parede grounds
-
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా మహోత్సవం
-
HYD: ముగిసిన ప్రధాని మోదీ పర్యటన
Updates.. ►హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. ►రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆలస్యం ►అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే ►అవినీతిని ముక్త కంఠంతో ఖండించాలి ►ఎంత పెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే ►చట్టపరమైన సంస్థల పనిని అడ్డుకోవద్దు ►కొంత మంది అవినీతి పరులు సుప్రీంను ఆశ్రయించారు ►నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి ►కోర్టు వాళ్లకు షాక్ ఇచ్చింది ►తెలంగాణలో కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి ►నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ►అభివృద్ధి కార్యక్రమాల్లో విఘాతం కలిగించొద్దు ►తెలంగాణలో కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోంది ►తెలంగాణలో కుటుంబం పాలనతో అవినీతి పెరిగింది ►కొందరు వారి స్వలాభం మాత్రమే చూసుకుంటున్నారు ►ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా భారత్‌లో స్థిరంగా అభివృద్ధి ►మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ►రైల్వేల్లో తెలంగాణకు భారీగా నిధులుకేటాయించాం ►తెలంగాణలో హైవే నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాం ►తెలంగాణలో 4 హైవే లైన్లకు శంకుస్థాపన చేశాం ►తెలంగాణలో అభివృద్ధి ఎలా చేయాలన్నది కేంద్రానికి తెలుసు ►సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నాం ►ఏపీ-తెలంగాణు కలుపుతూ మరో వందేభారత్ ట్రైన్ ►హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మెట్రో, ఎంఎంటీఎస్‌లు విస్తరణ ►ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ. 600 కోట్లు కేటాయింపు ►తెలుగులో ప్రసంగం ప్రారంభించి ప్రధాని మోదీ ►అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ఆరంభించిన ప్రధాని ►తెలంగాణ అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కింది ►తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ►తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులయ్యారు ►రిమోట్ ద్వారా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ►బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ►మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగం ►ప్రపంచస్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కేంద్రం సంకల్పించింది. ►తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి. ►భూసేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి. ►తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ రైల్వేను సమూలంగా మార్చారు. ►తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.4400 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ వేదికపై నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగం ►రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్ బడ్జెట్ పెరిగింది ►రాష్ట్ర సహకారం లేకున్నా వందే భారత్ రైలును ప్రారంభించాం ►రూ. 7,864 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి ►తెలంగాణలో జాతీయ రహదారులకు రూ. 1.04లక్షల కోట్లు కేటాయించాం ►తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని లక్ష్యం ►దేశంలో 14 వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తే.. రెండు రైళ్లు తెలంగాణకు బహుమతిగా ఇచ్చారు ►రూ. 714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ ► పరేడ్ గ్రౌండ్స్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ. ► ప్రధాని పర్యటన, ప్రసంగం దృష్ట్యా పరేడ్ గ్రౌండ్స్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ► పరేడ్ గ్రౌండ్స్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ ► పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ. ► దేశంలోనే ఇది 13వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య ఇది ప్రారంభమైన రెండో రైలు ఇది. ► రైల్వేస్టేషన్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న విద్యార్థులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. ► సికింద్రాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన మొట్టమొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డులోకి ఎక్కారు. ► బేగంపేట నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ. ► ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ► ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ ► కాసేపట్లో ప్రధాని మోదీ.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లనున్నారు. ► బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ ► బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై సీఎం కేసీఆర్‌కు కుర్చీను ఏర్పాటు చేశారు. ► అధికారిక పర్యటన కావడంతో వేదికపై ప్రొటోకాల్ ప్రకారం కుర్చీ వేశారు. ► సీఎం కేసీఆర్‌తో పాటుగా మంత్రులు మహమూద్ అలీ, హరీష్‌రావు, తలసాని, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిలకు కుర్చీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం లేదా వాటి శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. https://t.co/3UPLRXhk5k — Narendra Modi (@narendramodi) April 8, 2023 సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి సర్వం సన్నద్ధమైంది. ► ఉదయం 11.30కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పటి నుంచి తిరిగి 1.30 గంటలకు తిరిగి వెళ్లే వరకు ప్రధాని పర్యటించే ప్రాంతాలు, మార్గాల్లో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)తోపాటు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు, పోలీసులు కలిపి ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్న పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌ను అందంగా అలంకరించారు. ► సైనిక అమర వీరుల వార్ మెమోరియల్ పక్కనే ఉన్న పశ్చిమ ప్రధాన ద్వారం నుంచి ప్రధాని నేరుగా సభా వేదిక వద్దకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ► ప్రధాని అధికారిక కార్యక్రమం కావడంతో కేవలం లక్ష మంది మాత్రమే కూర్చునేందుకు వీలుగా 3 ప్రధాన షెడ్లను ఏర్పాటు చేశారు. ► ప్రధాని సభ అధికారిక కార్యక్రమం కావడంతో పరేడ్‌గ్రౌండ్ లోపల పార్టీ నేతల పోస్టర్లకు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్ చుట్టూ రోడ్లు, మెట్రో పిల్లర్లు, భవనాలు అంతటా బీజేపీ నేతలు పోటాపోటీగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు.. బేగంపేట విమానాశ్రయం–సికింద్రాబాద్ స్టేషన్–పరేడ్ గ్రౌండ్స్ మధ్య మార్గాల్లో నిర్ణీత వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జేఈఈ మెయిన్స్, ఎస్సై అభ్యర్థులకు సంబంధించిన పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో చాలా స్కూళ్లు టెన్త్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. ఆంక్షలతో, సభకు వచ్చే వారితో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఉదయం పరీక్ష ప్రారంభ సమయానికి ట్రాఫిక్ డైవర్షన్లు ఉండవని పోలీసులు అధికారులు చెప్తున్నారు. అభ్యర్థులు, విద్యార్థులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మోదీ పర్యటన కార్యక్రమాలు ఇవీ.. - ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు.. 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు.. - 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు. - 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. - మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. - 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు - 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం... - 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్ వీడియోల ప్రదర్శన. - 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం - 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం. -
‘కేసీఆర్.. రిపబ్లిక్ డే వేడుకల్ని సైతం రద్దు చేసే స్థితికి చేరుకున్నారా?’
హైదరాబాద్: రిపబ్లిక్ వేడుకల్ని రద్దు చేసే పరిస్థితికి చేరుకున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని ధ్వజమెత్తారు. అనేక ఏళ్లుగా పరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోందని, అన్ని రాష్ట్రాలు ఈ సంప్రదాయాలు కొనసాగిస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల్ని గవర్నర్ జరపకుండా తెలంగాణ సర్కార్ అడ్డుపడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపరిచారన్నారు. చివరకు కేంద్రం నిర్వహించే సమావేశాలకు కూడా కేసీఆర్ డుమ్మా కొడుతున్నారని,రాష్ట్రపతి, గవర్నర్‌ను అవమానపరుస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయని కిషన్‌రెడ్డి ఫైరయ్యారు. -
13 నుంచి కైట్, స్వీట్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్‌ని మరింత పెంచే లా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం, పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్ కైట్, ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ 2020 నిర్వహణపై శనివారం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌ను సందర్శించడానికి వచ్చే సందర్శకులకు మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్‌కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి ఆ దేశాల స్వీట్స్ వెరైటీలను ప్రదర్శనలో పాల్గొనేలా ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరంలో స్థిరపడి ఉన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు స్వీట్ ఫెస్టివల్లో పెద్దఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనే విధంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుతో పాటు నిర్వహణ చేపట్టాలన్నారు. -
సైనికుల ఎంపిక షురూ..!
సాక్షి, ఒంగోలు: స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండులో శుక్రవారం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం ఏడు జిల్లాల అభ్యర్థులకు ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఎంపిక ప్రక్రియ జరగనుంది. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి మొత్తం 28,200 మందికిపైగా దరఖాస్తు చేసుకోగా, తొలిరోజు చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన అభ్యర్థులతో ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఆయా జిల్లాల నుంచి 3,400 మంది దరఖాస్తు చేసుకోగా, 2,470 మంది హాజరయ్యారు. వీరంతా గురువారం రాత్రే ఒంగో లు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నాలుగు గంటలకే వారికి బ్యాడ్జీ నంబర్లు కేటాయిస్తూ పరేడ్ గ్రౌండ్లోకి ఆహ్వానించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం శారీరక కొలతలైన ఎత్తు, బరువు, ఛాతి విస్తీర్ణం తదితర పరీక్షలు నిర్వహించారు. అనంతరం 1.6 కిలోమీటర్ల పరుగు పరీక్ష, 9 అడుగుల గొయ్యి దూకడం, 6 కంటే ఎక్కువ పుల్‌ఆప్స్ తీయడం, జిగ్‌జాగ్ బ్యాలెన్స్ వంటి వాటిలో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశారు. వీరికి శనివారం మెడికల్ టెస్టు నిర్వహించనున్నారు. కొనసాగుతున్న నిఘా... ఒక వైపు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుండగా, మరోవైపు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వారు అభ్యర్థులకు తమ ప్రచార పత్రాలను ఇస్తున్నారు. దీంతో పోలీసులు వారిపై నిఘా పెట్టారు. వారిలో కొంతమందిని లోపలకు పిలిపించి వివరాలు సేకరించారు. ఎందుకు వచ్చారని అడిగి తెలుసుకుని వారి మొబైల్ నంబర్లు, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. దళారులపై అనుమానంతో పోలీసులు నిఘా ఉంచారు. అభ్యర్థులను ఏమాత్రం ప్రలోభాలకు గురిచేసినా చట్టబద్ధమైన చర్యలు తప్పవంటూ వారిని హెచ్చరించి పంపించి వేశారు. అభ్యర్థులతో మాట్లాడి ధైర్యం నింపిన జేసీ–2 సిరి... ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్–2 డాక్టర్ సిరి సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. రిక్రూట్మెంట్లో పారదర్శకత ఉంటుందని, ఎటువంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. దళారులు ఎవరైనా మభ్యపెడుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. దేశభద్రతకు సైనికులు ఎలా పనిచేస్తారో.. అలాగే సమాజంలోని అసాంఘిక శక్తుల్ని తుదముట్టించేందుకు కూడా సైన్యంలో చేరాలనుకునే వారు పనిచేయాలని సూచించారు. అనంతరం మీడియాతో జేసీ–2 సిరి మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రోజుకు 3,500 నుంచి 4 వేల మంది అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ చెకప్‌కు ఎంపికైన వారికి మరుసటి రోజు చేస్తారన్నారు. ఆర్మీ నుంచి 7 బృందాల డాక్టర్లు వచ్చారని, అభ్యర్థులకు మెడికల్ చెకప్‌ను వారే నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ ఏడు బృందాలు రోజుకు 280 మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తాయని, మిగిలిన వారికి ఆ మరుసటి రోజు మెడికల్ చెకప్‌లు చేస్తారని, అప్పటి వరకు వారికి కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు స్థానిక డాన్‌బాస్కో స్కూల్లో వసతి కల్పించామని తెలిపారు. రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అభ్యర్థుల కోసం మెప్మా ఆధ్వర్యంలో ఒకటి, డీఆర్డీఏ ఆధ్వర్యంలో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. నగరపాలక సంస్థ మంచినీటి సౌకర్యాన్ని కల్పించిందన్నారు. తొలిరోజు రిక్రూట్మెంట్కు వాతావరణం కూడా అనుకూలించిందన్నారు. ఈ ర్యాలీలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్న వారు హాజరుకాకూడదని, ఆ మేరకు ముందస్తు సూచనలు చేశామని తెలిపారు. అయితే, వాటి గురించి తెలుసుకోని వారు ఎవరైనా హాజరై అస్వస్థతకు గురైతే వారికి తక్షణ వైద్యంఅందించేందుకు రెండు అంబులెన్స్‌లు, ఇద్దరు రిమ్స్ వైద్యులను కూడా అందుబాటులో ఉంచామన్నారు. దళారులను ఎవరూ నమ్మవద్దని, ఎవరైనా అటువంటి వ్యక్తులు తారసపడితే మీడియా కూడా పోలీసుశాఖకు సమాచారం అందించాలని కోరారు. ఎంపిక ప్రక్రియను మిలటరీ అధికారులతో పాటు స్టెప్ ఇన్చార్జి సీఈవో నరసింహారావు పర్యవేక్షిస్తున్నారు. -
3 రోజులు రాష్ట్రావతరణ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనుంది. జూన్ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయజెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించనున్నారు. అదేరోజు సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎల్బీస్టేడియంలో 3న 1,001 మంది కళాకారులతో పేరిణి మహానృత్య ప్రదర్శన, 4న ఐదువేల మంది కళాకారులతో ఒగ్గుడోలు మహా విన్యాసాన్ని నిర్వహించనున్నారు. పీపుల్స్‌ప్లాజాలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, రవీంద్రభారతిలో పలు రంగాల కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి గురువారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు. వేడుకలు ముగిసిన అనం తరం వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, వాహనా ల అలైటింగ్, పికప్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమాచార శాఖ ద్వారా వేడుకల ప్రత్యక్ష ప్రసారం, ఎల్ఈడీ టీవీ, పీఏ సిస్టం, కామెంటేటర్లు, మీడియా కవరేజి వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నగరంలోని రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, చార్మినార్ తదితర ప్రధాన ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ చేపట్టాలన్నారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో పరిశుభ్రత, మొబైల్ టాయిలెట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, అంబులెన్సులు, వైద్యనిపుణుల బృం దాలు, బారికేడ్లు, అగ్నిమాపక యంత్రాల ఏర్పాట్లు, పుష్పాలంకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖ ల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శులు అజయ్ మిశ్రా, అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు సునీల్‌శర్మ, అర్వింద్ కుమార్, పార్థసారథి, అడిషనల్ డీజీపీ తేజ్‌దీప్‌కౌర్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. -
మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పోలీస్ జట్టు విజయం రన్నరప్‌గా రెవెన్యూ జట్టు వరంగల్æ: విధి నిర్వహణలో ఉద్యోగులకు ఎదురయ్యే ఒత్తిళ్లు అధిగమించడంతో పాటు మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం చేస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్షణ్ అన్నారు. హన్మకొండలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో మం గళవారం జరిగిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ – జిల్లా రెవెన్యూశాఖల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన కొద్ది సేపు బ్యాటింగ్, బౌ లింగ్ చేశారు. కమిషనరేట్ జట్టుకు సీపీ సుధీర్‌బాబు, రెవెన్యూ జట్టుకు జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ నాయకత్వం వహించారు. టాస్ గెలిచి పోలీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మెుదట బ్యాటింగ్ చేసిన రెవెన్యూ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. బౌలింగ్‌లో కమిషనర్ సుధీర్‌బాబు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు 15.5 ఓవర్లలో 119 పరుగులు చేసి రెవెన్యూ జట్టుపై విజయం సాధించింది. ఆఖరు ఓవర్లో మెుత్తం ఏడు పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరు బాల్‌కు ఆరు పరుగులు కావాల్సి ఉండగా కోర్ టీం కానిస్టేబుల్ ఖాలిద్ సిక్సర్ కొట్టడంతో విజయం సాధించారు. ఖాలిద్ 76 పరుగులు చే సి కమిషనరేట్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం పోలీస్ కమిషనరేట్, ఎలక్ట్రానిక్ మీడియా జట్ల మధ్య మరో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఇందులో పోలీస్ జట్టు మీడియా జట్టుపై విజయం సాధించింది. కార్యక్రమంలో ఏసీపీలు మహేందర్, శోభన్‌కుమార్, జనార్ధన్, సురేంద్రనాథ్, ఈశ్వర్రావు, రవీందర్రావు, తహశీల్దార్లు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తిలు పాల్గొన్నారు. -
పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు టీఆర్ఎస్ భారీ సభ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ ఈ సభలో పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారని సమాచారం. అయితే ఈ సభ ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి పరేడ్ గ్రౌండ్స్‌లో పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. కేసీఆర్ 7.00 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ చేరకొని 7.15 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిచనున్నారు. ఈ సభ కోసం మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ఒక వేదికపై సీఎంతో సీనియర్ మంత్రులు, మరో వేదికపై జీహెచ్ఎంసీ అభ్యర్థులు, మూడో వేదికపై కళాకారులు ఉంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.