చిన్న విషయాలకు కూడా ఎలా గొడవలు పెరిగిపోతాయో ‘కొత్త బానిసలు’ నాటిక కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో సంబంధం లేని గృహహింస చట్టాన్ని ఆశ్రయించి బతుకుని రోడ్డు మీదకు తెచ్చేలా భార్య ప్రవర్తించి విడాకుల వరకు వెళ్తుంది. వీరి సమస్యకు రాత్రి ఉద్యోగమేనని తెలుసుకున్న మానసిక వైద్యుడు వారికి కౌన్సిలింగ్ ఇస్తాడు. ‘నైట్ షిఫ్ట్‌లు చేస్తున్న ఓ రాత్రి ఉద్యోగులురా..!! ఆత్మవిశ్వాసం, ధృఢ సంకల్పం ఉంటేనే రాత్రి ఉద్యోగాలు చేయండి, లేదంటే ప్రతి చిన్నదానికీ అతిగా స్పందించి జీవితాన్ని బలిచేయాల్సి ఉంటుంది జాగ్రత్త’ అని వైద్యుడు బదులిస్తాడు. అటు హాస్యం, ఇటు సందేశాత్మకంగా ఉన్న ఈ నాటికను హుజూరాబాద్‌లోని ఈటెల నాటక రంగ కళాకారుల సమాఖ్య ప్రదర్శించింది. రచన డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం కొలుగూరి దేవయ్య. పాత్రదారులు కొలుగూరి దేవయ్య, ఎం. ప్రకాశ్, కుడికాల ప్రభాకర్, ముదం కుమారస్వామి, దేవసేన నటించారు. ఆకట్టుకున్న ‘నియతి’ మంత్రాలు, మహత్తులు ఉన్నాయా..? ఉంటే వాటి సాయంతో మనం జీవితంలో కావాలనుకున్నవి సాధించగలమా..?, అది సాధ్యపడేటట్లయితే జీవితంలో మనకు ఎదురయ్యే ఆటు–పోట్ల సంగతేమిటి.?, మనం కోరుకోకపోయినా అవి జరుగుతున్నాయే...!, అందుకు కారణం నియతి అంటే ప్రాప్తం అంటారే..!, అది ఎంత వరకు నిజం..?. ఆనందంగా తృప్తిగా బతుకుతున్న ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎదురుచూడని సంఘటనలు ఈ సమస్యను, సందేహాన్ని ఎంత వరకు తీరుస్తాయంటూ ఆలోచింపజేసే నాటిక ఈ ‘నియతి’. హైదరాబాద్‌లోని శ్రీ మహతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటికకు రచన చిట్టాశంకర్, దర్శకత్వం ఉప్పలూరి సుబ్బరాయశర్మ. పాత్రదారులు చిట్టాశంకర్, మంజునాథ్, శివరామకృష్ణ, సుబ్బారావు, విజయలక్ష్మి నటించారు. ఉత్కంఠ భరిత మలుపులతో ‘మిస్టరి’ హైదరాబాద్‌కు చెందిన శ్రీ మహతి క్రియేషన్స్ వారు ‘మిస్టరి’ అనే నాటికను ప్రదర్శించారు. ఓ గెస్ట్‌హౌస్‌లో జరిగిన హత్యకు సంబంధించిన ఇతి వృత్తమే మిస్టరీ. సూర్యం, సునీత దంపతులు భీమిలిలో గెస్ట్‌హౌస్ ప్రారంభిస్తారు. అందులో సైకాలజీ లెక్చరర్ సుకుమార్, రిటైర్డ్ జడ్జి జగన్నాథం, రిటైర్డ్ ఆర్మీ మేజర్ మిత్రకాంత్, బిజినెస్‌మ్యాన్ చక్రధర్ రూములు అద్దెకు తీసుకుంటారు. అంతకుముందు రోజు రాత్రి విశాఖపట్టణంలో దుర్గమ్మ అనే మహిళ దారుణంగా హత్యకు గురైనట్లు టీవీ న్యూస్‌లో వారు తెలుసుకుంటారు. ఆ హత్యకు, గెస్ట్‌హౌస్‌కు సంబంధం ఉందంటూ స్థానిక సీఐ గిరిధర్ విచారణ చేసేందుకు వస్తారు. దర్యాప్తు జరుగుతుండగానే జగన్నాథం హత్యకు గురవుతారు. ఈ హత్యలకు కారణం ఏమిటి..?, హంతకులు ఒకరా..ఇద్దరా..? హంతకుడు పట్టబడతాడా లేదా ..? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ నాటిక సాగుతుంది. ఈ నాటికకు రచన డీఏ సుబ్రహ్మణ్యశర్మ, దర్శకత్వం ఉప్పలూరి సుబ్బరాయశర్మ వహించారు. పాత్రదారులు ఏకే శ్రీదేవి, నిట్టల శ్రీరామ్మూర్తి, ఆర్. ప్రేమ్‌సాగర్, సతీష్‌కుమార్, చిట్టా శంకర్, పి. సుబ్బారావు, పుండరీక శర్మ, జానకీనాథ్, మల్లికార్జున నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధమే ‘రుణానుబంధ రూపేణా’ అనంతపురం లలిత కళాపరిషత్ వారి ‘రుణానుబంధరూపేణా’ నాటిక కుటుంబ బాంధవ్యాలను కళ్లకు కడుతుంది. కథలోకి వెళ్తే మధ్యతరగతికి చెందిన రంగనాథం కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తాడు. ఆయన భార్య తులసి అర్దంతరంగా మరణిస్తుంది. ఇదే సమయంలో కోడలు భేషజాలకు పోయి రంగనాథాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. కోడలు పట్ల కొడుకు నిర్లక్ష్యంతో చివరకు ఆయన వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓసారి రంగనాథం కుమారుని కిడ్నీలు పాడై అసహాయస్థితిలో ఆసుపత్రిలో ఉంటాడు. అతనికి తెలియకుండానే తండ్రి వైద్యుని సహాయంతో కిడ్నీలు దానం చేసి ప్రాణం నిలబెడతాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని తెలుసుకున్న కుమారుడు ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. కోడలు కూడా తన తప్పును తెలుసుకుని రంగనాథాన్ని వృద్ధాశ్రమం నుంచి ఇంటికి రమ్మని కోరుతుంది. కానీ తనకు ఇంటికన్నా వృద్ధాశ్రమంలోనే చాలా అవసరం ఉందని తిరస్కరించి వెళ్లిపోతాడు. ఈ నాటికకు రచన సి. రాము, దర్శకత్వం డి. మస్తాన్‌సాహెబ్. అనుబంధాలే ముఖ్యమని చెప్పే ‘పంపకాలు’ మీకోసమే వారి ‘పంపకాలు’ అనే సాంఘిక నాటిక అన్నదమ్ములు ఆస్తి పంపకాల ఇతివృత్తం గురించి ప్రదర్శించారు. పట్నంలో ఉద్యోగం చేస్తున్న ప్రభాకర్ తన పొలాన్ని భాగం వేయించుకుని, దాన్ని అమ్మి పట్నంలో ఇళ్లు కొందామని సొంతూరు బయలుదేరతాడు. ఇంటికి వెళ్లేసరికి తండ్రి, అన్నయ్య ఇంట్లో ఉండరు. విషయాన్ని ప్రభాకర్ తన వదినతో ప్రస్తావిస్తాడు. వారి మధ్య పిల్లల చదువులు, పెంపకం ప్రస్తావనకు వస్తాయి. ‘పొలాన్ని పంచడమంటే శరీర భాగాలను పంచినట్లే’ అని వదిన చెబుతుంది. తర్వాత అన్న రాఘవ తమ్మునిపై ప్రేమతో పంపకాలు ఏమీ ఉండవు ఆస్తి అంతా నువ్వే అనుభవించు అని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. పెద్దకుమారుని వెంటే తండ్రి కూడా వెళ్లిపోతుండటంతో ప్రభాకర్‌కు జ్ఞానోదయం అవుతుంది. ఆస్తి పంపకాల కంటే అనుబంధాలే ముఖ్యమని గ్రహించడంతో కథ సుఖాంతం అవుతుంది. కుటుంబంలో జరిగే ఇలాంటి సంఘటనలను ఎంతో హృద్యంగా ప్రదర్శించారు. రచన డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం ఎంఎస్కె ప్రభు. పాత్రదారులు ఎంఎస్కె ప్రభు, డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, రవికుమార్, హసీనాజాన్ నటించారు. నేటి నాటికలు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ వాసవి డ్రమెటిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ‘విముక్త’, ఉదయం 10.30 గంటలకు శ్రీ కృష్ణతెలుగు థియేటర్ ఆర్ట్స్ వారి ‘ఇంకెంత దూరం’, మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ట్ ఫామ్ క్రియేషన్స్ వారి ‘ఓ కాశీ వాసి రావయ్యా’, సాయంత్రం 4.30 గంటలకు లలిత కళా సమితి వారి ‘నిష్క్రమణ’, రాత్రి 7 గంటలకు కళావర్షిణి వారి ‘ఊహాజీవులు’, రాత్రి 8.30 గంటలకు గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ వారి ‘రచ్చబండ’ సాంఘిక నాటికలు ప్రదర్శితమవుతాయి. -
బాలలు.. భళా!
- నంది నాటకోత్సవాల్లో అలరించిన బాలలు - ఆలోచింపజేసిన బాలల నాటికలు కర్నూలు(హాస్పిటల్): నందినాటకోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు జరిగిన బాలల నాటికలు పిల్లలు, పెద్దలను ఆలోచింపజేశాయి. పిల్లల అభిప్రాయాలను తెలుసుకోకుండా వారిపై చదువును రుద్దే పెద్దల గురించి బంగారు కొండ, బాలకార్మికుల ఇతివృత్తాన్ని తెలిపే పసిమొగ్గలు, చెట్ల పరిరక్షణతో ప్రయోజనాలు, నిర్మూలించడం వల్ల నష్టాలపై వృక్షో రక్షతి రక్షితః అనే నాటికలు ఆకట్టుకున్నాయి. పాఠశాల, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎంతో హృద్యంగా నాటికల్లో నటించి చూపించారు. పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవాలని చెప్పే బంగారుకొండ.. కడప జిల్లా నందలూరులోని అమరావతి సొసైటీ ఆఫ్ కల్చరల్ ఆర్ట్స్ వారి బంగారు కొండ బాలల సాంఘిక నాటిక ఇటు పిల్లలు, అటు పెద్దలను అలరించింది. నేటి సమాజం, కుటుంబాలు, తల్లిదండ్రులు, పిల్లల అభీష్టాలు, ప్రవర్తనలను ఈ నాటిక ప్రతిబింబించింది. బిడ్డల అభిప్రాయాలు, ఆసక్తిని తెలుసుకోకుండా వారిని ఉన్నతంగా తీర్చిదిద్ది లక్షలు ఆర్జించాలనే తల్లిదండ్రుల నటన ఆకట్టుకుంటుంది. బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం తండ్రి అవినీతికి పాల్పడటం, తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక కుమారుడు అనుభవించిన మానసికక్షోభను కళ్లకు కట్టినట్లు చూపించారు. తల్లిదండ్రులుగా ఎస్. రమ్యశ్రీ, ఎ. సాయిప్రణయ్, కుమారునిగా బి. ఉమర్ ఫరూక్ నటించారు. రచన బీఎం బాషా, దర్శకత్వం బి.సాయిసందీప్, దృశ్యబంధం ఎం. వెంకటేష్, మేకప్ హిమకుమార్, సంగీతం పీడీఆర్ ప్రసాద్ అందించారు. బాలకార్మిక ఇతివృత్తం ‘పసిమొగ్గలు’ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం హాజిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నటించిన ‘పసిమొగ్గలు’ నాటిక బాలకార్మిక వ్యవస్థను కళ్లకు కట్టింది. పసితనంలోనే పనుల్లో పెట్టుకుని బాలలను చదువుకు దూరం చేయకూడదనేది ఇతివృత్తం. పత్తిపొలంలో పనిచేసే పిల్లలు అక్కడి ఘాటైన రసాయనిక మందులతో ఏ విధంగా చనిపోతున్నారో చూపించారు. దేవీ రచించిన ఈ నాటికకు టీవీ రంగయ్య దర్శకత్వం వహించారు. పాత్రదారులుగా సుజాత, నవీన్, మౌనిక, నందిని, భారతి, అక్షయ్, సాయిక్రిష్ణ నటించారు. చెట్ల ఉపయోగాలను తెలిపే ‘వృక్షో రక్షతి రక్షితః’ మనిషి అవివేకంతో వృక్షాలను నాశనం చేస్తున్న క్రమంలో వనదేవత మానవుని చర్యలకు బాధపడి అనాదిగా తాను పడిన ఆవేదనను మూడు ఘటనల ద్వారా తెలియజేయడమే ‘వృక్షో రక్షతి రక్షితః’ నాటిక సారాంశం. నాటకాన్ని అనంతపురం ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రణగ్య, పల్లవి, గిరీష్, సుశీల, కావ్యశ్రీ, దివ్యశ్రీ, శృతి, శిరీష ప్రదర్శించారు. రచన, దర్శకత్వం ఆముదాల సుబ్రహ్మణ్యం. నేటి నాటికలు ఉదయం 10.30 గంటలకు శ్రీ మల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ‘పవిత్ర భారతదేశం’, మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారి ‘సత్య స్వరాలు’, మధ్యాహ్నం 2 గంటలకు పాలేమ్ జెడ్పీహెచ్ఎస్ వారి ‘స్ఫూర్తి’ బాలల నాటిక, మధ్యాహ్నం 3.30 గంటలకు నాగర్‌కర్నూలు వారి ‘స్వయంకృతం’ బాలల నాటిక’ ఉంటాయని ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. -
సమాజపు దృశ్య కావ్యాలు..‘నంది’ నాటకాలు
కర్నూలు(కల్చరల్) : ప్రస్తుత సమాజంలో కొనసాగుతున్న అనేకానేక దురాచారాలు, దురాగతాలు, వాటిపై తిరుగుబాట్లు, పరిష్కారాలు, గుణపాఠాలు... వీటన్నింటికీ దృశ్య కావ్యాలుగా నంది నాటకాలు నిలిచాయి. కుటుంబం, సమాజంలో దిగజారిపోతున్న విలువలు... పతనమవుతున్న మానవతా దృక్పథం... అత్యున్నత విలువల వైపు పయనించవలసిన ఆవశ్యకత... తెలియజేస్తూ నంది నాటకాల ప్రదర్శన జరిగింది. నంది నాటకోత్సవాల్లో భాగంగా మూడో రోజున స్థానిక టీజీవి కళాక్షేత్రంలో ఐదు నాటికలను ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు జస్ట్ స్మైల్ తిరుపతి నాటక సమాజం ప్రదర్శించిన ‘మానవ బ్రహ్మ’ సాంఘిక నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి కుటుంబం పుత్రుడు కావాలనే ఆరాటపడటం, ఆ పుత్రుడు తమ ఆశయాలకు అనుగుణంగా ఎదగకపోతే ఆవేదన చెందడం, ఇదీ నడుస్తున్న చరిత్ర. మానవ బ్రహ్మ నాటిక ఈ నడుస్తున్న చరిత్రకు దర్పణం పడుతూ ప్రతి తండ్రీ ఒక బ్రహ్మలాంటివాడని, పుత్రులను ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు తండ్రులు బ్రహ్మలా వ్యవహరించాల్సిన అవసరముందని ఈ నాటిక తెలియజేసింది. ఈ నాటకాన్ని పల్లేటి లక్ష్మీకులశేఖర్ రచించగా డాక్టర్ జె.రవీంద్ర దర్శకత్వం వహించారు. భారతీయ సంస్కృతి ఔన్నత్యం చాటిన కృష్ణబిలం... కళాంజలి హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన కృష్ణబిలం నాటిక భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యాన్ని, ఔదార్యాన్ని చాటిచెప్పింది. కృష్ణబిలం అంటే బయటినుంచి వచ్చే ఏ పదార్థాన్నైనా రెట్టింపు వేగంతో విసిరివేయడం, అంతర్గత పదార్థానికి రక్షణ ఇవ్వడం. సరిగ్గా భారతీయ సంస్కృతిలో ఈ లక్షణాలే నిబిడీకృతమై ఉన్నాయని ఈ నాటిక చాటిచెప్పింది. విదేశీ సంస్కృతిలో మానవ సంబంధాలు పలుచగా ఉంటూ తల్లిదండ్రులు, బిడ్డలకు మధ్య ప్రేమాభిమానాల స్థానంలో అగాథాలు ఏర్పడతాయి. కానీ భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఒక విడదీయరాని అనుబంధం ఉంటుంది కానీ అపారమైన ఎడబాటు ఉండదు. ఈ విలువలను కాపాడు కోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పిన ఈ నాటికకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఆకురాతి భాస్కరచంద్ర రచించారు. సనాతన విలువలకు ప్రతీకగా ‘నాయకురాలు నాగమ్మ’... సత్కళాభారతి హైదరబాద్ నాటక సమాజం ప్రదర్శించిన ‘నాయకురాలు నాగమ్మ’ నాటిక పురుషాధిక్యతను ఎదుర్కొన్న తీరుతెన్నులను ప్రదర్శించింది. కరీంనగర్ జిల్లా ఆర్వేలి గ్రామంలో పుట్టిపెరిగిన ఒక స్త్రీమూర్తి యదార్థగాథకు నాటకీయ రూపమే ఈ నాటిక. నాయకురాలు నాగమ్మ అపారమైన మేధస్సుతో పురుషులకు దీటుగా నడిపిన రాజకీయ మంత్రాంగం ఇప్పటికీ ఆదర్శప్రాయం. నాగమ్మ కథను కళ్లకు కట్టినట్లుగా చిత్రించిన ఈ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్.ఎస్.నారాయణబాబు రచించిన ఈ నాటకానికి డాక్టర్ కోట్ల హనుమంతరావు దర్శకత్వం వహించారు. కనువిప్పు కల్గించిన నాటిక ‘చట్టానికి కళ్లున్నాయి’... రసరంజని మేకా ఆర్ట్స్ హైదరబాద్ నాటిక సమాజం ప్రదర్శించిన ‘చట్టానికి కళ్లున్నాయి’ నాటిక కనువిప్పు కల్గించే దృశ్యాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వెంగళరెడ్డి అనే ఫ్యాక్షనిస్టు జైలులో ఉన్నా తన అనుచరులతో తన దుర్మార్గాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తుండగా ఒక కార్యాలయంలోని ఉద్యోగి తిరుగుబాటు చేసి చట్టానికి కళ్లున్నాయని నిరూపించిన ఇతివృత్తమే ఈ నాటిక. ఫ్యాక్షనిస్టులు అధికారులను లోబరచుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక ఉద్యోగి దానిని తుదముట్టించేందుకు సిద్ధమవుతాడని ఈ నాటిక చాటిచెప్పింది. ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ మేకా రామకృష్ణ ఈ నాటకానికి రచన, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. చక్కని సందేశాత్మక నాటిక ‘ఖాళీలు పూరించండి’... కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వైజాగ్ నాటక సమాజం ప్రదర్శించిన ‘ఖాళీలు పూరించండి’ నాటిక ప్రస్తుత సమాజంలో పౌరులు నేరస్తుల గురించి సమాచారం పోలీసులకు చేరవేయకుండా తమకు తామే శిక్ష విధించుకుంటున్నారని తెలియజేసింది. మోహన్, విశ్వం, మాయ, బాబా పాత్రల మధ్య జరిగిన సన్నివేశాలు అత్యంత ఉత్కంఠతను కల్గించాయి. నేరస్తులను పోలీసులకు పట్టించడం, శిక్ష పడేటట్లు చేయడం పౌరులు అలవర్చుకోవాలనే సందేశాన్ని ఈ నాటిక అందించింది. ఉదయ్ భాగవతుల ఈ నాటిక రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. -
రెండో రోజు నంది ఉత్సవం
-
సందేశాత్మకం..ఆ‘నంది’ ఉత్సవం
- సమకాలీన సమస్యలకు అద్దం పట్టిన నాటకాలు - రెండో రోజు నాలుగు నాటక ప్రదర్శనలు కర్నూలు (కల్చరల్): రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం.. సందేశాత్మక నాటకాలను ప్రదర్శించారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నాటక ప్రదర్శనలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై మనుషుల మధ్య మమతానురాగాలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రదర్శించిన నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గురువారం ఉదయం మంచ్ థియేటర్ హైదరాబాద్ నాటక సమాజం వారు ప్రదర్శించిన ‘చాయ్ ఏది బే’ నాటకం తెలంగాణ మాండలికంలో సాగింది. ఒక కుటుంబ సమస్య ఊరి సమస్యగా మారినప్పుడు..అందరికీ అనుకూలుడైన చాయ్‌వాలా దానికి పరిష్కారం చూపడమే ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. శ్రీకాంత్ బాణాల రచించి దర్శకత్వం వహించిన ఈ నాటకంలో సంభాషణలు ప్రేక్షకులను ఉత్తేజపరిచాయి. మీ కోసం... హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన ‘ఫోమో’ సాంఘిక నాటకం ఆధునిక తరం, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు ఉపయోగిస్తూ మానవీయ సంబంధాలను ఎలా మంటగలుపుతుందో తెలియజేస్తుంది. డా.శ్రీనివాసరావు రచించిన ఈ నాటకానికి ఎంఎస్కే ప్రభు దర్శకత్వం వహించారు. కుటుంబ ప్రాధాన్యం తెలిపిన ‘ఈ లెక్క.. ఇంతే’ చైతన్య కళా భారతి కరీంనగర్ నాటక సమాజం ప్రదర్శించిన ఈ లెక్క ఇంతే నాటిక కుటుంబవ్యవస్థ మరింత పటిష్టంగా ఏర్పాడాలనే ఆవశ్యకతను తెలియజేస్తుంది. కుటుంబాలు బాగుంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందనే సందేశాన్ని అందించింది. కుటుంబంలోని వారు బలహీనతలకు బానిసై బాధ్యతారాహిత్యంగా మారితే ఆ కుటుంబం అస్తవ్యస్తమవుతుందని ఈ నాటిక సందేశం అందించింది. మంచాల రమేష్ రచించిన ఈ నాటకానికి పరమాత్మ దర్శకత్వం వహించారు. సందేశాత్మక నాటిక ‘జారుడు మెట్లు’ కళాంజలి హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన జారుడు మెట్లు నాటకం చక్కని సామాజిక సందేశాన్ని అందించింది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పాలకులు ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చి తమ పబ్బం గడుపుకుంటున్న తీరు తెన్నులకు ఈ నాటిక దర్పణం పట్టింది. నాయకులు అనునిత్యం బంధుప్రీతితో, స్వార్థంతో తన సొంతానికి, తన వాళ్లకు సేవ చేసుకోవడం తప్ప ప్రజలకు ప్రయోజనకరమయ్యే పనులు చేపట్టకపోవడంతో ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతుందని ఈ నాటిక దృశ్య రూపంలో తెలియజేసింది. కంచర్ల సూర్యప్రకాష్ రచించిన ఈ నాటకానికి కొల్ల రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. రెండు నాటక ప్రదర్శనలు రద్దు నంది నాటకోత్సవాలల్లో భాగంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8.30 గంటల వరకు ఆరు నాటకాలు ప్రదర్శించ వలసి ఉంది. అయితే పాప్‌కార్న్ థియేటర్ వారి దావత్ నాటిక, స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారు హిమం నాటికలు రద్దు అయ్యాయి. ఈ నాటక సమాజాల కళాకారులు ప్రదర్శన కోసం రాకపోవడంతో ఈ రెండు నాటికలు రద్దు అయ్యాయని ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులకు భోజన ఏర్పాట్లు కల్పించినట్లు నాటకోత్సవాల కన్వీనర్ ఆర్డీఓ రఘుబాబు, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. -
నాటకం...జీవన ప్రతిబింబం
–రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు(హాస్పిటల్): మానవ జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలోనే రాష్ట్రస్థాయి నంది నాటక పోటీలు కర్నూలులో నిర్వహించాల్సి ఉన్నా అప్పుడు సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర కోస్తాలో విజయనగరం, దక్షిణ కోస్తాలో గుంటూరు, రాయలసీమలో కర్నూలు కేంద్రంగా ఈ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. కళాకారులను ప్రోత్సహించే ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయని చరిత్ర చెబుతుందన్నారు. రాయలసీమ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక కళలను, కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు. హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద కళాకారులకు కర్నూలులో 10వేల గృహాలను నిర్మిస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజున నాటకోత్సవాలను ప్రారంభించం అభినందనీయమని ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో 276 బృందాలు పాల్గొంటున్నాయన్నారు. కళాకారులకు ఇస్కాన్ సంస్థ సహాయంతో భోజనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, మార్కెట్ యార్డు చైర్పర్సన్ శమంతకమణి, ఆర్డీవో రఘుబాబు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, నాటకోత్సవాల నిర్వాహకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చప్పగా సాగిన నాటకోత్సవాలు రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలకు సరైన ప్రచారం లేకపోవడంతో బుధవారం ప్రేక్షకులు లేక చప్పగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు ప్రచారం లేకపోవడంతో కళలపై అభిమానం ఉన్న వారు రాలేకపోయారన్న వాదన వినిపించింది. సాక్షాత్తూ వేదికపై ఉన్న వారు సైతం నాటకాలకు జనం లేకపోవడాన్ని తప్పుబట్టారు. ఆలోచింపజేసిన నాటికలు.. నంది నాటకోత్సవాల్లో భాగంగా స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన సాంఘిక నాటికలు ఆలోచింపజేశాయి. సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలపై ఈ నాటికలను తమ కోణాన్ని చూపాయి. దురాచారాల వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులు, ఫలితం గురించి వివరించాయి. మొదటిరోజు ఐదు నాటికలకు గాను నాలుగు మాత్రమే జరిగాయి. కళాకారులు రాకపోవడంతో బ్రతికించండి అనే సాంఘిక నాటికను రద్దు చేశారు. వరకట్న దురాచారంపై బాపూజీ స్కౌట్ గ్రూప్ వారి ‘ఆశా–కిరణ్’ అనే సాంఘిక నాటిక ఆలోచింపజేసింది. అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారు చివరికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే అంశంపై శ్రీ మురళి కళానిలయం ఆధ్వర్యంలో ‘అం అః–కం కః’ అనే సాంఘిక నాటకం నవ్వుల పువ్వులు పూయించింది. సినీ నటుడు జెన్నీఫర్ ఈ నాటికలో నటించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ‘అగ్నిపరీక్ష’ అనే సాంఘిక నాటకం..మంచి సందేశాన్ని ఇచ్చింది. బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను మరిచిపోయే వారు.. చివరికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే అంశంపై ప్రభు ఆర్ట్స్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ‘ఐదో దిక్కు’ అనే సాంఘిక నాటకం ప్రదర్శించారు. -
కర్నూలులో నందుల పండుగ
– నేటి నుంచి రాష్ట్రస్థాయి నందినాటకోత్సవాలు – ఫిబ్రవరి 2 వరకు నాటక ప్రదర్శనలు – సినీ మాటల రచయిత దివాకర్‌బాబు, నటుడు కోటశంకర్‌రావు హాజరు – పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, బాల నాటికల ప్రదర్శనలు కర్నూలు(కల్చరల్): రంగస్థలంపై నంది నాటకానికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోని వివిధ నాటక సమాజాలు పలు సాంఘిక, పద్యనాటకాలు ప్రదర్శించవచ్చు. కాని ఒక నాటకం నంది నాటక పోటీలకు ఎంపిక కావడం, ఆ పోటీలలో విజేతగా నిలవడాన్ని రంగస్థల నటులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. రంగస్థలంపై సరికొత్త సొగసులొలికే ఆహార్యపు సౌందర్యం.. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు.. రోమాలు నిక్క బొడ్చుకునే ఉత్కంఠ భరితమైన దృశ్యాలు.. కనువిప్పు కల్గించే సంభాషణలు.. సురభివారి సాంకేతిక తరం గురించిన అద్భుతాలు.. మొత్తంగా కర్నూలు నగరంలో పదునైదు రోజుల పాటు నందుల పండుగ జరగనున్నది. ప్రేక్షకులకు వీనుల విందు కనుల విందు కల్గించే ఈ నందుల పండుగ కర్నూలు నగరానికి తొలిసారిగా తరలి వచ్చింది. గతంలో 2010లో నంద్యాల టౌన్ హాల్ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు జరిగాయి. 2017 ప్రారంభంలో కర్నూలు నగరానికి నందినాటకాల పండుగ తరలి రావడంతో నాటకాభిమానులు గుండెల్లో ఆనందం ఉప్పొంగుతోంది. టీజీవీ కళాక్షేత్రం వేదిక: స్థానిక సీ.క్యాంపు సెంటర్లోని టీజీవీ కళాక్షేత్రంలో బుధవారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాల ప్రారంభోత్సవం జరగనున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టివి నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ నంది నాటకోత్సవాలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, శాసన మండలి చైర్మెన్ చక్రపాణియాదవ్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తదితర ప్రజాప్రతినిధులు అతిధులుగా హాజరవుతున్నారు. మొదటి రోజు: ఉదయం 10.30 నిమిషాలకు బాపూజీ స్కౌట్ గ్రూపు వారి ‘ఆశాకిరణ్’ సాంఘిక నాటక, 12 గంటలకు మురళీ కళా నిలయం ఆరి అం అః..కం కః సాంఘిక నాటిక, మధ్యాహ్నం 2 గంటలకు చైతన్య కళాభారతి వారి ‘అగ్నిపరీక్ష’ నాటిక సాయంత్రం 4.30 గంటలకు ప్రభు ఆర్ట్స్ వారి ‘ఐదో దిక్కు’ సాంఘిక నాటిక, సాయంత్రం 6 గంటలకు గణేష్ నికేతన్ వారి ‘బతికించండి’ సాంఘిక నాటిక ప్రదర్శించనున్నారని ఎఫ్‌డీఎస్ మేనేజర్ శ్రీనివాసరావు లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. 15 రోజుల్లో 76 నాటక ప్రదర్శనలు: నంది నాటకోత్సవాల్లో భాగంగా 25 పద్య నాటకాలు, 11 సాంఘిక నాటకాలు, 27 నాటికలు, 9 బాలల నాటికలు, 4 కళాశాల విద్యార్థులు, నాటికలు ప్రదర్శించనున్నారు. పద్యనాటక ప్రదర్శనకు రూ.30 వేలు, సాంఘిక నాటక ప్రదర్శనకు రూ.20 వేలు, బాలల నాటికలు, కళా విద్యార్థుల నాటికలకు రూ.15 వేల చొప్పున ప్రదర్శనా పారితోషకాన్ని ఆయా నాటక సమాజాలకు అందిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే ఈ నాటకోత్సవాలలో రాష్ట్ర వ్యాప్తంగా 1335 మంది సినీ, టీవీ, రంగస్థల నటీనటులు పాల్గొంటున్నారు. నంది నాటకోత్సవాలలో జరిగే నాటక ప్రదర్శనల్లో ప్రముఖ సినీ మాటల రచయిత (యమలీల ఫేం) దివాకర్‌బాబు, నటుడు కోట శంకర్రావు, టీవీ నటుడు మేకా రామకృష్ణ, సురభి ప్రభావతి తదితరులు పాల్గొననున్నారు. కర్నూలు లలిత కళా సమితి రూపొందించిన పద్యనాటకం ప్రమీలార్జన పరిణయం ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం ప్రదర్శించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల వరకు జరిగే ఈ నంది నాటకోత్సవాల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఎఫ్డీసీ అధికారులు తెలిపారు. -
రేపటి నుంచి కర్నూలులో నంది నాటకోత్సవాలు
– జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): నందినాటకోత్సవాలను బుధవారం నుంచి కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో ఫిబ్రవరి 2 వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వీటిని 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభిస్తారని తెలిపారు. నాటకోత్సవాలకు కర్నూలు ఆర్డీఓ రఘుబాబు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. నందినాటకోత్సవాలను అన్ని వర్గాల ప్రజలు తిలకించవచ్చని తెలిపారు. -
18 నుంచి నంది నాటకోత్సవాలు
- విజయవంతానికి ఆర్డీఓ రఘుబాబు పిలుపు - ఉత్సవ సమన్వయ కమిటీల ఏర్పాటు కర్నూలు సీక్యాంప్: ఈ నెల 18నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు ఆర్డీఓ రఘుబాబు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న కళాకారులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణ కోసం మంగళవారం ఆయన తన కార్యాలయంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. నాటకోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ నుంచి కళాకారులు వస్తారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని సమన్వయ కమిటీ సభ్యులకు సూచించారు. సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో 25పద్యనాటకాలు, 11సాంఘిక నాటకాలు, 27సామాజిక నాటకాలు, 9చిన్నపిల్లల నాటకాలు, 4కళాశాల, వర్సిటీ నాటకాలు మొత్తం 76 ప్రదర్శనలుంటాయన్నారు. ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖ డీడీకి విన్నవించామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖాధికారులను కోరామన్నారు. రాష్ట్రంలో విజయనగరం, గుంటూరు, కర్నూలు జిల్లాలో నందినాటకోత్సవాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎఫ్.డీ.సి మేనేజర్ శ్రీనివాసులు, సమాచార శాఖ డీడీ శామ్యూల్సుకుమార్, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, పోలీస్, మెడికల్ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. -
కర్నూలులో నంది నాటకోత్సవాలు
– జనవరి 18 నుండి ప్రారంభం కర్నూలు(కల్చరల్): నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా కర్నూలులో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎస్ఎఫ్డీసీ) జనరల్ మేనేజర్ శేషసాయి తెలిపారు. స్థానిక టీజీవి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నంది నాటకోత్సవాల విశేషాలను తెలిపారు. జనవరి 18, 2017 నుండి రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతానికి కర్నూలు, గుంటూరు ప్రాంతాలను నిర్ణయించామని, మరొక ప్రాంతాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. 2017 జనవరి 18 నుండి కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో పద్యనాటకం, సాంఘిక నాటకం, బాలల నాటకం, యువజన నాటకాలలో పోటీలు ఉంటాయన్నారు. పద్య నాటక ప్రదర్శనకు రూ.30 వేలు, సాంఘిక నాటక ప్రదర్శనకు రూ.20 వేలు.. బాలల, యువజన నాటకాలకు రూ.15 వేల పారితోషికాన్ని అందిస్తామన్నారు. నంది నాటక పోటీలలో పాల్గొనదలచిన నాటక సమాజాలు డిసెంబర్ 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో స్క్రూటినీ కమిటీ ఎంపిక చేసిన నాటకాలనే నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించేవారన్నారు. కానీ ఈ సంవత్సరం నుంచి ఒకసారి ప్రదర్శన చేసిన ఏ నాటకాన్నైనా నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించవచ్చన్నారు. యువజన నాటక పోటీల్లో కళాశాలలు, యూనివర్శిటీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు 16–25 ఏళ్ల లోపు వయస్కులై ఉండాలన్నారు. కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో ఈ పోటీలు నిర్వహించేందుకు కర్నూలు ఆర్డీఓ రఘుబాబును జిల్లా కలెక్టర్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారన్నారు. విలేకరుల సమావేశంలో లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, నంద్యాల కళారాధన అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, రంగస్థల నటుడు ఎస్.ఆర్.ఎస్.ప్రసాద్, ఎం.ఎస్.ప్రసాద్, సురభి శంకర్ పాల్గొన్నారు. -
నల్లగొండ జిల్లాలో వింత
నల్లగొండ జిల్లాలో ఓ వింత జరిగింది. ఆవు కడుపున నంది ఆకారంలో ఉన్న దూడ పుట్టింది. మహాశివరాత్రి రోజునే ఈ వింత చోటుచేసుకోవడంతో స్థానికులు శివలీలల్లో భాగంగానే ఇలా జరిగిందని అనుకుంటున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కోదాడ మండలం అనంతగిరి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. నంది ఆకారంలో ఉన్న దూడ జన్మించిందనే వార్త దావానంలా పాకడంతో ఈ వింతను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
న్యాయ నిర్ణయంలో అన్యాయం
రాజమండ్రి/ రాజమండ్రి కల్చరల్ : నంది నాటకోత్సవాల అనంతరం కొన్ని సమాజాల కళాకారులు న్యాయనిర్ణేతలపై రౌద్రరసాన్ని ప్రదర్శించారు. పక్షపాత ధోరణితో తమ ప్రదర్శనలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఆనం కళాకేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. కళాకేంద్రంలో గత 15 రోజులుగా జరుగుతున్న నంది నాటకోత్సవాల బహుమతులను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చివరిరోజైన శనివారం ప్రకటించారు. అయితే కొన్ని నాటకాలకు అసలు బహుమతులే రాకపోవడం, ఒక్కో నాటకానికి మూడేసి బహుమతులు రావడాన్ని కొన్ని సమాజాల వారు నిరసించారు. న్యాయ నిర్ణయంలోప్రాంతీయ వివక్ష చూపారని ఆరోపించారు. ‘కొమరం భీం, పడగనీడ, ఖుర్బాని, వికసించిన మందారాలు’ ప్రదర్శనలపై పక్షపాత ం చూపారని, తమకు న్యాయం చేయూలని డిమాండ్ చేశారు. ‘కొమరం భీం’కు గతంలో మంచి అవార్డులొచ్చాయని, ఈసారి ఏమీ తెలియనివారిని న్యాయనిర్ణేతలుగా నియమించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. ‘పడగ నీడ’ సాంఘిక నాటికకు అసలు బహుమతులే రాకపోవడం దారుణమని ఆ కళాకారులు ఆవేదన చెందారు. తెలంగాణ కు చెందిన సమాజం ప్రదర్శన కావడంతోనే ‘కొమరం భీం’పై పక్షపాతం చూపారని కొందరు ఆరోపించారు. ‘ఖుర్బాని’ సాంఘిక నాటకం అందరి ప్రశంసలు పొందిందని, దేశభక్తిని చాటి చెప్పిన ఆ నాటకానికి తృతీయ బహుమతి ప్రకటించడం సమంజసం కాదన్నారు. ప్రేక్షకులను ఇందులో భాగస్వాముల్ని చేసి ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కళాకేంద్రం వద్ద ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిన పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నారుు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న బహుమతీ ప్రదానోత్సవ సభావేదిక వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు హాలు బయట గేటువద్దే కూర్చుని ఆందోళన కొనసాగించారు. కాగా తమకు ఏ విభాగంలోనూ కనీసం ఒక్క బహుమతి కూడా రాలేదని ‘వికసించిన మందారాలు’ కళాకారులు ఆవేదన చెందారు. ఒకే సమాజానికి, ఒకే ప్రదర్శనకు రెండేళ్లూ నందులా? ఒకే సంస్థ, ఒకే దర్శకుడి ఆధ్వర్యంలో ప్రదర్శించిన రెండు బాలల సాంఘిక నాటికలను వరుసగా 2013, 2014 సంవత్సరాలకు బంగారు నందులకు ఎంపిక చేయడాన్ని కొందరు తప్పుపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎందరో బాల కళాకారులు ఉత్సాహభరితంగా బాలల సాంఘిక నాటికలలో పాల్గొన్నారు. అరుుతే వైఎస్సార్ జిల్లా, రాజంపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రదర్శించిన ‘మేము సైతం’ 2013 సంవత్సరానికి, అదే సమాజం ప్రదర్శించిన ‘మనో వైకల్యం’ 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల సాంఘిక నాటికలుగా ఎంపికయ్యాయి. రెండింటికీ కె.వి.రంగారావు దర్శకుడు. ఒకే సంస్థకు ఇలా గుత్తగా ఇవ్వడం కాక ఇతర సంస్థలను కూడా ప్రోత్సహించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రాజమహేంద్రికి కళ తెస్తాం
రాజమండ్రి / రాజమండ్రి రూరల్: కళాకారులకు పుట్టిల్లు అయిన రాజమండ్రిని కళాపరంగా తెలుగుదేశంప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంది నాటక బహుమతీ ప్రదానోత్సవం రంగరంగ వైభవంగా శనివారం రాత్రి రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో జరిగింది. ఏపీ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుక ముగింపు అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ 15 రోజులుగా నందినాటకోత్సవాలను కన్నులపండుగగా నిర్వహించారని అభినందించారు. రాజమండ్రిని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికతో ముందుకు వెళతామని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలకు రూ.1400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గత పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించామని, ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలో నిర్వహిస్తామన్నారు. ధవళేశ్వరంలో రూ.10 కోట్లతో కాటన్ మ్యూజియంను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాజమండ్రి, కోనసీమ ప్రాంతాలతో పాటు పాపికొండలు టూరిజానికి అనువైన ప్రాంతాలుగా ఉన్నాయన్నారు. తొలుత చంద్రబాబు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ వెబ్సైట్, నందినాటకోత్సవాల సావనీర్‌ను సీఎం ఆవిష్కరించారు. 2013 సంవత్సరానికి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని జిల్లాకు చెందిన ప్రముఖనటుడు, అభినవ ఆంజనేయ బిరుదాంకితుడు పేపకాయల లక్ష్మణరావుకు అందజేశారు. నందినాటకోత్సవాల్లో పాల్గొని వడదెబ్బతో మృతి చెందిన నటి వాణీబాల తల్లి బడుగు సీతమ్మకు నిర్వాహకులు సమకూర్చిన రూ.లక్షను అందచేశారు. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ విభజన అనంతరం తొలిసారి నందినాటకోత్సవాలు రాజమండ్రిలో నిర్వహించడం ఈ ప్రాంతానికి ఇచ్చిన గౌరవమన్నారు. అద్భుతంగా జరిగిన నాటకాలకు జనం కూడా అత్యధిక సంఖ్యలో హాజరై నాటకరంగానికి ఊపిరి పోశారన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎప్పుడో బ్రిటిష్ వారు పెట్టిన రాజమండ్రి అనే పేరును రాజమహేంద్రవరంగా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణలు మాట్లాడారు. ఎఫ్డీసీ ఎండీ రమణారెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో నంది నాటకోత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఆనం కళాకేంద్రం ఆధునికీకరణకు సహకరించిన రిలయన్స్, ఓఎన్జీసీ, గెయిల్, ఆనం ఎలక్ట్రికల్స్, రాజమండ్రి నగరపాలక సంస్థకు చెందిన ప్రతినిధులకు, నంది నాటకోత్సవాలు నిర్వహించిన కమిటీ సభ్యులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల, దేవినేని ఉమ, నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, పి.పుల్లారావు, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఆప్కాబ్ వైస్ చైర్మన్ వరుపుల రాజా, ప్రముఖ హాస్యనటుడు ఆలీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన సినీ పాటలు కళాకారులతో పాటు జనాన్ని ఉర్రూతలూగించాయి. ఇదిలా ఉండగా నాటకోత్సవాలకు వచ్చిన బాలనటి లక్కీ లక్ష్మి తల్లి భవానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన అంబులెన్స్‌లో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు
తూర్పు గోదావరి: నంది నాటకోత్సవాల నిర్వహణ ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 16 నుంచి 30 వరకు నంది నాటకోత్సవాలనను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలనాటి నటీమణులు, షావుకారు జానకి, కృష్ణకుమారి హాజరు కానున్నారు.