సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్ వెనున్నపోటు పొడిచారని విమర్శించారు. మొదటి అయిదు సంవత్సరాల్లో ఒక్క మహిళా మంత్రికి కూడా చోటు కల్పించలేదని మండిపడ్డారు. ఎస్సీ సబ్‌ప్లాన్, బీసీ సబ్‌ప్లాన్ ఏమైందో ఇప్పటికీ తెలియదని దుయ్యబట్టారు. బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో ఆదివారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తొలి నుంచి సామాజిక న్యాయం చేసిన పార్టీ బీజేపే పేర్కొన్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిన ఘనత తమదేనని చెప్పారు. దమ్ము, ధైర్యం కలిగిన పార్టీ బీజేపేనని, హామీ ఇస్తే అమలు చేసే సత్తా ఉన్న పార్టీ తమదని అన్నారు. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను బీజేపీ రాష్ట్రపతిని చేసిందని ప్రస్తావించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పెంచాతామని హామీ ఇచ్చారు.
చదవండి: తొలిసారి పోటీ కాదు.. ఏకంగా హ్యాట్రిక్ కోసమే ప్రయత్నాలు ఎక్కువ
Comments
Please login to add a commentAdd a comment