పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు టీఆర్ఎస్ భారీ సభ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ ఈ సభలో పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారని సమాచారం. అయితే ఈ సభ ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి పరేడ్ గ్రౌండ్స్లో పర్యవేక్షిస్తున్నారు.
ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. కేసీఆర్ 7.00 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ చేరకొని 7.15 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిచనున్నారు. ఈ సభ కోసం మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ఒక వేదికపై సీఎంతో సీనియర్ మంత్రులు, మరో వేదికపై జీహెచ్ఎంసీ అభ్యర్థులు, మూడో వేదికపై కళాకారులు ఉంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.