secundearabad
-
HYD: ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్..!
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఊరట కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. ప్యారడైజ్ జంక్షన్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం భూ సేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ కారిడార్ల భూ సేకరణను ప్రభుత్వం ప్రారంభించనుంది. భూ సేకరణ విషయమై డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, సర్వేయర్లతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం(నవంబర్ 19) సమావేశమయ్యారు. కాగా, ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం కంటోన్మెంట్ భూములు అవసరమయ్యాయి.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములివ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం భూములిచ్చేందుకు అంగీకరించడంతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. -
ముత్యాలమ్మ గుడి ఘటన.. బండి సంజయ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముత్యాలమ్మ దేవాయాన్ని సందర్శించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై దాడులు చేసే వాళ్లను పిచ్చోళ్లని పోలీసులు ముద్రవేస్తారా?.ఇతర మతాల ఆలయాలను ఆ పిచ్చోళ్లు ఎందుకు దాడి చేయడం లేదు?పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఆలయాలపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు?.మేం స్పందిస్తే.. బీజేపీని ఉగ్రవాదుల పార్టీగా ముద్ర వేస్తారా? తక్షణమే దుండుగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎటువైపు ఉంటారో కాంగ్రెస్ తేల్చుకోవాలని బండి సంజయ్ సూచించారు. -
HYD: ‘ప్యారడైజ్’ హోటల్లో మంటలు
సాక్షి,హైదరాబాద్: బిర్యానీకి పాపులర్ అయిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్యారడైజ్ హోటల్లో శుక్రవారం(ఆగస్టు23) మంటలు కలకలకం రేపాయి. హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగాయి.వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కొద్ది సేపటికే మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఘటన అనంతరం హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారులు హోటల్‌కు వచ్చి ప్రమాదం ఎలా జరిగిందనేదానిని పరిశీలించారు. -
ఆ రెండు పార్టీల ప్రయత్నాలు ఫలించవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందని, తాము చేసింది చెప్పి ఓట్లడిగేందుకు బీజేపీ దగ్గర ఏమీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ఆ రెండు పార్టీలు చేసే ప్రయత్నాలు ఫలించ బోవని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సాను కూల రాజకీయ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఆదివారం జూబ్లీ హిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సికింద్రా బాద్, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన నాయకులతో ఆయన విడివిడిగా సమీక్ష నిర్వహించారు. పార్టీ అభ్యర్థులు దానం నాగేందర్, కడియం కావ్యలతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, కె.ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్, విజయారెడ్డి, ఫిరోజ్‌ఖాన్, రోహిణ్‌రెడ్డి, ఆదం సంతోష్ తదితరులు హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలి సికింద్రాబాద్ సమీక్షలో భాగంగా రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ గెలిచిందని, ఇప్పుడు కూడా గెలవడం ద్వారా హైదరాబాద్ నగరంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కో రారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికి పరిస్థితిలో మార్పు వచ్చిందని, జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలం పెరిగినందున ఈ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలందరితో కలిసి సమన్వ యంతో ముందుకెళితే గెలుపు కష్టమేమీ కాదని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందని చెప్పేందుకు సికింద్రాబాద్ గెలుపు అవసరమని స్పష్టం చేశారు. వరంగల్ సమీక్ష సందర్భంగా.. సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ఇక్కడి నుంచి బరి లో దింపుతున్నందున అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నాయకులు కష్టపడి పనిచేయాలని, కావ్య గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, బూత్ స్థాయి నుంచి కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయాలని చెప్పారు. నేడు కొడంగల్‌కు సీఎం సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం తన సొంత నియో జకవర్గమైన కొడంగల్‌కు వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని మండలాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత సా యంత్రానికి ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. -
హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ ఘరానా మోసం
-
సికింద్రాబాద్: మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి
సాక్షి, సికింద్రాబాద్: భారీ వర్షం కురిసిన వేళ సికింద్రాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో పడి ఓ చిన్నారి మృతిచెందింది. దీంతో, జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్క్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వివరాల ప్రకారం.. నగరంలోని కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసం చిన్నారి మౌనిక బయటకు వెళ్లింది. ఈ క్రమంలో భారీ వర్షం కారణంగా మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండటంతో చిన్నారి అందులో పడిపోయింది. అనంతరం, పార్క్‌లైన్ దగ్గర మౌనిక మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. కాగా, చిన్నారి ఇలా చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అములుకున్నాయి. ఇక, మ్యాన్‌హోల్ తెరిచిపెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వర్షం కురుస్తుండగా మౌనిక తన అన్నతో కలిసి షాపునకు వెళ్లింది. ఈ క్రమంలో తన అన్న మ్యాన్‌హోల్‌లో పడిపోతుండగా ఆమె.. అతడిని కాపాడింది. ఈ క్రమంలో చిన్నారి మౌనిక పట్టుతప్పి మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని ఆమె.. సోదరుడు వివరిస్తూ కన్నీరుపెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్ట ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ వద్ద భారీగా వరద నీరు చేరుకుంది. తార్నాక చౌరస్తాలో భారీగా వరద నీరు చేరుకుంది. పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Thank you KTR for amazing drainage system. Commendable job done. Watersports are coming to Hyderabad soon. Awaiting Drone shots.#HappeningHyderabad #HyderabadRains pic.twitter.com/EvM4RUKbr6 — Gayathri Bandari (@GayathriBDevi) April 29, 2023 #Massive #Rains In #Hyderabad at 6am in Himayat Nagar... #HyderabadRains pic.twitter.com/qA2hqX8Zag — Sunil Veer (@sunilveer08) April 29, 2023 -
HYD: ముగిసిన ప్రధాని మోదీ పర్యటన
Updates.. ►హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. ►రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆలస్యం ►అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే ►అవినీతిని ముక్త కంఠంతో ఖండించాలి ►ఎంత పెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే ►చట్టపరమైన సంస్థల పనిని అడ్డుకోవద్దు ►కొంత మంది అవినీతి పరులు సుప్రీంను ఆశ్రయించారు ►నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి ►కోర్టు వాళ్లకు షాక్ ఇచ్చింది ►తెలంగాణలో కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి ►నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ►అభివృద్ధి కార్యక్రమాల్లో విఘాతం కలిగించొద్దు ►తెలంగాణలో కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోంది ►తెలంగాణలో కుటుంబం పాలనతో అవినీతి పెరిగింది ►కొందరు వారి స్వలాభం మాత్రమే చూసుకుంటున్నారు ►ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా భారత్‌లో స్థిరంగా అభివృద్ధి ►మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ►రైల్వేల్లో తెలంగాణకు భారీగా నిధులుకేటాయించాం ►తెలంగాణలో హైవే నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాం ►తెలంగాణలో 4 హైవే లైన్లకు శంకుస్థాపన చేశాం ►తెలంగాణలో అభివృద్ధి ఎలా చేయాలన్నది కేంద్రానికి తెలుసు ►సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నాం ►ఏపీ-తెలంగాణు కలుపుతూ మరో వందేభారత్ ట్రైన్ ►హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మెట్రో, ఎంఎంటీఎస్‌లు విస్తరణ ►ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ. 600 కోట్లు కేటాయింపు ►తెలుగులో ప్రసంగం ప్రారంభించి ప్రధాని మోదీ ►అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ఆరంభించిన ప్రధాని ►తెలంగాణ అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కింది ►తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ►తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులయ్యారు ►రిమోట్ ద్వారా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ►బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ►మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగం ►ప్రపంచస్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కేంద్రం సంకల్పించింది. ►తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి. ►భూసేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి. ►తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ రైల్వేను సమూలంగా మార్చారు. ►తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.4400 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ వేదికపై నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగం ►రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్ బడ్జెట్ పెరిగింది ►రాష్ట్ర సహకారం లేకున్నా వందే భారత్ రైలును ప్రారంభించాం ►రూ. 7,864 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి ►తెలంగాణలో జాతీయ రహదారులకు రూ. 1.04లక్షల కోట్లు కేటాయించాం ►తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని లక్ష్యం ►దేశంలో 14 వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తే.. రెండు రైళ్లు తెలంగాణకు బహుమతిగా ఇచ్చారు ►రూ. 714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ ► పరేడ్ గ్రౌండ్స్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ. ► ప్రధాని పర్యటన, ప్రసంగం దృష్ట్యా పరేడ్ గ్రౌండ్స్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ► పరేడ్ గ్రౌండ్స్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ ► పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ. ► దేశంలోనే ఇది 13వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య ఇది ప్రారంభమైన రెండో రైలు ఇది. ► రైల్వేస్టేషన్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న విద్యార్థులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. ► సికింద్రాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన మొట్టమొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డులోకి ఎక్కారు. ► బేగంపేట నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ. ► ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ► ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ ► కాసేపట్లో ప్రధాని మోదీ.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లనున్నారు. ► బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ ► బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై సీఎం కేసీఆర్‌కు కుర్చీను ఏర్పాటు చేశారు. ► అధికారిక పర్యటన కావడంతో వేదికపై ప్రొటోకాల్ ప్రకారం కుర్చీ వేశారు. ► సీఎం కేసీఆర్‌తో పాటుగా మంత్రులు మహమూద్ అలీ, హరీష్‌రావు, తలసాని, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిలకు కుర్చీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం లేదా వాటి శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. https://t.co/3UPLRXhk5k — Narendra Modi (@narendramodi) April 8, 2023 సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి సర్వం సన్నద్ధమైంది. ► ఉదయం 11.30కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పటి నుంచి తిరిగి 1.30 గంటలకు తిరిగి వెళ్లే వరకు ప్రధాని పర్యటించే ప్రాంతాలు, మార్గాల్లో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)తోపాటు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు, పోలీసులు కలిపి ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్న పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌ను అందంగా అలంకరించారు. ► సైనిక అమర వీరుల వార్ మెమోరియల్ పక్కనే ఉన్న పశ్చిమ ప్రధాన ద్వారం నుంచి ప్రధాని నేరుగా సభా వేదిక వద్దకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ► ప్రధాని అధికారిక కార్యక్రమం కావడంతో కేవలం లక్ష మంది మాత్రమే కూర్చునేందుకు వీలుగా 3 ప్రధాన షెడ్లను ఏర్పాటు చేశారు. ► ప్రధాని సభ అధికారిక కార్యక్రమం కావడంతో పరేడ్‌గ్రౌండ్ లోపల పార్టీ నేతల పోస్టర్లకు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్ చుట్టూ రోడ్లు, మెట్రో పిల్లర్లు, భవనాలు అంతటా బీజేపీ నేతలు పోటాపోటీగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు.. బేగంపేట విమానాశ్రయం–సికింద్రాబాద్ స్టేషన్–పరేడ్ గ్రౌండ్స్ మధ్య మార్గాల్లో నిర్ణీత వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జేఈఈ మెయిన్స్, ఎస్సై అభ్యర్థులకు సంబంధించిన పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో చాలా స్కూళ్లు టెన్త్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. ఆంక్షలతో, సభకు వచ్చే వారితో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఉదయం పరీక్ష ప్రారంభ సమయానికి ట్రాఫిక్ డైవర్షన్లు ఉండవని పోలీసులు అధికారులు చెప్తున్నారు. అభ్యర్థులు, విద్యార్థులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మోదీ పర్యటన కార్యక్రమాలు ఇవీ.. - ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు.. 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు.. - 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు. - 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. - మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. - 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు - 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం... - 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్ వీడియోల ప్రదర్శన. - 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం - 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం. -
‘అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు’
సాక్షి, హైదరాబాద్: రామ్‌గోపాల్‌పేట్‌లోని డెక్కన్ మాల్ భవనంలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కాగా, డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో నగరంలో అక్రమ నిర్మాణాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. డెక్కన్ మాల్ భవనంలో కెమికల్స్ వల్ల మంటలు ఆరలేదు. హైదరాబాద్‌లో డెక్కన్ మాల్ వంటి భవనాలు 25వేల వరకు ఉండొచ్చు. అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు. ఇలాంటి కట్టడాల విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీ వేశాము. ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గాలిమాటలు మాట్లాడుతున్నారు. భవనాల క్రమబద్దీకరణపై స్టే ఉందని కిషన్ రెడ్డికి తెలియదా?. గుజరాత్లో కూడా వంతెన కూలి 180 మంది మరణించారు. కిషన్ రెడ్డి లాగా మేము రాజకీయాలు చేశామా?. హైదరాబాద్ అభివృద్ధికి గత ఎనిమిదేళ్లలో 65 వేల కోట్ల రూపాయలు కేటాయించాము. ఇంత అభివృద్ధి గతంలో ఎపుడైనా జరిగిందా?. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదు. బాధితులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వ అధికారులా?. కిషన్ రెడ్డి భాద్యత లేకుండా మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. మా ప్రభుత్వంలో ఒక్క భవనాన్ని కూడా రెగ్యులరైజ్ చేయలేదు. అగ్ని ప్రమాదం కారణంగా పక్కన ఉన్న బస్తీ వాసులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నాము. బాధితులను కాపాడే క్రమంలో అగ్ని మాపక సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కట్టడం నాణ్యతపై నిట్ ఆధ్వర్యంలోని కమిటీ తన నివేదికని త్వరలోనే సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు. -
సికింద్రాబాద్: స్నేహితుడు చేతిలో యువకుడి హత్య
-
రూబీ లాడ్జి: విజయవాడవాసి హరీష్ మృతి.. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరి
సాక్షి, విజయవాడ: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్లో అగ్ని ప్రమాదం కారణంగా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మృతుల్లో విజయవాడకు చెందిన హరీష్ కూడా ఉన్నారు. దీంతో, విజయవాడలో హరీష్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ దురదృష్టకర ఘటనపై హరీష్ కుటుంబ సభ్యులు స్పందించారు. హరీష్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకు ట్రైనింగ్ ఉందని హరీష్ ఆదివారం రాత్రి సికింద్రాబాద్ వెళ్లారు. మూడు రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పారు. ఎంటెక్, ఎంబీఏ చేసిన మొదట కోస్టల్ బ్యాంక్‌లో ఉద్యోగం చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ.. ఎస్వీటీ బ్యాంకులో ఉద్యోగం రావడంతో ట్రైనింగ్ కోసం వెళ్లాడు. నిన్న హరీష్ ఫ్రెండ్ ఫోన్ చేసిన తను ఉన్న హోటల్లో మంటలు వస్తున్నాయని చెప్పాడు. రాత్రంతా మేము టెన్షన్ పడుతుండగా.. తెల్లవారుజామున 3 గంటలకు హరీష్ గాంధీ ఆసుపత్రిలో ఉన్నాడని హైదరాబాద్‌లో ఉన్న తన ఫ్రెండ్ ఫొటో తీసి పంపించాడు. హరీష్‌కు ఇద్దరు పిల్లలున్నారు. చిన్న బాబు.. 10 రోజుల క్రితమే జన్మించాడు. ఇంతలోనే ఇలా జరగడం ఆవేదనకు గురిచేస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు. -
జైలుకు మరో 10 మంది ఆందోళనకారులు
చంచల్‌గూడ: ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన పేరుతో విధ్వంసం సృష్టించిన కేసులో ఆందోళనకారుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 28 మంది ఆందోళనకారులు చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి బుధవారం మరో 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరిలో పృథ్వీ రాథోడ్, బింగి రమేష్, రాజా సురేంద్రకుమార్, దేవోసత్ సంతోష్, ఎండీ సాబేర్, పద్వల్ యోగేష్, బమన్ పరశురాం, పుప్పాల అయ్యప్ప చారీ, పసునూరి శివసుందర్, సురనర్ తుకారామ్ ఉన్నారు. కారుతో మైనర్ బాలుడి బీభత్సం సైదాబాద్: మైనర్ బాలుడు కారుతో బీభత్సం సృష్టించాడు. సైదాబాద్ పోలీసులు తెలిపిన మేరకు..బుధవారం సాయంత్రం చంపాపేట రహదారిపై చింతల్‌బస్తీకి వెళ్లే రహదారిపై ఓ మైనర్ బాలుడు కారును నడుపుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో వేగంగా వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టాడు. అలాగే ముందుకు వెళుతూ అక్కడి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని ఆగిపోయాడు. ఆ సమయంలో అక్క డ ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. (చదవండి: తూటా రూట్ మారెన్) -
రైళ్ల రాకపోకలకు లైన్‌క్లియర్: డీఆర్ఎమ్ గుప్తా
పోలీసుల బలగాల ఎంట్రీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి ఒక్కసారిగి మారిపోయింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్‌లను క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ అయింది. ఈ సందర్బంగా డీఆర్ఎమ్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మరో గంటలో రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఆందోళనకారులు రైల్వే స్టేషన్లో సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు రూ. 7 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. గతంలో ఇలాంటి ఆందోళనలు ఎప్పుడూ జరగలేదు. ఆందోళనల్లో 30 భోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 18 ఎక్స్‌ప్రెస్, 9 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశాము. 15 రైళ్లను దూరప్రాంతాల నుంచి నడుపుతున్నాము. 7 లోకోమోటివ్ ఇంజిన్లు ధ్వంసమయ్యాయి. రైల్వే సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. రెండు లగేజీ, రెండు సాధారణ భోగీలకు ఆందోళనకారులు నిప్పంటించారు. పలు భోగిలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించాము’’ అని స్పష్టం చేశారు. మరోవైపు.. కాసేపట్లో నుంచి మెట్రో రైళ్లు కూడా ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి అయింది. అనంతరం రాకేశ్ డెడ్‌బాడీని స్వస్థలమైన వరంగల్‌కు తరలించారు. -
రైల్వే ‘యూజర్’ బాదుడు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై యూజర్ చార్జీలు చెల్లించాల్సి రానుంది! దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు వెయ్యి స్టేషన్ల (ఏ–1)పునరాభివృద్ధిలో భాగంగా విమానాశ్రయాల తరహాలో ప్రయాణికుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయనున్నట్లు ఇటీవల స్పష్టం చేసిన రైల్వే బోర్డు... ఈ జాబితాలో సికింద్రాబాద్ స్టేషన్‌ను చేర్చింది. అయితే తొలుత ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికే యూజర్ చార్జీలను పరిమితం చేయనుంది. ఫస్ట్ ఏసీ ప్రయాణికులపై రూ. 30 వరకు, సెకండ్, థర్డ్ ఏసీ ప్రయాణికులపై రూ. 30లోపు ఈ చార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సాధారణ బోగీలు, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను యూజర్ చార్జీల నుంచి మినహాయించనున్నారు. ప్రస్తుతం ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ బోగీల ప్రయాణికుల నుంచే చార్జీల వసూలును పరిమితం చేసినప్పటికీ దశలవారీగా స్లీపర్ క్లాస్, ఇతర కేటగిరీలకూ దీన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ తరువాత క్రమంగా నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి స్టేషన్లకు యూజర్ చార్జీలను విస్తరించనున్నారు. వాస్తవానికి గతంలోనే రైల్వే బోర్డు ఈ ప్రతిపాదన చేసినప్పటికీ దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా దీని అమలు వాయిదాపడింది. వేగంగా ప్రైవేటీకరణ.... ► రోజుకు 150 రైళ్లు, 1.85 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేష న్లో వాహనాల పార్కింగ్, టాయిలెట్లు, తాగునీరు, విశ్రాంతి గదుల వంటి సేవలన్నీ పూర్తిగా ప్రైవేటు సంస్థల నిర్వహణలోనే ఉన్నాయి. ► సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి కోసం ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ కరోనా దృష్ట్యా ఇన్వెస్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ ప్రాజెక్టులో ప్రతిష్టంభన నెలకొంది. ► ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్ రీ–డెవలప్మెంట్కు త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఐఆర్ఎస్డీసీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో యూజర్ చార్జీల విధింపు అంశం ముందుకొచ్చింది. రూ. లక్షల్లో ఆదాయం... ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైల్వేకు నిత్యం రూ. 1.65 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. ►ప్రతిరోజూ 80 వరకు నడిచే దూరప్రాంత రైళ్లలో సుమారు 30 వేల మంది ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్నట్లు అంచనా. ►ఏసీ ప్రయాణికులపై సగటున రూ.25 చొప్పున యూజర్ చార్జీలు విధిస్తే రోజుకు రూ.7.5లక్షల ఆదాయం లభించనుంది. ►ప్రయాణికుల సేవల్లో నాణ్యతను పెంచేందుకు యూజర్ చార్జీలను వినియోగించనున్నట్లు అధికారులు చెప్పారు. ►స్టేషన్ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా సుమారు 2.5 ఎకరాల స్థలంలో షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్, హోటల్స్ వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. -
పోరాడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి
బన్సీలాల్‌పేట్: పీడిత కులాలు తమ భాష, సంస్కృతి మూలాలను మర్చిపోకుండా చైతన్యవంతమైన దిశగా ముందుకు సాగాలని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్వర్యంలో సికింద్రాబాద్ బోయిగూడ ముదిరాజ్ సంఘంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ శతాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం అణగారిన వర్గాలు పోరాడితే ప్రభుత్వాలు దిగొస్తాయన్నారు. రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తుల హక్కులతో పాటు వారి అభ్యున్నతి, వికాసానికి కాసాని జ్ఞానేశ్వర్ చేస్తున్న కృషి అమోఘమైనదని కొనియాడారు. క్రిష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలను, ఆదర్శాలను ఆచరణలో సాఫ ల్యం చేయడానికి ముదిరాజ్ మహాసభ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొ న్నారు. ముదిరాజ్‌లను బీసీ ‘డి’ నుంచి ‘ఏ’లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత కోళి సమాజ్ అధ్యక్షుడు, గుజరాత్ ఎమ్మెల్యే కువార్జీ భావాలియా, సుప్రీంకోర్టు న్యాయవాది పాండు, ముదిరాజ్ మహాసభ నాయకులు వెంకటేష్, చెన్నయ్య, ప్రకాష్, సదానంద్, జగదీష్, వీరేష్, సాయి, శారదా, శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సికింద్రాబాద్‌లో బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్ కంపెనీ, కోట్లు హాంఫట్!
-
Gandhi Hospital: హే గాంధీ!
సికింద్రాబాద్: పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయం వంటి గాంధీ ధర్మాస్పత్రిలో ఇరువురు మహిళలపై అఘాయిత్యం జరిగిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన ఒక మహిళ స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఆస్పత్రి ఆవరణలో స్పృహలేకుండా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరో మహిళ ఆచూకీ సోమవారం రాత్రి వరకు లభించలేదు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్ జిల్లా వేపురిగేరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు అటెండెంట్లుగా ఆయన భార్య, మరదలు(భార్య సోదరి) గాంధీ ఆస్పత్రికి వచ్చారు. గాంధీ ఆస్పత్రి ఉద్యోగి అయిన జేఎస్సీ ఉమామహేశ్వర్ రోగికి బంధువు అవుతాడు. ఇంతకాలం ఆస్పత్రి రేడియాలజీ విభాగంలో ఉద్యోగం చేసిన ఉమామహేశ్వర్ ఇటీవలే రిసెప్షన్‌కు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో అటెండెంట్లుగా ఉంటున్న ఇరువురు మహిళలు ఈ నెల 8 నుంచి కనిపించకుండా పోయారు. తన తల్లితో పాటు చిన్నమ్మ కనిపించకపోడంతో రోగి కుమారుడు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. 11న ఆ వ్యక్తి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాడు. ఈ నెల 15న మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆ వ్యక్తి కుమారుడు తమకు బంధువైన ఉమామహేశ్వర్‌తో కలసి గాంధీ పరిసరాల్లో వెతకగా, ఆస్పత్రి భవనం సమీపంలోని చెట్ల పొదల్లో అతడి చిన్నమ్మ స్పృహలేకుండా, వివస్త్రగా కనిపించింది. చిన్నమ్మను తమ గ్రామానికి తీసుకెళ్లి ఆరా తీయగా, ఉమామహేశ్వర్ అతడి స్నేహితులు తనకు, సోదరికి మత్తు కలిపిన మద్యం ఇచ్చి కిడ్నాప్ చేశారని తెలిపింది. ఆస్పత్రిలోని సెల్లార్లో బంధించి తనపై వారు అత్యాచారం చేశారని వెల్లడించింది. తాను తప్పించుకుని బయటపడ్డానని, అయితే తన సోదరి ఎక్కడ ఉందో తెలియట్లేదని మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. గాంధీ ఆస్పత్రి తమ పరిధి కాదని పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి చిలకలగూడ పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. నాలుగు బృందాలు ఏర్పాటు: ఏసీపీ వెంకటరమణ గాంధీ అత్యాచారం ఘటనకు సంబంధించి దర్యాప్తు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్టు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ తెలిపారు. గాంధీలో చికిత్స తీసుకున్న రోగి భార్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. బాధితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించడం కోసం ఆమెను భరోసా కేంద్రానికి పంపించామన్నారు. వివరాలు రాగానే దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తామన్నారు. అత్యాచారం ఘటన గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోనే జరిగిందా లేదా బయట జరిగిందా అన్న విషయాలపై దర్మాప్తు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. పోలీసుల అదుపులో నిందితుడు బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన చిలకలగూడ పోలీసులు నిందితుడిగా భావిస్తున్న గాంధీ ఉద్యోగి ఉమామహేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ ఇన్స్పెక్టర్ నరేశ్, డీఐ సంజయ్‌కుమార్ విచారణ ప్రారంభించారు. బాధితురాలు పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పట్లేదని, విచారణకు సహకరించట్లేదని పోలీసులు చెబుతున్నారు. కనిపించకుండా పోయిన రోగి భార్య ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇరువురు మహిళలకు మద్యం అలవాటు ఉండటాన్ని ఆసరాగా తీసుకుని, ఉమామహేశ్వర్ వారిని కిడ్నాప్ చేసి, బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
హైదరాబాద్ లో భారీ వర్షం
-
హైదరాబాద్ లో భారీ వర్షం
* స్తంభించిన ట్రాఫిక్.. నాలాలో పడి మహిళ మృతి సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభిం చింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. రాత్రి 8.30 గంటల వరకు 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. నాలాలో పడి మహిళ దుర్మరణం... సికింద్రాబాద్ రెతి ఫైల్ బస్‌స్టేషన్ సమీపంలోని ఉప్పల్ బస్టాండ్ వద్దనున్న నాలాలో పడి బుధవారం రాత్రి ఓ మహిళ దుర్మరణం చెందింది. శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన సత్యవాణి(25) కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని బంధువుల ఇంటికి వె ళ్లి వస్తుండగా భారీ వర్షం కురిసింది. ఉప్పల్ బస్‌స్టాప్ వైపు వెళుతుండగా నీటి ఉద్ధృతికి నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. మృతురాలి భర్త సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.