
హైదరాబాద్: రిపబ్లిక్ వేడుకల్ని రద్దు చేసే పరిస్థితికి చేరుకున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని ధ్వజమెత్తారు. అనేక ఏళ్లుగా పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోందని, అన్ని రాష్ట్రాలు ఈ సంప్రదాయాలు కొనసాగిస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
రిపబ్లిక్ డే వేడుకల్ని గవర్నర్ జరపకుండా తెలంగాణ సర్కార్ అడ్డుపడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపరిచారన్నారు. చివరకు కేంద్రం నిర్వహించే సమావేశాలకు కూడా కేసీఆర్ డుమ్మా కొడుతున్నారని,రాష్ట్రపతి, గవర్నర్‌ను అవమానపరుస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయని కిషన్‌రెడ్డి ఫైరయ్యారు.