సాక్షి, హైదరాబాద్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం వెనుక ఉగ్ర కోణం ఉందంటూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. వెలుగులోకి వస్తున్న వాస్తవాలు, నిషిద్ధిత ఉగ్రవాద సంస్థ ఐ సీస్, ఇస్లామిక్ స్టేట్ (ఖురాసాన్ ప్రావిన్స్) అంతర్జాలం ద్వారా భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆగష్టు 17న కేంద్ర గృహ మంత్రిత్వ శాఖకు ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఫిర్యాదు చేశారు. మారేడుపల్లి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ వేశారు.
సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం ఘటనం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. గత సోమవారం తెల్లవారు జామున ఆలయం వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని యువకుడు గుడి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లాడు. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అనంతరం ఆలయం పైకి ఎక్కి అక్కడ ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసేందుకు యత్నించాడు.
దీనిని గుర్తించిన ఓ వ్యక్తి అతడిని పట్టుకున్నాడు. అంతలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment