ముత్యాలమ్మ గుడి ఘటన.. బండి సంజయ్‌ ఆగ్రహం | Bandi Sanjay Visit Secunderabad Muthyalamma Temple, Comments Goes Viral | Sakshi
Sakshi News home page

ముత్యాలమ్మ గుడి ఘటన.. బండి సంజయ్‌ ఆగ్రహం

Published Mon, Oct 14 2024 9:42 PM | Last Updated on Tue, Oct 15 2024 11:10 AM

Bandi sanjay Visit at Muthyalamma Temple

సాక్షి,హైదరాబాద్‌ : సికింద్రాబాద్​ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముత్యాలమ్మ దేవాయాన్ని సందర్శించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై దాడులు చేసే వాళ్లను పిచ్చోళ్లని పోలీసులు ముద్రవేస్తారా?.ఇతర మతాల ఆలయాలను ఆ పిచ్చోళ్లు ఎందుకు దాడి చేయడం లేదు?

పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఆలయాలపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు?.మేం స్పందిస్తే.. బీజేపీని ఉగ్రవాదుల పార్టీగా ముద్ర వేస్తారా? తక్షణమే దుండుగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎటువైపు ఉంటారో కాంగ్రెస్ తేల్చుకోవాలని బండి సంజయ్‌ సూచించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement