muthyalamma
-
ఆలయాలపై దాడులు ఆపకపోతే.. బీజేపీ నేతలు హెచ్చరిక
-
సికింద్రాబాద్‌లో టెన్షన్.. టెన్షన్
రాంగోపాల్‌పేట్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవా లయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచ్చిన సికింద్రాబాద్ బంద్ పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసులపైకి చెప్పు లు, రాళ్లు, కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో నలుగురు యువ కులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగింది. అలాగే ఆందోళనకారులు విసిరిన రాళ్లతో కొంత మంది పోలీసులకు స్వల్ప గాయా లయ్యాయి. ఈ నెల 14న కుమ్మరిగూడ ముత్యా లమ్మ దేవాలయంలో ఓ వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ శనివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవా లయం వద్ద నుంచి వేలాది మంది హిందువులు ర్యాలీగా బయలుదేరారు. ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ఆందోళనకా రులు నినాదాలతో హోరెత్తించారు. కొంతమంది మోండా మార్కెట్ వైపు, మరికొంత మంది కవాడిగూడ వైపు ర్యాలీగా వెళ్లారు. మోండా, ఆల్ఫా హోటల్ మీదుగా ముత్యాలమ్మ దేవాలయం వద్దకు ఆందోళన కారు లు చేరుకున్నారు. వేలాదిమంది ర్యాలీలో పాల్గొ నడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవాల యం పక్కనే మరో వర్గానికి చెందిన ప్రార్థన మందిరం కూడా ఉంది. ఆందోళనకారులు ఆ వైపు వెళ్లేందుకు వస్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకు న్నారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయి చెప్పులు, రాళ్లు, వాటర్ బాటిళ్లు విసరడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఆలయాల రక్షణలో కాంగ్రెస్ విఫలం: ఛుగ్సాక్షి, న్యూఢిల్లీ: హిందూ దేవాలయాలను రక్షించడంలో, భక్తుల మనోభావాలను గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ మండిపడ్డారు. శనివారం సికింద్రాబాద్‌లోని శ్రీ ముత్యాలమ్మ దేవి ఆలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు.కేంద్ర మంత్రుల పరామర్శ కంటోన్మెంట్: లాఠీచార్జిలో గాయపడిన పికెట్‌కు చెందిన గుడిపల్లి వెంకట్‌ను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించేందుకు వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని స్థానిక బీజేపీ నేతలకు సూచించారు. -
ఆ ఘటన వెనుక ఉగ్రకోణం.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం వెనుక ఉగ్ర కోణం ఉందంటూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. వెలుగులోకి వస్తున్న వాస్తవాలు, నిషిద్ధిత ఉగ్రవాద సంస్థ ఐ సీస్, ఇస్లామిక్ స్టేట్ (ఖురాసాన్ ప్రావిన్స్) అంతర్జాలం ద్వారా భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆగష్టు 17న కేంద్ర గృహ మంత్రిత్వ శాఖకు ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఫిర్యాదు చేశారు. మారేడుపల్లి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ వేశారు.సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం ఘటనం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. గత సోమవారం తెల్లవారు జామున ఆలయం వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని యువకుడు గుడి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లాడు. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అనంతరం ఆలయం పైకి ఎక్కి అక్కడ ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసేందుకు యత్నించాడు.దీనిని గుర్తించిన ఓ వ్యక్తి అతడిని పట్టుకున్నాడు. అంతలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. -
ముత్యాలమ్మ గుడి ఘటన.. బండి సంజయ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముత్యాలమ్మ దేవాయాన్ని సందర్శించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై దాడులు చేసే వాళ్లను పిచ్చోళ్లని పోలీసులు ముద్రవేస్తారా?.ఇతర మతాల ఆలయాలను ఆ పిచ్చోళ్లు ఎందుకు దాడి చేయడం లేదు?పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఆలయాలపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు?.మేం స్పందిస్తే.. బీజేపీని ఉగ్రవాదుల పార్టీగా ముద్ర వేస్తారా? తక్షణమే దుండుగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎటువైపు ఉంటారో కాంగ్రెస్ తేల్చుకోవాలని బండి సంజయ్ సూచించారు. -
ఆలయం వద్ద పేలుడు
-
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉన్న చెత్త కుప్పలో పెయింట్ డబ్బాను చెత్త ఎత్తుకునే వ్యక్తి ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అతడు గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి టిన్నర్ డబ్బాగా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. (గ్రేటర్లో తీరొక్క దసరా) -
పరిటాల కుటుంబ దోపిడీకి అడ్డుకట్ట..
ప్రసిద్ధ నసనకోట ముత్యాలమ్మ ఆలయ ఆదాయాన్ని ఆలయ కమిటీ ముసుగులో దోచేశారు. మాజీ మంత్రి పరిటాల కుటుంబ సభ్యుల అధీనంలో పాతికేళ్లు ఆలయ నిర్వహణ కొనసాగింది. భక్తుల నుంచి ముడుపులు, కానుకలతో పాటు ఆలయ గదుల అద్దెలు, దుకాణాల వేలం పాట ద్వారా సమకూరిన ఆదాయాన్ని దిగమింగేశారు. నామమాత్రంగా ఆదాయం చూపుతూ భక్తులు అమ్మవారికి సమర్పించిన అత్యంత విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు చెక్కులు, డీడీల రూపంలోని చందాలను ఎంచక్కా ఇళ్లకు చేర్చుకున్నారు. ఎట్టకేలకు ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి తేవడంతో దోపిyీ కి చెక్ పడింది. రామగిరి: కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ పూజలందుకుంటోంది. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో నసనకోట ఒకటి. ఇక్కడికి జిల్లా వ్యాప్తంగానే కాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ప్రతి ఆది, మంగళ, శుక్ర వారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ముత్యాలమ్మ అమ్మవారికి కానుకల రూపంలో నగదు, చీర, సారెతో పాటు బంగారు, వెండి ఆభరణాలు సమర్పిస్తుంటారు. రూ.లక్షల్లో ఆదాయం ఉంటున్నా రికార్డుల్లో మాత్రం నమోదు కాలేదు. పాతికేళ్లుగా పరిటాల కుటుంబ సభ్యుల అధీనంలోనే కొనసాగుతూ వచ్చింది. చందాలు, కానుకల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి గానీ, నసనకోట గ్రామ అభివృద్ధికి గానీ వినియోగించిన దాఖలాలు లేవు. పాతికేళ్లుగా దోపిడీ.. మహిమాన్విత నసనకోట ముత్యాలమ్మ ఆలయం మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం అధీనంలోనే పాతికేళ్లుగా ఉండేది. పరిటాల అనుచరులు, కుటుంబ సభ్యులే ఆలయ కమిటీ పేరుతో చెలామణి అయ్యేవారు. కమిటీ పేరుతో ఏడాదికి ఒకసారి ఆలయ గదులు, హుండీ, కానుకలు, కొబ్బరి కాయలు, మద్యం విక్రయం తదితర వాటికి వేలం వేసి నామమాత్రపు ఆదాయం చూపేవారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక కానుకలను సమర్పించడానికి వచ్చిన అనేక సందర్భాలలో కమిటీ సభ్యులు ఇంటి వద్దకే పిలిపించుకునే వారు. చెక్కులు, బంగారు, వెండి ఆభరణాలు ఆలయానికి వినియోగిస్తామని నమ్మబలికి భక్తుల నుంచి తీసుకునేవారు. ఆలయ కానుకలు, ఆదాయాన్ని భారీగా దోపిడీ చేస్తున్నారంటూ ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆందోళన చేశారు. భక్తులు అందజేసిన బంగారు ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం కొత్తకోటలో విక్రయిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులే ఆరోపించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు దేవదాయ శాఖ పరిధిలోకి.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చొరవతో నసనకోట ముత్యాలమ్మ ఆలయాన్ని నాలుగు నెలల కిందట దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ పరిటాల అనుచరులే పెత్తనం సాగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి పది రోజులకు సంబంధించిన హుండీ కానుకలను ఈ నెల ఏడో తేదీన లెక్కించారు. అదీ మాఘమాసం.. జంతు బలులు తక్కువ ఇచ్చే సమయంలో రూ.77,343 ఆదాయం వచ్చినట్లు ఈఓ నర్సయ్య తెలిపారు. మిగతా రోజుల్లో హుండీ కానుకల ఆదాయం భారీగా ఉంటుందనేది తేటతెల్లమైంది. దేవదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత పరిటాల కుటుంబ కబంధ హస్తాల చెర నుంచి ముత్యాలమ్మ ఆలయానికి విముక్తి కలిగినట్లయ్యిందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇక నుంచైనా ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు ఆలయ ఆదాయాన్ని వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు. -
పరిటాల కుటుంబానికి షాక్
సాక్షి, రాప్తాడు (అనంతపురం జిల్లా): నసనకోట ముత్యాలమ్మ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. నసనకోట ముత్యాలమ్మ.. ఈ పేరు జిల్లా నలుమూలలకే గాక కర్ణాటక రాష్ట్రంలోనూ వినిపిస్తుంది. కొన్నేళ్లుగా ముత్యాలమ్మ ఆలయం మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. ఆలయ ఈఓగా బీవీ నర్సయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 25 ఏళ్లుగా రూ.కోట్లు కొల్లగొట్టారు గతంలో రామగిరి ప్రాంతంపై నక్సల్స్ ప్రభావం ఉండేది. ఈప్రాంతంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోపాటు, ఒకే కు టుంబానికి చెందిన వారే 25 ఏళ్లుగా మంత్రులు, ఎంఎల్ఏలుగా కొనసా గుతుండడంతో ఈప్రాంతంలో వారి ఆధిపత్యం కొనసాగుతోంది. 1992 నుంచి ఈఆలయం ఇప్పటి వరకు 27 ఏళ్ల కాలం మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యులే ఆలయ కమిటీ చైర్మన్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఏటా ఆలయంలో వేలం పాట, హుండీ, టెంకాయలు, వాహనాల పార్కింగ్, గదుల బాడుగలు, మద్యంవిక్రయం ఏడాదికి రూ.2కోట్ల వరకు ఆదాయం వచ్చేది. భక్తులు అమ్మవారికి చీర, సారెలతోపాటు బంగారు, వెండి ఆభరణాలేకాక అధిక మొత్తం డబ్బులను, చెక్కులను ఆలయ కమిటీ చైర్మన్‌కు స్వయంగా అందజేశారని వైఎస్సార్సీపీ నాయకులు జేష్ట్యరామయ్య, నారాయణరెడ్డి, సూర్యం, హెచ్ఎస్.ముత్యాలు, నాగభూషణం, రామలింగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రామాంజనేయులు తెలిపారు. 19మంది సభ్యులతో ఆలయ కమిటీ ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులుగా తన అనుయానులనే 19 మందిని నియమించుకొని, కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండన్న కొనసాగే వారు. అధికారికంగా రూ.కోటి, రూ.2కోట్లు ఆదాయం చూపిస్తున్నా ఆలయ విరాళాలను కమిటీ సభ్యులకుగానీ, గ్రామస్తులకు తెలియనిచ్చేవారు కాదన్న విమర్శలు ఉన్నాయి. బంగారు,వెండి ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం కొత్తకోటలో విక్రయించేవారని ఆ యా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’లో ‘ముత్యాలమ్మకే శఠగోపం’ శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. అయి నా ఈ ప్రాంతంలో వారి ఆధిపత్యం కొనసాగింది. బందోబస్తుతో హాజరైన ఆలయ ఈఓ. గత ఆలయ కమిటీ సభ్యుల వివరాలను వెంటనే తెలియజేయాలని గదికి అంటించిన నోటీస్ కమిటీని రద్దు చేయాలని పోరాటం ముత్యాలమ్మ ఆలయ కమిటీ పేరుతో కొన్నేళ్లుగా మాజీ మంత్రి కుటుంబ సభ్యులు రూ.కోట్లు దండుకుంటున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గత ఎన్నికల సమయంలో విమర్శించినా అప్పట్లో ఫలితం లేకపోయింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు, దేవదాయశాఖ అధికారుల కు తెలిపినా పట్టించుకునేవారు కారు. ఆలయ దోపిడీపై పోరాటం చేస్తే ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందించింది. రెండు నెలల క్రితం ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి కొచ్చి, ఈఓ గా ఆనంద్‌ను నియమించారు. బాధ్యతలు స్వీక రించకుండా బెదిరించినట్లు విమర్శలు ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి కృషి ముత్యాలమ్మ ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఆలయ ఏఈఓగా బాధ్యతలు స్వీకరించిన బీవీ నర్సయ్య పేర్కొన్నారు. గతంలో కమిటీ సభ్యులు ఒక్కడ కొనసాగుతుండేవారని, ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి రావడంతో గత పాలకులు రికార్డులను బంగారు, నగల వివరాలను తెలియజేయాలని కమిటీ నిర్వహించే గదికి నోటీసులు అతికించినట్లు ఆయన తెలియజేశారు. రామగిరి ఎస్ఐ నాగస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నడుమ ఈఓ బాధ్యతలు స్వీకరించారు. -
నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం
నారనాగేపల్లి (రొద్దం) : మండలంలోని నారనాగేపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ దేవత ముత్యాలమ్మకు నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులను అమ్మవారికి మోసి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి సతీమణి కమలమ్మ, జిల్లా నలమూలల నుంచి పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ముత్యాలమ్మ జాతర కోలాహలం
నెల్లూరు(బృందావనం): వెంగళరావునగర్ సీ బ్లాక్‌లో కొలువైన ముత్యాలమ్మ జాతర ఆదివారం వైభవంగా జరిగింది. అమ్మవారి కలశాలను వాహనాలపై ప్రతిష్టించి నేత్రపర్వంగా ఊరేగించారు. దుర్గాదేవి, మహంకాళి, కాళికాదేవి, ముత్యాలమ్మ, భైరవ, పరశురాముడి ఉత్సవమూర్తులు, 108 టెంకాయలను గుత్తులుగా కట్టి సంప్రదాయంలో భాగంగా వీపులకు ఇనుప కొక్కీలను తగిలించుకొని లాగారు. నృత్యాలు, తార తప్పెట్లు, బాణసంచా, పంబగాళ్ల ఆటపాటలతో ఉత్సవం కనువిందుగా సాగింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేడుకులు జరిగాయి. దేవస్థానం, కార్యక్రమ నిర్వాహకుడు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. వెల్లివిరిసిన భక్తిభావం, దేశభక్తి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ భక్తుడు శరీరమంతా కొక్కీల ఇనుప చట్రాన్ని బిగించి, తన శరీరం నుంచి వెలుపలికి తీసుకొచ్చిన కొక్కీలకు జాతీయపతాకాలను ప్రదర్శిస్తూ ముందుకుసాగారు. మరి కొందరు అమ్మవారి విగ్రహాలను చిన్నిచిన్ని రథాలపై అమర్చి తమ భక్తిభావాన్ని చాటుతూ మువ్వన్నెలతో తీర్చిదిద్ది కనువిందు చేశారు. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. -
కోడిగుడ్లకు ‘టెండర్’
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇతర జిల్లాల్లో లేని నిబంధనలు ఇక్కడ అమలు చేసి కాంట్రాక్టును పెద్దలకు కట్టబెట్టారనే ప్రచారం జరుగుతోంది. వచ్చిన టెండర్లలో అధిక శాతం నిబంధనల మేరకు లేవని అనర్హత వేటు వేయడం ద్వారా కాంట్రాక్టును అయిన వారికి కట్టబెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,400 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 3,165, పట్టణ ప్రాంతాల్లో 369 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటిలో 31,143 మంది గర్భిణిలు, 42,412 మంది బాలింతలు.. 3,07, 889 మంది పిల్లలు నమోదయ్యారు. వీరందరికీ పౌష్టికాహారంతో పాటు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉడకబెట్టిన గుడ్లను అందించాల్సి ఉంది. దీంతో గుడ్ల సరఫరాకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి యేటా టెండర్లు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లకు టెండర్లు పిలిచారు. వీటిని దక్కించుకునేందుకు కర్నూలుతో పాటు విజయవాడ, విశాఖపట్టణం, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి సైతం కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 58 దరఖాస్తులు అమ్ముడవగా.. ఈ నెల 18న జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు సమక్షంలో టెండర్లు నిర్వహించారు. ఇదిలాఉండగా అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేసేందుకు నేషనల్ ఎగ్స్ కోఆపరేటివ్ కమిటీ(ఎన్ఈసీసీ) ధరకు అనుగుణంగా, రవాణా చార్జీలను కలుపుకుని టెండర్లు పిలుస్తారు. అయితే ఈ యేడాది నిబంధనలు మార్చడం విమర్శలకు తావిస్తోంది. ఎన్ఈసీసీ వద్ద రిజిస్టర్ అయి ఉండాలని, గతంలో ప్రభుత్వ శాఖలకు కోడిగుడ్లను సరఫరా చేసిన అనుభవం ఉండాలని, కాంట్రాక్టర్ టర్నోవర్ యేడాదికి రూ.8కోట్లు ఉండాలని కొత్తగా నిబంధనల్లో పేర్కొన్నారు. గత సంవత్సరం గుడ్లను సరఫరా చేసిన వారు కూడా ఈసారి అనర్హతకు గురవడం గమనార్హం. ఇందుకు అనుగుణంగా జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు ఈ టెండర్‌ను దక్కించుకోవడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగా 58 దరఖాస్తుల్లో 30 తిరస్కరణకు గురయ్యాయి. ఉన్న 28లోనూ ఆయా డివిజన్లకు వేసిన వారే మళ్లీ వేయడంతో ఎంత వరకు పాదర్శకత ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో లేని నిబంధనలు ఇక్కడ అమలు చేయడమేమింని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. బడా కాంట్రాక్టర్లకు టెండర్‌ను కట్టబెట్టేందుకే అధికారులు నిబంధనల్లో మార్పు చేశారని వారు విమర్శిస్తున్నారు. కాగా బుధవారం టెండర్లను ఖరారు చేయాల్సిన అధికారులు వివరాలను గోప్యంగా ఉంచారు. టెండర్ ప్రక్రియలో నిబంధనలను కమిటీ సభ్యులంతా కలిసే రూపొందించామని, ఇతర జిల్లాల గురించి తనకు తెలియదని ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ వివరించారు.