రేపటి నుంచి కర్నూలులో నంది నాటకోత్సవాలు
Published Tue, Jan 17 2017 12:04 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): నందినాటకోత్సవాలను బుధవారం నుంచి కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో ఫిబ్రవరి 2 వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వీటిని 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభిస్తారని తెలిపారు. నాటకోత్సవాలకు కర్నూలు ఆర్‌డీఓ రఘుబాబు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. నందినాటకోత్సవాలను అన్ని వర్గాల ప్రజలు తిలకించవచ్చని తెలిపారు.
Advertisement
Advertisement