సికింద్రాబాద్‌లో సికింద్రాబాద్–తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Updates..
►హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది.
►రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆలస్యం
►అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే
►అవినీతిని ముక్త కంఠంతో ఖండించాలి
►ఎంత పెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే
►చట్టపరమైన సంస్థల పనిని అడ్డుకోవద్దు
►కొంత మంది అవినీతి పరులు సుప్రీంను ఆశ్రయించారు
►నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి
►కోర్టు వాళ్లకు షాక్ ఇచ్చింది
►తెలంగాణలో కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి
►నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా
►అభివృద్ధి కార్యక్రమాల్లో విఘాతం కలిగించొద్దు
►తెలంగాణలో కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోంది
►తెలంగాణలో కుటుంబం పాలనతో అవినీతి పెరిగింది
►కొందరు వారి స్వలాభం మాత్రమే చూసుకుంటున్నారు
►ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా భారత్‌లో స్థిరంగా అభివృద్ధి
►మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత
►రైల్వేల్లో తెలంగాణకు భారీగా నిధులుకేటాయించాం
►తెలంగాణలో హైవే నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాం
►తెలంగాణలో 4 హైవే లైన్లకు శంకుస్థాపన చేశాం
►తెలంగాణలో అభివృద్ధి ఎలా చేయాలన్నది కేంద్రానికి తెలుసు
►సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నాం
►ఏపీ-తెలంగాణు కలుపుతూ మరో వందేభారత్ ట్రైన్
►హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మెట్రో, ఎంఎంటీఎస్‌లు విస్తరణ
►ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ. 600 కోట్లు కేటాయింపు
►తెలుగులో ప్రసంగం ప్రారంభించి ప్రధాని మోదీ
►అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ఆరంభించిన ప్రధాని
►తెలంగాణ అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కింది
►తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
►తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులయ్యారు
►రిమోట్ ద్వారా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
►బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
►మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగం
►ప్రపంచస్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కేంద్రం సంకల్పించింది.
►తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి.
►భూసేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి.
►తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ రైల్వేను సమూలంగా మార్చారు.
►తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.4400 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
పరేడ్ గ్రౌండ్స్ వేదికపై నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగం
►రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్ బడ్జెట్ పెరిగింది
►రాష్ట్ర సహకారం లేకున్నా వందే భారత్ రైలును ప్రారంభించాం
►రూ. 7,864 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి
►తెలంగాణలో జాతీయ రహదారులకు రూ. 1.04లక్షల కోట్లు కేటాయించాం
►తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని లక్ష్యం
►దేశంలో 14 వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తే.. రెండు రైళ్లు తెలంగాణకు బహుమతిగా ఇచ్చారు
►రూ. 714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ
► పరేడ్ గ్రౌండ్స్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ.
► ప్రధాని పర్యటన, ప్రసంగం దృష్ట్యా పరేడ్ గ్రౌండ్స్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
► పరేడ్ గ్రౌండ్స్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ
► పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.
► దేశంలోనే ఇది 13వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య ఇది ప్రారంభమైన రెండో రైలు ఇది.
► రైల్వేస్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న విద్యార్థులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు.
► సికింద్రాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.
► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన మొట్టమొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డులోకి ఎక్కారు.
► బేగంపేట నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ.
► ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు.
► ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్
► కాసేపట్లో ప్రధాని మోదీ.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లనున్నారు.
► బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
► బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై సీఎం కేసీఆర్‌కు కుర్చీను ఏర్పాటు చేశారు.
► అధికారిక పర్యటన కావడంతో వేదికపై ప్రొటోకాల్ ప్రకారం కుర్చీ వేశారు.
► సీఎం కేసీఆర్‌తో పాటుగా మంత్రులు మహమూద్ అలీ, హరీష్‌రావు, తలసాని, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిలకు కుర్చీలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం లేదా వాటి శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. https://t.co/3UPLRXhk5k
— Narendra Modi (@narendramodi) April 8, 2023
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి సర్వం సన్నద్ధమైంది.
► ఉదయం 11.30కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పటి నుంచి తిరిగి 1.30 గంటలకు తిరిగి వెళ్లే వరకు ప్రధాని పర్యటించే ప్రాంతాలు, మార్గాల్లో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)తోపాటు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు, పోలీసులు కలిపి ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్న పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌ను అందంగా అలంకరించారు.
► సైనిక అమర వీరుల వార్ మెమోరియల్ పక్కనే ఉన్న పశ్చిమ ప్రధాన ద్వారం నుంచి ప్రధాని నేరుగా సభా వేదిక వద్దకు వెళ్లేలా ఏర్పాటు చేశారు.
► ప్రధాని అధికారిక కార్యక్రమం కావడంతో కేవలం లక్ష మంది మాత్రమే కూర్చునేందుకు వీలుగా 3 ప్రధాన షెడ్లను ఏర్పాటు చేశారు.
► ప్రధాని సభ అధికారిక కార్యక్రమం కావడంతో పరేడ్‌గ్రౌండ్ లోపల పార్టీ నేతల పోస్టర్లకు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్ చుట్టూ రోడ్లు, మెట్రో పిల్లర్లు, భవనాలు అంతటా బీజేపీ నేతలు పోటాపోటీగా పోస్టర్లు ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
బేగంపేట విమానాశ్రయం–సికింద్రాబాద్ స్టేషన్–పరేడ్ గ్రౌండ్స్ మధ్య మార్గాల్లో నిర్ణీత వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జేఈఈ మెయిన్స్, ఎస్సై అభ్యర్థులకు సంబంధించిన పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో చాలా స్కూళ్లు టెన్త్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. ఆంక్షలతో, సభకు వచ్చే వారితో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఉదయం పరీక్ష ప్రారంభ సమయానికి ట్రాఫిక్ డైవర్షన్లు ఉండవని పోలీసులు అధికారులు చెప్తున్నారు. అభ్యర్థులు, విద్యార్థులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మోదీ పర్యటన కార్యక్రమాలు ఇవీ..
- ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు.. 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు..
- 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు.
- 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు.
- మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
- 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు
- 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం...
- 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్ వీడియోల ప్రదర్శన.
- 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం
- 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం.
Comments
Please login to add a commentAdd a comment